వికీపీడియా చర్చ:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాబితా తయారీ ప్రక్రియ[మార్చు]

మీడియావికీ జాబితాలో పద్ధతిని గమనిస్తే మొదట అందరూ తమ దృష్టిలో ప్రముఖమైనవనుకున్నవన్నీ చేర్చారు. ఆ తరువాత జాబితాని వర్గీకరణలను సమీక్షికుంటూ జాబితాను వెయ్యికి కుదించారని అనిపిస్తుంది. ఈ కుదింపు ప్రక్రియలో ఉదాహారణకి తెలంగాణా సాయుధపోరాటం వ్యాసం జాబితాలో చేర్చాము. మళ్ళీ ప్రత్యేకంగా రజాకార్ల వ్యాసం అవసరమా అన్నటువంటి విషయాలను లేవనెత్తి చర్చించారనుకుంటా --వైజాసత్య 05:27, 19 నవంబర్ 2008 (UTC)

కాసుబాబు గారూ నమస్తే, "తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు" జాబితా తయారుకు ప్రారంభం శుభసూచకం. సభ్యులందరికీ అభినందనలు. మీరు దీనికి మార్గ దర్శకాలు ఇస్తున్నారు, దీనికీ అభినందనలు అందుకోండి. అలాగే, నాపేజీలో చివరిభాగాన ఓ నమూనా జాబితా తయారీకి శ్రీకారం చుట్టాను. దీనికి మూలం వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు. ఈ రూపేణా జాబితా తయారీకి అనుకూలమా కాదా, ఓ మోస్తరులా వున్నది అని తోచితే, సవరణలు చేసి జాబితా తయారు చేయండి, లేదా తగు సూచనలివ్వండి. సోదరుడు నిసార్ అహ్మద్ 19:21, 19 నవంబర్ 2008 (UTC)
అలాగే చేస్తాను. ఇది కొంత సమయం పట్టేలా ఉంది. అందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:55, 20 నవంబర్ 2008 (UTC)
  • వ్యాసం చాలా బాగుంది.మనకు కావలసిన మనం అభువృద్ధి చేయవసిన వ్యాసాలపై కృషి అవగాహన కలిగించడంలో ఈ వ్యాసం సఫలీకృతమౌతూ ఉంది.ఇంతై అంతై వటుడింతై అనేలా వామనమూర్తిలా ఈ వ్యాసాల అభివృద్ధి జరగాలని ఆశిస్తున్నాను.--t.sujatha 15:23, 20 నవంబర్ 2008 (UTC)
వ్యాసం చక్కగా సవ్యమైన దిశలోనే సాగుతున్నది. విజయోస్తు. జాబితాలో వరుస సంఖ్యలను ఇస్తూ పోవడం సౌలభ్యానికి సూచకం. నిసార్ అహ్మద్ 17:06, 20 నవంబర్ 2008 (UTC)
సాహితీకారులు జాబితాలో 9. రవీంద్రనాథ టాగూరు, 10. ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఇవి రెండు వ్యాసాలు తెవికీలో వున్నవి, కానీ ఎర్ర-లింకులు చూపెడుతున్నవి. ఎంత ప్రయత్నించినా అవి ఎర్ర-లింకులే చూపెడుతున్నవి. కారణం తెలీరాలేదు. నిసార్ అహ్మద్ 17:49, 21 నవంబర్ 2008 (UTC)
పేర్లలో ఎక్కడో zwnj (zero widhth non joiner) లేదా space వంటి characters ఉండవచ్చును. సరి చేస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:11, 21 నవంబర్ 2008 (UTC).

జాబితా సవరింపులు[మార్చు]

గమనించండి. 23/11/2008 నాటికి (ఈ వ్యాఖ్య వ్రాసిన సమయంలో) ఈ వ్యాసాల సంఖ్య 1064 ఉంది. కనుక మీరు క్రొత్త వ్యాసాలు చేరిస్తే, అంతగా ప్రాముఖ్యత లేని పాత వ్యాసాలను తొలగించడం మంచిది. మీరు చేసిన మార్పులను చర్చాపేజీలొ తప్పక వ్రాయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:14, 23 నవంబర్ 2008 (UTC)

కాసుబాబుగారూ, వ్యాసం ఒక సవ్యదశకు వచ్చినది, ఇంకనూ 'అనాలిటికల్' గాను, ఒక క్రమంగానూ తయారుచేసుకునే సమయం ఆసన్నమైనది. సభ్యులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి. మీరు అన్నట్టు కొత్త వ్యాసాలు సృష్టింపక ఈ వ్యాసాలపైనే దృష్టి సారించి చక్కటి వ్యాసాలు తయారు చేసుకోవాలి.
సరస్సులు క్రమంలో 'మహాసరస్సులు, ఆధ్యాత్మిక వ్యక్తులలో 'రాధాస్వామి', సాహితీకారులలో 'దండి', భారవి, కళాకారులు సినిమావ్యక్తులలో నర్గిస్ దత్, కే.ఆసిఫ్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ల వ్యాసాలు అంతగా ప్రాముఖ్యత లేవనిపిస్తాయి. సభ్యులు తమ అభిప్రాయాలు తెలుపండి. నిసార్ అహ్మద్ 17:15, 23 నవంబర్ 2008 (UTC)

మార్పుల లాగ్[మార్చు]

24/11/2008 న చేసిన మార్పులు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:43, 24 నవంబర్ 2008 (UTC)

తొలగించినవి
చేర్చినవి


25/11/2008 న చేసిన మార్పులు - - నిసార్ అహ్మద్ 05:12, 25 నవంబర్ 2008 (UTC)

తొలగించినవి
చేర్చినవి

5-01-09 న చేసిన మార్పులు - - నిసార్ అహ్మద్ 17:10, 5 జనవరి 2009 (UTC)

చేర్చినవి

6-02-09 న చేసిన మార్పులు అహ్మద్ నిసార్ 10:37, 6 ఫిబ్రవరి 2009 (UTC) చేర్చినవి;