విక్రమ్ మిస్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విక్రమ్ మిస్రీ
2018 జనవరి 15న రాష్ట్రపతి భవనంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ను కలిసిన విక్రమ్ మిస్రీ
35వ భారతదేశ విదేశాంగ కార్యదర్శి
Assumed office
2024 జూలై 15
ప్రధాన మంత్రినరేంద్ర మోదీ
మినిస్టర్ఎస్. జైశంకర్
అంతకు ముందు వారువినయ్ మోహన్ క్వాత్రా
భారత జాతీయ డిప్యూటీ భద్రతా సలహాదారు
In office
2022 జనవరి 1 – 2024 జూలై 14
అంతకు ముందు వారుపంకజ్ సరన్
26వ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు భారత రాయబారి
In office
2019 జనవరి 8 - 2021 డిసెంబరు 11
అంతకు ముందు వారుగౌతమ్ బంబావాలే
తరువాత వారుప్రదీప్ కుమార్ రావత్
వ్యక్తిగత వివరాలు
జననం (1964-11-07) 1964 నవంబరు 7 (వయసు 59)
శ్రీనగర్, భారతదేశం
కళాశాల
  • సింధియా స్కూల్
  • హిందూ కళాశాల, ఢిల్లీ
  • XLRI

విక్రమ్ మిస్రీ (జననం 1964 నవంబరు 7) ఒక భారతీయ దౌత్యవేత్త. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ 1989 బ్యాచ్‌కు చెందిన ఆయన భారత 35వ విదేశాంగ కార్యదర్శిగా నియమించబడ్డాడు. కాగా, ఆయన జూలై 2024లో వినయ్ మోహన్ క్వాత్రా నుంచి బాధ్యతలు స్వీకరించనునున్నాడు.[1][2] దీనికి ముందు, ఆయన 2022 జనవరి 1 నుండి భారత ఉప జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశాడు.[3] జనవరి 2019 నుంచి డిసెంబరు 2021 వరకు చైనాలో భారత రాయబారిగా వ్యవహరించాడు.[4]

గతంలో, ఆయన ప్రధానమంత్రులు ఇందర్ కుమార్ గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ ల వద్ద ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేశాడు, స్పెయిన్, మయన్మార్లలో భారత రాయబారిగా కూడా విధులు నిర్వర్తించాడు.[5][6]

ప్రారంభ జీవితం

[మార్చు]

విక్రమ్ మిస్రీ 1964 నవంబరు 7న భారతదేశంలోని శ్రీనగర్ లో ఒక కాశ్మీరీ హిందూ కుటుంబంలో జన్మించాడు. తన ప్రారంభ విద్య సింధియా పాఠశాలలో కొనసాగింది. ఆ తరువాత, ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం హిందూ కళాశాల నుండి చరిత్రలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసాడు. జంషెడ్‌పూర్ XLRI-జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్ నుండి ఎంబీఏ కూడా పూర్తి చేసాడు.[7]

కెరీర్

[మార్చు]

ఆయన అడ్వర్టైజ్మెంట్ రంగంలో మూడు సంవత్సరాల పాటు పనిచేసాక, ఆయన 1989లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ లో చేరాడు. 1991, 1996ల మధ్య, అతను బ్రస్సెల్స్, ట్యునీషియాలోని భారతీయ మిషన్లలో వివిధ హోదాల్లో పనిచేసాడు. 1997లో ప్రధానమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ కు ప్రైవేట్ కార్యదర్శిగా నియమితులయ్యాడు. దీని తరువాత, ఆయన ప్రధాన మంత్రి కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖలతో పాటు విదేశాలలో అనేక భారతీయ మిషన్లలో వివిధ హోదాల్లో పనిచేసాడు.

2012లో ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యక్తిగత కార్యదర్శిగా నియమితులయ్యాడు.[8] ఆ తరువాత, ఆయన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఆ హోదాలో కొనసాగాడు. 2014లో స్పెయిన్ కు రాయబారిగా నియమితులయ్యాడు.[9] 2016లో ఆయన మయన్మార్ రాయబారిగా నియమితులయ్యాడు.

2019లో ఆయన చైనాలో రాయబారిగా నియమితులయ్యాడు. చైనా-ఇండియా ఉద్రిక్తతల సమయంలో ఆయన రాయబారిగా ఉన్నాడు, ఈ క్రమంలో చర్చలకు లియు జియాన్చావో (Liu Jianchao) సహా చైనా సీనియర్ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించాడు.[10][11][12]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన డాలీ మిస్రిని వివాహం చేసుకున్నాడు, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.[13] అతను ఇంగ్లీష్, హిందీ, కాశ్మీరీ భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. ఫ్రెంచ్ భాషలో కూడా ఆయనకు పరిజ్ఞానం కలిగి ఉన్నాడు.[13]

మూలాలు

[మార్చు]
  1. "విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శిగా విక్రమ్‌ మిస్రీ నియామకం | general". web.archive.org. 2024-06-29. Archived from the original on 2024-06-29. Retrieved 2024-06-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Vikram Misri named India's next foreign secretary, who is he?". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-06-28. Retrieved 2024-06-28.
  3. "China expert Vikram Misri, who has been aide to 3 PMs, is India's new deputy NSA". Hindustan Times (in ఇంగ్లీష్). 27 December 2021. Retrieved 28 December 2021.
  4. "Amb Vikram Misri had farewell call on Chinese FM Wang Yi, expressed hope for complete resolution of border issues soon". NewsOnAIR. 7 December 2021. Retrieved 28 December 2021.
  5. PTI (2014-07-20). "Sanjeev Kumar Singla appointed private secretary to PM Narendra Modi". mint (in ఇంగ్లీష్). Retrieved 2021-07-11.
  6. "Vikram Misri Biography: Birth, Age, Early Life, Family, Education, Career, Assignments, and More". Jagranjosh.com. 28 December 2021. Retrieved 28 December 2021.
  7. "Vikram Misri takes charge as India's new envoy to China". The Hindu (in Indian English). PTI. 2019-01-08. ISSN 0971-751X. Retrieved 2021-07-11.
  8. "Reshuffle in PMO: IFS officer Vikram Misri made private secy". Hindustan Times (in ఇంగ్లీష్). 2012-10-10. Retrieved 2021-07-11.
  9. "Sanjeev Kumar Singla appointed as Private Secretary to Prime Minister Narendra Modi". India Today (in ఇంగ్లీష్). July 21, 2014. Retrieved 2021-07-11.
  10. Chaudhury, Dipanjan Roy. "Indian envoy to China Vikram Misri meets top party functionary to discuss LAC tensions". The Economic Times. Retrieved 2021-07-11.
  11. Basu, Nayanima (14 August 2020). "India seeks more engagement with China on border row, envoy Misri meets top Chinese officials". The Print. Retrieved 2021-07-13.
  12. "Indian envoy meets Chinese vice foreign minister, emphasises on complete disengagement in eastern Ladakh | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Mar 6, 2021. Retrieved 2021-07-13.
  13. 13.0 13.1 "Ambassador's Profile". Embassy of India, Beijing, China. Retrieved 2021-07-11.