వికీపీడియా చర్చ:తెలుగు వికీపీడియా కరదీపిక
చిరుపుస్తకం - ఇంకో PDFపెద్ద పుస్తకం
[మార్చు]పుస్తక ప్రదర్శనలో సందర్శకులకు ఇవ్వటానికి ఒక చిరు పుస్తకం తో పాటుగా ఒక పెద్ద పిడిఎఫ్ పుస్తకం కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది అందులో విషయాలను వివరంగా పేర్కొనటంతో పాటు అందుకు సంబంధించిన వీడియోలు ఇతర లింకులు కూడా ఇవ్వవచ్చు అంతేకాక ఎంతో తోడ్పడుతున్న మన వికీపీడియా సభ్యుల పరిచయం ఫోటో వారి కృషి కూడా తగినన్ని పేజీలు కేటాయించవచ్చు . నేను సాధారణంగా ఇలాంటి సామూహిక కార్యక్రమాలలో ప్రత్యేకించి వ్యక్తుల ప్రాధాన్యతకు అంత సుముఖంగా ఉండను అయితే గత ఉత్సవాలలో ప్రచురించిన పుస్తకం నా ఆలోచనను మార్చినది. ఇలాంటివి ప్రస్తుతం స్వచ్ఛందంగా కృషి చేస్తున్న వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇది డిజిటల్ కాపీ కాబట్టి అవసరం అయిన మార్పులు చేస్తూ వుండవచ్చు. Kasyap (చర్చ) 06:32, 5 జూన్ 2024 (UTC)
శీర్షికల వరస
[మార్చు]పుస్తకంలోన్మి మొదటి రెండు శీర్షికలు - "వికిమీడియా ఫౌండేషన్ పరిచయం", "తెలుగు వికీపీడియా పరిచయం" - ఈ రెంటి వరస మారిస్తే బాగుంటుందని అనిపిస్తోంది. ఈ రెంటి లోనూ కొత్తవారికి వికీపీడియా గురించే ఎక్కువ తెలిసే అవకాశం ఉంది. అంచేత, ముందు దాని కథ చెప్పి, ఆ తరువాత దాని పోషకుడి కథ చెబితే బాగుంటుందనిపిస్తోంది (ఫ్లాష్‌బ్యాక్ శైలిలో). __ చదువరి (చర్చ • రచనలు) 10:33, 18 అక్టోబరు 2024 (UTC)