వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం/ప్రతిపాదన ముసాయిదా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సందేహాలు - ప్రశ్నలు

[మార్చు]

విశ్వనాధ్ గారూ మీ ఉత్సాహానికి, చొరవకు, సేవానిరతికి మొదట అభినందనలు. అలాగే క్రింది సందేహాలున్నాయి స్పందించగలరు.

  • ఈ ప్రాజెక్టులో మీరొక్కరే పాల్గోనదలచారా? లేక ఇతర సభ్యులనూ సహసభ్యులుగా తీసుకోదలచారా? తీసుకోదలిస్తే వారి పేర్లు ప్రకటించగలరు.
  • అలాగే, మీ ఐడియా బాగుంది. గ్రందాల జాబితాలను ఎలా గుర్తిస్తారు?
  • ఇప్పటికే డిజిటలైజ్ చేయబడిన గ్రంధాలను గుర్తించడానికి ఎలాంటి ప్రోగ్రాం వున్నది?
  • కేవలం జాబితా (కేటలాగ్) మాత్రమే ప్రాజెక్టు ఉద్దేశ్యమా లేదా కొన్ని అమూల్య గ్రంధాల డిజిటలైజేషన్ కూడా ప్రాజెక్టులో వున్నదా?
  • అతి ముఖ్యమైన, ముఖ్యమైన గ్రంధాలను పుస్తకాలను గుర్తించడానికి వీలుగా ప్రణాళిక ఏమైనా వున్నదా? లేదా మీరు స్వంతంగా ప్రణాళిక సిద్ధ పరచారా?
  • మీరు ఈప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత సమయం కోరుతున్నారు?
  • గ్రంధాలయాలలో ముఖ్యంగా రిఫరెన్స్ పుస్తకాలు, కావ్యాలు, గ్రంధాలు, రచనలు, కథలు, నవలలు, ఇతరత్రాలు వుంటాయి. మీరు వేటి జాబితాలను ప్రాజెక్టుకు స్వీకరిస్తున్నారు?
  • పుస్తకాల వర్గీకరణకు ఆధారం గ్రంధాలయాలలో వుండే జాబితాయేనా లేదా మీరు స్వంతంగా వర్గీకరణ మరియు జాబితా తయారు చేస్తున్నారా?

(మీ ప్రాజెక్టు ఐడియాను సెంట్రలైజ్ చేయడానికి, అనాలిటికల్ మెథడ్ తయారు చేసుకోవడానికి పై ప్రశ్నలు ఉపకరిస్తాయనే ఉద్దేశ్యంతోటి మాత్రమే పై సందేహాలను లేదా ప్రశ్నలను ఏకరువు పెట్టాను) అహ్మద్ నిసార్ (చర్చ) 10:50, 23 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అహ్మద్ నిసార్ గారు కృతజ్నతలు. ఇది వికీమీడియా ఇండివిడ్యువల్ గ్రాంట్ కోసం అప్లై చేస్తున్నది. నేను ఒక్కడిగా చేయాలనేది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇతర వికీ సభ్యుల సహాయం తీసుకొనదలిస్తే తీసుకొనవచ్చు.
  • మొదటి దశ దాటిన తరువాత వ్యాస విస్తరణలో వికీ సభ్యులకు సమాచార లభ్యత వలన వారూ దీన్లో పాలుపంచుకొనవచ్చు, మరియు ప్రముఖ గ్రంధాలయాల విషయ సేకరణకు రాగలవారిని వెంటతీసుకు వెళ్ళి నూతన వ్యాసాలకు మరింత సమాచారం సేకరించదలచాను. దానిని గురించి మరింత త్వరలో రాస్తాను.
  • గ్రంధాల జాబితాలు ప్రతి గ్రంధాలయ్ంలోనూ ఉన్నాయి, అవి రాయబడిన జాబితాలు, అవి ఎలా ఉంటాయి అనేదానికి ఒక పేజీ ఉదాహరణగా ఇచ్చాను
  • ప్రస్తుతం కేట్లాగ్ మాత్రమే చేయాలని అనుకుంటున్నాను. ప్రాజెక్టు పనిలో ఏవైనా కాఫీ హక్కులు లేని గ్రంధాలు, డిజిటైజ్ చేబడనివి ఉంటే గ్రంధాలయాల వారిని అడిగి వాటిని డిజిటైజ్ చేయవచ్చు.
  • నేను ప్రాజెక్టుకు 1 సంవత్సరం కాలం అనుకుంటూన్నను
  • నేను గమనించినంతలో కొత్తగా వస్తున్న నవలలకు, కధలకు కేటలాగ్ ఉంది కాని అన్ని వివరాలు రాయడంలేదు. కేవలం రచన, రచయిత రాస్తున్నరు. కాని దశాబ్దం క్రిందటి వరకూ వాటికి అన్ని వివరాలు ఉన్నాయి. వాటితో పాటూగా విధ్యకు సంవభందించిన, వివిధ రంగాలసంభంద సమాచారం కలిగిన అన్ని వివరాలు ఉన్న పుస్తకాల కేటలాగ్‌లను తీసుకొనదలచాను.
  • గ్రంధాలయాల చరిత్ర, ఊరి వివరం, వాటి కేటలాగ్ ఇలా వస్తాయి. లైబ్రరీలోని ఒక పుస్తకం ఇప్పటికే డిజిటల్ లైబ్రరీ ఇండియాలో కాని, ఆర్కీవ్ లో కాని ఉంటే దానికి ఈ లైబ్రరీలోని కేటలాగ్లో లింక్ ఇవ్వచ్చు...
  • రాజశేఖర్ గారూ చేరుస్తాను.....విశ్వనాధ్ (చర్చ) 12:16, 23 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని వివరాలు చేర్చాలి

[మార్చు]
విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు. నాకొచ్చిన కొన్ని సందేహాల్ని ఇక్కడ చేర్చుతున్నాను.
  • మీరు తీసుకోబోయే గ్రంథాలయాల పేర్లను కూడా ఒక విభాగంలో చేర్చండి.
  • గ్రంథాలయాలలోని పుస్తకాల జాబితాలో ఉండే వివరాలు కాటలాగ్ సంఖ్య, పుస్తకం టైటిల్, రచయిత పేరు, పబ్లిషర్ పేరు, ఊరు, సంవత్సరం ఈ జాబితాలో తప్పకుండా ఉండాలని నా ఉద్దేశం.
  • ఈ ప్రాజెక్టులో మనం జాబితాను మాత్రమే, మాత్రమే తయారుచేస్తున్నాను. మొత్తం పుస్తకాన్ని డిజిటలైజ్ చేయడం లేదు కాబట్టి దీని ఉపయోగాలు మీరు వ్రాసినంత విస్తృతంగా ఉండవని నా వ్యక్తిగత అభిప్రాయం.
  • ఈ ప్రాజెక్టులో ఆసక్తి ఉన్నవారు వారికి తెలిసిన గ్రంథాలయాన్ని కూడా మీ ద్వారా ఈ కాటలాగ్ తయారుచేయడంలో భాగస్వామం చేయవచ్చును.

Rajasekhar1961 (చర్చ) 11:58, 23 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహాలు - సూచనలు

[మార్చు]

విశ్వనాధ్ గారూ, నా స్వీయ అనుభవముతో వ్రాస్తున్న కొన్ని సూచనలు

  1. . ఏ గ్రంధాలయానికి వెళ్ళినా దాదాపు ఒకే రకపు గ్రంధాలు కానవస్తాయి. ఉదాహరణకు ఆ.ప్ర.గ్రంధాలయ సంస్థ వారు లేదా జిల్లాపరిషత్ వారు నిర్వహించే గ్రంధాలయాలలో గ్రందాల సప్లై అందరికీ అంటే అన్ని జిల్లాలకూ అన్ని గ్రంధాలయాలకూ ఒకే విధంగా వుంటాయి. గ్రాంట్లు కూడా అవే విధంగా వుంటాయి.
  2. . ఓ 5 నుండి 10 శాతం పుస్తకాల వరకూ జాబితాలో తేడాలుంటాయి.
  3. . ఉదాహరణకు, ఆంధ్రశాబ్దాకరత్నం అన్ని గ్రంధాలయాలలో వుంటుంది. అలాగే a. ప్రముఖ గ్రంధాలు, b. ధార్మిక గ్రంధాలు, c. ప్రముఖ రచనలు ఉదా:కన్యాశుల్కం, d. ప్రముఖ రచయితలు ఉదా: వి.స.నా., దాశరధి, శ్రీశ్రీ వగైరాలు e. నిఘంటువులు f. ప్రఖ్యాత నవలలు, g. సాహితీ రచనలు h. బయోగ్రఫీలు, మొదలగునవి.
  4. . ఓ రెండు పెద్ద జిల్లా గ్రందాలయాలను లేదా విశ్వవిద్యాలయపు గ్రంధాలయాలను ఎన్నుకోండి. వాటిలో గల అమూల్య గ్రంధాలు, బయట అంత తేలిగ్గా లభించని గ్రంధాలను వాటి వివరాలను సేకరించండి.
  5. . అలాగే మరీ ముఖ్యమైన సూచన : “ప్రముఖ పబ్లిషర్స్” ల జాబితాను తయారు చేసుకోండి. పబ్లిషర్స్ దగ్గర జాబితాలు సులభంగా దొరుకుతాయి. ప్రభుత్వ ముద్రణాలయాలలోనూ జాబితాలు సులభంగా దొరకు తాయి.
  6. . జాబితాలు దొరికినంత సులభంగా పుస్తకాలు దొరకవు, అలాగే, పుస్తకాలు దొరికినంత సులభంగా జాబితాలు దొరకవు, వీటికి సిన్క్రోనైజింగ్ మెథడ్ లో జాబితాలు తయారు చేసుకోవాలి.
  7. . రాజశేఖరులవారు సూచించిన 3వ పాయింట్ చాలా ముఖ్యమైనది. కేవలం జాబితా వల్ల కొంత లాభం జరిగే సూచనలు కానవస్తున్నాయి, కానీ ఎక్కువ లాభం పొందలేమేమో.
  8. . అలాగే వైజాసత్య గారు రచ్చబండలో ఒక సూచన ఇచ్చారు, ప్రతి వ్యక్తికీ వికీలో పేజీ లేనట్లే, ప్రతి పుస్తకానికీ వికీలో పేజీ వుండదు. అత్యంత ముఖ్యమైన, అతి ముఖ్యమైన, ముఖ్యమైన గ్రంధాల మరియు పుస్తకాల జాబితా తయారు చేసుకోవడంలో జాగ్రత్తలు అవసరం.
  9. . అలాగే IEG క్రింద ప్రపోసల్ పెట్టి అప్లై చేసుకోవడానికి ఒకరు + ముగ్గురు లేక నలుగురి సహాయ సహకారాలతో ప్రాజెక్టు చేపట్టవచ్చు.
  10. . సమయం బహుశా 6 నెలలు, ఇంకనూ 6 నెలల కాలాన్ని ఎక్స్టెండ్ చేసుకునే సౌలభ్యం వుందని చదివాను.
  11. . ఈ ప్రాజెక్టులో అనుభవమున్న పవన్ సంతోష్ గారితో వార్తాలాపం చేయండి, మార్గం సులువు గావచ్చు.

అహ్మద్ నిసార్ (చర్చ) 14:00, 23 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పై సూచనలపై నా సమాధానాలు

[మార్చు]
  • ప్రభుత్వ గ్రంధాలయాల ద్వారా ఉండే జాబితాలు దాదాపు ఒకే రకంగా ఉండచ్చు, ప్రైవేటుగా నడుపబడే వాటిలో మాత్రం వేరువేరు పుస్తకాలు ఉంటాయి. జాబితాలు కూడా వారి అమరికను బట్టి సంఖ్య, రచన నేపద్యం ఆధారంగా జాబితాలు తయారు కాబడి ఉన్నాయి. కావాలంటే మనం జాబితాలను మార్పుచేసుకోవచ్చు కాని మనం వాడూకరులకు అందుబాటులో ఉంచాలనే ప్రధాన ఉద్దేశ్యంతో చేస్తున్న పని కనుక గ్రంధాలయ మూల జాబితా బట్టి ఇక్కడ తయారు చేయాలనుకొన్నాం. (ఇక్కడి జాబితా ఆధారంగా ఎవరైనా ఆయా గ్రంధాలయాలకు వెళ్ళి ఎవరి సహాయం లేకుండా పుస్తకాన్ని తీసుకోవచ్చు)
  • నేను చెప్పిన ప్రకారం అన్ని ప్రయోజనాలూ తక్కువ ఎక్కువలలో ఉన్నాయి అయితే రాజశేఖర్ గారు చెప్పినట్టుగా కొన్నిటిని కుదించి రాస్తున్నాను.
  • దీని ద్వారా లాభం పొందేది ఒక్క తరగతికి చెందిన వారు మాత్రమే కాదు. వికీపీడియన్లు, విద్యార్ధులు, సాహిత్యకారులు, మిగిలిన తరగతి పాఠకులు
  • వికీకి నేను రాసిన వాటిలో అన్నిటిలో పూర్తి స్థాయిలో ప్రయోజనం కలుగకున్నా. తెలుగు గ్రంధాల పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది. (ఇప్పటికే ఉన్న ఆర్కీవ్, డీటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లాంతి వాటి ద్వారా అన్ని తెలుగు గ్రంధాల సమాచారం లేదు. ఇప్పుడు మనం చేస్తున్న దాని ద్వారా కేవలం కాపీ హక్కులు కలిగి ఉన్నవి మాత్రమే కాక అన్ని తెలుగు పుస్తకాల సమాచారం అందుబాటులోకి వస్తుంది.....

కనుక ఇది మంచి వనరుగా భవిష్యత్‌లో సైతం కొనసాగుతూ వెళుతుంది...విశ్వనాధ్ (చర్చ) 15:11, 23 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రపోజల్ సబ్మిట్

[మార్చు]

విశ్వనాథ్ గారూ మీ ప్రపోజల్ సబ్మిట్ చేసారా? అహ్మద్ నిసార్ (చర్చ) 13:55, 26 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]