వికీపీడియా చర్చ:మొదటి పేజీ సుస్వాగతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టీవీ కార్యక్రమాల ధ్వనిముద్రణ పాఠ్యంతరం సలహా[మార్చు]

ఎట్టకేలకు తెలుగు వికీగురించి HMTV వారి కార్యక్రమం వచ్చింది కాబట్టి, వాటికి స్వేచ్ఛానకలుహక్కుల అనుమతి తీసుకొని లేక సముచిత వినియోగం క్రింద వికీపీడియా లేక కామన్స్ లో భద్రపరచడము. వేగమైన జాల సంధానం లేని వారి కోసం ఆ కార్యక్రమం ధ్వని ముద్రణ పాఠ్యంతరము వికీపీడియా పేరుబరిలో వ్యాసం క్రింద చేర్చడం ఉపయోగపడుతుందిఅనుకుంటాను. ఇది చేసినప్పుడు ఇచ్చిన సమాధానాలకు మరింత స్పష్టత ఇవ్వదలిస్తే ఆయా సమాధానాల దగ్గర లేక చివర సరిపోయిన వికీలింకులతో వివరము చేర్చడం బాగుంటుంది. ఈ విషయమై ఉగాది మహోత్సవ పదాధికారులు వాడుకరి:రహ్మానుద్దీన్,వాడుకరి:Malladi kameswara rao మరియు వాడుకరి:Rajasekhar1961 ఆలోచించమని కోరుతున్నాను. మొదటి కార్యక్రమానికి పాఠ్యంతరము HMTV గారి దగ్గర సిద్ధంగా వుండవచ్చు.--అర్జున (చర్చ) 09:36, 23 డిసెంబర్ 2013 (UTC)

పనిచేయని లింకులు[మార్చు]

పై లింకులు పనిచేయటలేదు. @వాడుకరి:Pavan Santhosh (CIS-A2K) సహాయం చేయగలరా?--అర్జున (చర్చ) 01:15, 9 ఏప్రిల్ 2019 (UTC)

గారూ, మొదటి లింకు సీఐఎస్ బ్లాగులో పోస్టు, దానిలో హెచ్ఎం టీవీ వారి శభాష్ వికీ వీడియో కూడా పోస్టు చేసివుంది. ఆ పోస్టులోని శభాష్‌ వికీ వీడియోని సెంటర్‌ ఫర్ ఇంటర్నెట్‌ అండ్ సొసైటీ వారి ఇంటర్నెట్ అండ్ సొసైటీ అన్న యూట్యూబ్ ఛానెల్లో ఉంది కాబట్టి దానికీ ఏమీ కాలేదు. కాబట్టి అది డెడ్‌లింక్ కాదు. ఇకపోతే, దానికి కొనసాగింపుగా తెలుగు వికీపీడియన్లతో ఫోన్ కార్యక్రమం రెండు భాగాలూ వేరే యూట్యూబ్ ఛానెల్లో (హెఎంటీవీ వారి ఛానెల్లో అనుకుంటున్నాను) ప్రచురించినవి. ఆ యూట్యూబ్ ఛానెల్ తీసివేసి అదే బ్రాండ్ వారు కాస్త పేరుమార్పుతో వేరే ఛానెల్ ఏర్పరుచుకున్నట్టు ఉన్నారు. కాబట్టి, ఈ కంటెంట్ కూడా పోయింది. మొదటి దాని విషయంలో ఏమీ చేయనక్కరలేదు. మిగతా రెంటి విషయంలో మీరేం కోరుతున్నారు, హెచ్ఎం టీవీ వారితో మాట్లాడి చూడమనా? --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 09:32, 9 ఏప్రిల్ 2019 (UTC)
@వాడుకరి:Pavan Santhosh (CIS-A2K) బ్లాగ్ పోస్ట్ లో వీడియో లింకు కనబడకపోతే పనిచేయనట్లే గదా. ఆ యూ ట్యూబ్ వీడియో లింకు తో తాజా చేయండి. నేను వెతికాను కాని కనబడలేదు. మీరు తాజా చేయండి. తరువాత రెండు వీడియోలు ఉపయోగంగా వుంటాయని చేర్చాము. వాటికోసం ప్రయత్నించితే మంచిది. --అర్జున (చర్చ) 09:39, 9 ఏప్రిల్ 2019 (UTC)
@Arjunaraoc: యూట్యూబు లింకు చూడండి, పనిచేస్తోంది. అలానే బ్లాగులోనూ యూట్యూబు వీడియో సచేతనంగా ఉంది. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 12:54, 11 ఏప్రిల్ 2019 (UTC)
పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) గారికి, సిఐఎస్ లింకు నా ఉబుంటు డెస్క్టాప్ లో ఫైర్ఫాక్స్, క్రోమ్ లోను, ఆండ్రాయిడ్ లోను పనిచేయుటలేదు. కావున మీరిచ్చిన యూట్యూబ్ లింకుతో మార్చాను. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:38, 12 ఏప్రిల్ 2019 (UTC)

స్వాగతం పేజీ సంస్కరణ[మార్చు]

పేజీ వీక్షణల అధారంగా, మరియు కొత్త వాడుకరి, వికీపీడియా ప్రాధాన్యాలకు అనుగుణంగా సవరించాను. అర్జున (చర్చ) 10:43, 1 ఆగస్టు 2019 (UTC)