Jump to content

విక్రమ్ సేఠ్

వికీపీడియా నుండి

విక్రమ్ సేఠ్ : విక్రమ్ సేఠ్ (జననం: జూన్ 20, 1952 ), భారతీయ ఆంగ్ల నవలా రచయిత, కవి, పద్మశ్రీ పురస్కార గ్రహీత.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

విక్రమ్ సేఠ్ హిందూ కుటుంబంలో పుట్టి, కోల్‌కతా లో పెరిగాడు. టన్‌బ్రిడ్జ్ స్కూల్, డూన్ స్కూల్‌లో అతని విద్యాభ్యాసం జరిగింది. ఆక్స్‌ఫర్డ్ లోని కార్పస్‌క్రిస్టి కాలేజిలో ఆర్థికశాస్త్రం, తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం చదువుకొని, స్టాన్‌ఫర్డ్ యునివర్సిటీలో ఆర్థికశాస్త్రంలో పి.జి. చేశాడు. చైనాలోని నాన్‌జింగ్ యునివర్సిటీలో చైనీస్ కవిత్వాన్ని అధ్యయనం చేశాడు. స్టాన్‌ఫర్డ్ యునివర్సిటీ, కాలిఫోర్నియా నుండి ఎమ్.ఏ. డిగ్రీని పొందాడు. ఇతని తల్లి, లీలా సేఠ్, తొలి భారతీయ మహిళా చీఫ్‌ జస్టిస్.

నవలలు

[మార్చు]

1. ది గోల్డెన్ గేట్ ( 1986 ) ; శాన్‌ఫ్రాన్సిస్‌కో గురించి. [1] 2. ఎ సుటెబుల్ బాయ్ ( 1993 ) ; 19 శతాబ్దపు భారతదేశం గురించి. [2] 3. యాన్ ఈక్వల్ మ్యూజిక్. [3]

కవిత్వాలు

[మార్చు]

1. మ్యాపింగ్స్ ( 1980 ) [4] 2. ఫ్రమ్ హెవెన్ లేక్ ( 1983 ) 3. ద హమ్‌బల్ అడ్‌మినిస్ట్రేటర్స్ గార్డెన్ ( 1985 ) [5] 4. ఆల్ యు హు స్లీప్ టునైట్ ( 1990 ) [6] 5. బీస్ట్లీ టేల్స్ ( 1991 ) [7] 6. త్రీ చైనీస్ పోయెట్స్ ( 1992 ) [8]

అవార్డులు

[మార్చు]
పద్మశ్రీపురస్కారం
  • 1983 Thomas Cook Travel Book Award From Heaven Lake: Travels Through Sinkiang and Tibet
  • 1985 Commonwealth Poetry Prize (Asia) The Humble Administrator's Garden
  • 1993 Irish Times International Fiction Prize (shortlist) A Suitable Boy
  • 1994 Commonwealth Writers Prize (Overall Winner, Best Book) A Suitable Boy
  • 1994 WH Smith Literary Award A Suitable Boy
  • 2001 EMMA (BT Ethnic and Multicultural Media Award) for Best Book/Novel An Equal Music
  • 2005 Pravasi Bharatiya Samman
  • 2007 పద్మశ్రీ బహుమతి.

బయటి లింకులు

[మార్చు]