వికీపీడియా చర్చ:తొలగింపు కొరకు వ్యాసాలు/కోన (కొండ)
వర్షాధారంగా నీటిని నిలువ చేసుకుని లేదా సొంతంగా తయారు చేసుకొని నిరంతరం నీరును పంపిణీ చేయగల సామర్థ్యం గల కొండను కోన అంటారు.[ఆధారం చూపాలి]
కోనలో జలపాతం మాదిరిగా నీరు కొండ పై నుంచి పడుట లేదా కాలువ ద్వారా నీరు పల్లానికి చేరుట లేదా ఈ రెండు ఎల్లప్పుడు జరుగుతూ ఉంటుంది.
కోనలో ఎల్లప్పుడు నీటి పారుదలవున్నప్పటికి వాన కాలంలో నీటి ప్రవాహం ఎక్కువగాను ఎండాకాలంలో తక్కువగాను ఉంటుంది.
కోనలో నీటి సౌకర్యం ఉండుట వలన ఇక్కడ పెరిగే చెట్లు పచ్చగా బలంగా ఏపుగా పెరుగుతాయి.
కోన ప్రాంతం అనేక సౌకర్యాలకు అనువుగా ఉంటుంది కాబట్టి మన పూర్వికులు అవకాశం ఉన్న ప్రతి కోనలో దేవాలయాలను నిర్మించారు.[ఆధారం చూపాలి] ఉదాహరణకు భైరవ కోన క్షేత్రం. ఈ కోన ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం అంబవరం, కొత్తపల్లి గ్రామానికి ఆరుకిలోమీటర్లదూరంలో ప్రకాశం-నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో తూర్పు కనుమల మధ్య ఒక లోయలో ఉంది. ఈ కోనలో కొండల నడుమ కొలువై ఉన్న అనేక దేవాలయాలు ఒక సమూహంగా ఉన్నాయి. ఎత్త్తెన కొండలపైఉన్న లింగాల దొరువు నుంచి నీరు ప్రవహించి 200మీటర్ల ఎత్తునుంచి జలపాతంలా పడుతూ కోనగా ఏర్పడి ఇక్కడకు వచ్చే భక్తులకు, యాత్రికులకు కనువిందు చేస్తోంది.[1]
కోనలోని పచ్చని చెట్లు, చల్లని వాతావరణం, జలజలా పారే నీటిధారలు సందర్శకుల మనస్సును ఆనందింపజేస్తాయి.
కోనలో నీరు నిరంతరం పారే చోట నీరు స్వచ్ఛంగా ఉంటుంది అందువలన ఈ నీరు త్రాగేందుకు ఉపయోగపడుతుంది.[ఆధారం చూపాలి]
దేవాలయం ఉన్న కోన ప్రాంతంలో కొండపై భాగం నుంచి ఏరుగా వచ్చి కొంత భాగాన్ని ఆక్రమించిన నీటి సముదాయాన్ని కోనేరు అంటారు.
కోనలో పైనుంచి కింద వరకు మొత్తం ఏటవాలుగా ఉండక అగ్రభాగాన లేదా అగ్రభాగానికి కొంచెం కిందగా భూమి విశాలంగా ఉంటుంది.[ఆధారం చూపాలి]
దాదాపుగా అన్ని కోనలకు ఆ కోనలో వెలసిన దేవుని పేరు గాని ఈ ప్రాంతంలో ఉన్న గ్రామం పేరు గాని పెట్టబడి ఉంటుంది.
కోనను కొండ అని కూడా పిలుస్తారు కాని నీటి సౌకర్యం లేని కొండను కోన అని పిలవరు.[ఆధారం చూపాలి]
కోన కొండకు పర్వతానికి మధ్యస్తంగా ఉంటుంది.
కోనలు
[మార్చు]వీటిని కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు][[వర్గం:భౌగోళిక ప్రాంతాలు]
ఈ వ్యాసం సృష్టించబడిన తేది: 14:43, 1 మే 2012 YVSREDDY చర్చ రచనలు 2,915 బైట్లు
ఈ వ్యాసం సృష్టించబడిన తేది, వ్యాసంలో ఉన్న సమాచారం భద్రపరచుచున్నాను.