సుబ్రహ్మణ్యం జైశంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుబ్రహ్మణ్యం జైశంకర్
సుబ్రహ్మణ్యం జైశంకర్

Minister of External Affairs S. Jaishankar


ప్రధాన మంత్రి Narendra Modi

నియోజకవర్గం Gujarat

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ


Indian Ambassador to China

సింగపూర్ కు భారత హైకమీషనర్

చెక్ రిపబ్లిక్ కు భారత దౌత్యవేత్త

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి Kyoko Jaishankar
సంతానం 3 (Dhruva, Arjun & Medha)
పూర్వ విద్యార్థి St. Stephen's College, Delhi (BA)
Jawaharlal Nehru University (MA, MPhil, PhD)
వృత్తి Diplomat
Politician
పురస్కారాలు పద్మశ్రీ (2019)

సుబ్రహ్మణ్యం జైశంకర్ (జననం 1955 జనవరి 9) ఒక భారతీయ దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు. అతను 2019 మే 31 నుండి భారత ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నాడు. అతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు. గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ 2019 జూలై 5 నుండి రాజ్యసభలో భారత పార్లమెంటు సభ్యునిగా వ్యవహరిస్తున్నాడు. అతను గతంలో విదేశాంగ కార్యదర్శిగా 2015 జనవరి నుండి [1][2] 2018 జనవరి వరకు పనిచేశాడు.[3]

1977లో భారత విదేశాంగ సేవ అధికారిగా ప్రభుత్వోద్యోగంలో చేరాడు. 2014-2015 సంవత్సరాల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, 2009-2013 చైనాలో, 2001-04 చెక్ రిపబ్లిక్లో భారత రాయబారిగా పనిచేశాడు. 2007-09లో సింగపూర్ దేశానికి భారత హై కమిషనర్ గా పనిచేశాడు. ఇండో-అమెరికన్ అణు ఒప్పందానికి సంబంధించిన సంప్రదింపుల్లో కీలక పాత్ర పోషించాడు.

పదవీ విరమణ అనంతరం టాటా సన్స్ కంపెనీలో గ్లోబల్ కార్పొరేట్ అఫైర్స్ విభాగానికి అధ్యక్షునిగా చేరాడు.[4] 2019లో అతన్ని భారతదేశంలో పౌరపురస్కారాల్లో నాలుగవ స్థాయిదైన పద్మశ్రీతో ప్రభుత్వం సత్కరించింది.[5] 2019 మే 30న ప్రధానమంత్రి మోడీ రెండవ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[6] 2019 మే 31న విదేశాంగ వ్యవహారాల మంత్రిగా పదవీ స్వీకారం చేశాడు. క్యాబినెట్ మంత్రిగా విదేశాంగ శాఖ బాధ్యతలు స్వీకరించిన రెండవ మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శిగా నిలిచాడు.[7][8]

మూలాలు

[మార్చు]
  1. ACC Appointment, Press Information Bureau, 29 January 2015
  2. S Jaishankar, is the new foreign secretary Archived 2015-01-30 at the Wayback Machine, Hindustan Times, 29 January 2015
  3. "MEA | About MEA : Profiles : Foreign Secretary" (in ఇంగ్లీష్). Retrieved 7 February 2018.
  4. "Tata Sons announces appointment of new president, Global Corporate Affairs". Tata. 23 April 2018. Archived from the original on 25 మే 2018. Retrieved 25 May 2018.
  5. "Former Indian foreign secretary Subrahmanyam Jaishankar to be conferred with Padma Shri". www.timesnownews.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 3 మే 2022. Retrieved 29 January 2019.
  6. Roche, Elizabeth (30 May 2019). "S Jaishankar: Modi's 'crisis manager' sworn-in as union minister". Mint (in ఇంగ్లీష్). Retrieved 30 May 2019.
  7. "Narendra Modi Government 2.0: Former foreign secretary S Jaishankar appointed as Minister of External Affairs". cnbctv18.com. Retrieved 4 June 2019.
  8. Andhra Jyothy (18 July 2023). "రాజ్యసభకు జైశంకర్‌ ఎన్నిక ఏకగ్రీవం". Archived from the original on 18 July 2023. Retrieved 18 July 2023.