Jump to content

విక్టోరియా కెజార్ హెల్విగ్

వికీపీడియా నుండి

 

విక్టోరియా కెజార్ హెల్విగ్
అందాల పోటీల విజేత
మిస్ గ్రాండ్ డెన్మార్క్ 2022 గా విక్టోరియా కెజార్ హెల్విగ్
జననముమరియా విక్టోరియా కెజార్ హెల్విగ్
(2003-11-13) 2003 నవంబరు 13 (వయసు 21)
హెర్లెవ్, డెన్మార్క్
ఎత్తు1.79 మీ.
జుత్తు రంగురాగి జుట్టు
కళ్ళ రంగునీలం
బిరుదు (లు)
  • మిస్ గ్రాండ్ డెన్మార్క్ 2022
  • మిస్ యూనివర్స్ డెన్మార్క్ 2024
  • మిస్ యూనివర్స్ 2024
ప్రధానమైన
పోటీ (లు)
  • మిస్ డెన్మార్క్ 2021
  • (2వ రన్నరప్)
  • మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2022
  • (టాప్ 20)
  • మిస్ యూనివర్స్ 2024
  • (విజేత)

విక్టోరియా కెజార్ హెల్విగ్ (ఆంగ్లం: Victoria Kjær Theilvig; జననం 2003 నవంబరు 13), డానిష్ మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె మిస్ యూనివర్స్ 2024 కిరీటాన్ని గెలుచుకుంది. మిస్ యూనివర్స్ గెలుచుకున్న మొదటి డానిష్ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె గతంలో మిస్ డెన్మార్క్ 2021లో రెండవ రన్నరప్ గా నిలిచింది. ఆమె మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2022 డెన్మార్క్ కు ప్రాతినిధ్యం వహించి, మొదటి ఇరవై స్థానాల్లో నిలిచింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

విక్టోరియా కెజార్ 2003 నవంబరు 13న కోపెన్‌హాగన్ శివారు ప్రాంతమైన హెర్లెవ్ లో జన్మించింది.[1] ఆమె మాదకద్రవ్య వ్యసనాలతో కూడుకున్న కుటుంబంలో పెరిగింది, ఆమె అత్యాచార బాధితురాలు.[2] లింగ్బీ హ్యాండెల్స్జిమ్నాసియం (Lyngby Handelsgymnasium)కు హాజరయిన ఆమె, వ్యాపారం, మార్కెటింగ్ లతో డిగ్రీ చదివింది.[3][1] ఆ తరువాత, ఆమె నర్తకిగా కెరీర్ మొదలుపెట్టింది. మానసిక ఆరోగ్య అవగాహన, జంతు హక్కులు, సౌందర్య పరిశ్రమలలో వ్యవస్థాపకత కోసం ఆమె కృషి చేసింది.[3]

అందాల పోటీలు

[మార్చు]

విక్టోరియా కెజార్ హెల్విగ్ మిస్ డెన్మార్క్ 2021 పోటీదారుగా పాల్గొని, రెండవ రన్నరప్ గా నిలిచింది. మరుసటి సంవత్సరం, ఆమె మిస్ గ్రాండ్ డెన్మార్క్ గా నియమితురాలయ్యింది. ఇండోనేషియాలో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2022లో డెన్మార్క్ కు ప్రాతినిధ్యం వహించి, మొదటి ఇరవై స్థానాల్లో నిలిచింది.[4][5] సెప్టెంబరు 2024లో, మిస్ యూనివర్స్ 2024లో ఆమె డెన్మార్క్ కు ప్రాతినిధ్యం వహించింది.[6]

మిస్ యూనివర్స్ 2024

[మార్చు]

మిస్ యూనివర్స్ డెన్మార్క్ కు ఆమె నవంబరు 16న మెక్సికో నగరంలో జరిగిన మిస్ యూనివర్స్ 2024లో పోటీపడి విజేతగా నిలిచింది. ఆమె మిస్ యూనివర్స్ కిరీటాన్ని పొందిన మొదటి డానిష్ మహిళగా, మిస్ యూనివర్స్ 2004లో ఆస్ట్రేలియాకు చెందిన జెన్నిఫర్ హాకిన్స్ తర్వాత మొదటి అందగత్తె మహిళగానూ గుర్తింపుపొందింది.[7][8][9] ఆమె, అదనంగా, మిస్ ఎర్త్ 2001 కాథరినా స్వెన్సన్ తర్వాత బిగ్ ఫోర్ అంతర్జాతీయ అందాల పోటీలలో రెండవ డానిష్ మహిళ.[10]

నికరాగ్వాకు చెందిన అవుట్గోయింగ్ టైటిల్ హోల్డర్ షెయిన్నిస్ పలాసియోస్ ఆమెను మిస్ యూనివర్స్ 2024 కిరీటంతో సత్కరించింది.[11]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Díaz, Francisco Javier (17 November 2024). "¿Quién es la nueva Miss Universe 2024? Lo que debes saber sobre la ganadora". El Nuevo Día (in Spanish).{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. Ritzau (16 November 2024). "Victoria fra Søborg bliver kaldt en af Miss Universe-konkurrencens favoritter". TV 2 Kosmopol.
  3. 3.0 3.1 Yap, Jade Veronique (17 November 2024). "Who is Miss Universe 2024 Victoria Kjaer Theilvig?". GMA Network.
  4. "Miss Grand Denmark 2022 is Victoria Kjær Theilvig & More Latest News Here". Abcnews.upjobsnews.com. 18 September 2022. Archived from the original on 19 September 2022. Retrieved 19 September 2022.
  5. "Philippines finishes in top 20, Brazil wins Miss Grand International 2022". Philstar Global. 26 October 2022. Archived from the original on 1 November 2024.
  6. "Miss Universe 2024: Meet the contestants". Periodismo.com. 16 June 2024. Archived from the original on 8 July 2024. Retrieved 9 September 2024 – via MSN.
  7. Konstantinides, Anneta (17 November 2024). "20 Miss Universe contestants who made history during the 2024 pageant". Business Insider. Yahoo!.
  8. "Victoria Kjær Theilvig of Denmark is crowned the 73rd Miss Universe". Associated Press. 17 November 2024. Retrieved 17 November 2024.
  9. Ginestra, Mauricio (16 November 2024). "Miss Universe 2024: Who Won? Who Were the Finalists? And Everything That Happened Step by Step". Latin Times.
  10. Bolledo, Jairo (2024-11-17). "Victoria Kjær Theilvig wins Miss Universe 2024, the first crown for Denmark". RAPPLER (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-11-17.
  11. "Victoria Kezar Hellwig: బార్బీ బొమ్మకు... విశ్వసుందరి కిరీటం". EENADU. Retrieved 2024-11-18.