వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/జనన మరణాల నమోదు
ప్రతిపాదనపై స్పందన
[మార్చు] సహాయం అందించబడింది
వికీడేటా సాంకేతికాలు వాడుకుంటే ఈ ప్రాజెక్టు వలన ఉపయోగం మరింత మెరుగవుతుంది. జనన మరణ తేదీలు వికీడేటాలో చేర్చితే ఇతర పనులు సాధ్యమైనంతవరకు (సమాచారపెట్టె తప్పించి పేజీ పాఠ్యం మార్పులు కాక) మానవీయంగా చేయకుండా వాటివలన లాభాన్ని కొన్ని స్క్రిప్టులు, సమాచారపెట్టెల మార్పుల ద్వారా, సమాచారం ప్రపంచమంతటికి ఉపయోగంలోకి వస్తుంది. సముదాయం బలహీనంగా వున్న తెవికీలో సాధ్యమైనంతవరకు మానవీయంగా చేయాల్సినవి సరియైన చోట చేయటం మంచిదని నా అభిప్రాయం. ఇప్పటికే ఇలా చేయడం వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/సమాచారపెట్టె మెరుగు/వికీడేటా ప్రాజెక్టులో జరిగింది. ప్రాజెక్టు ప్రతిపాదించిన చదువరి గారు వికీడేటాలో అనుభవం గలవారు. మిగతా సభ్యులకు వీడియో సమావేశం ద్వారా నేర్పవచ్చు. సందేహాలు, స్పందనలు తెలపండి --అర్జున (చర్చ) 06:32, 22 జూలై 2020 (UTC)
- అర్జున గారూ ఆ పని పట్ల ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు. వికీడేటాలో చెయ్యడం మీరు మొదలుపెట్టండి. ఆసక్తి ఉన్నవారు మిమ్మల్ని చూసి చేరుతారు. ఆ పని ఎలా చెయ్యాలో తెలియకపోతే చెప్పండి, నేను మీకు నేర్పిస్తాను. __చదువరి (చర్చ • రచనలు) 07:24, 22 జూలై 2020 (UTC)