విజయ తెలంగాణ మెగా డెయిరీ
రకం | తెలంగాణ ప్రభుత్వ సబ్సిడరీ |
---|---|
పరిశ్రమ | పాలు, డెయిరీ |
స్థాపన | 2023 |
ప్రధాన కార్యాలయం | , |
ఉత్పత్తులు |
విజయ తెలంగాణ మెగా డెయిరీ అనేది తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, రావిర్యాలలో ఉన్న డెయిరీ. 40 ఎకరాల విస్తీర్ణంలో 250 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ మెగా డెయిరీ 2023, అక్టోబరు 5న ప్రారంభించబడింది.[1]
నిర్మాణం
[మార్చు]2021 సెప్టెంబరు 3న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి ఈ మెగా డెయిరీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.
దేశంలోనే అత్యాధునిక, ఆటోమేషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో నిర్మించిన ఈ విజయ మెగా డెయిరీలో నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ) సహకారంతో రోజూ 5 లక్షల నుంచి 8 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ చేసేలా మిషనరీ ఏర్పాటు చేశారు.[2] ఈ డెయిరీ నిర్వహణకు సోలార్ విద్యుత్తును వినియోగిస్తున్నారు. సోలార్ విద్యుదుత్పత్తి వ్యవస్థతోపాటు, వ్యర్థాల వినియోగంతో విద్యుత్తును ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ మెగా డెయిరీలో మిల్క్ పైపు బ్రిడ్జి, సివిల్ పనులు, ల్యాబొరేటరీ, నెయ్యి శుద్ధి, వెన్న తయారీ, ఐస్‌క్రీం ప్యాకింగ్, ఐస్‌క్రీం మిక్స్ ప్రిపరేషన్, పెరుగు ప్యాకింగ్, శీతలీకరణ విభాగాలున్నాయి.[3]
ఉత్పత్తులు
[మార్చు]ఇందులో రోజుకు లక్ష లీటర్ల టెట్రా బ్రిక్ పాల ప్యాకెట్ల తయారీతోపాటు ప్రతినెలా 30 టన్నుల వెన్న తయారీకానుంది. రోజుకు 10 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం గల యంత్ర పరికరాలు ఏర్పాటుచేశారు. రోజుకు 5 వేల నుంచి 10 వేల లీటర్ల ఐస్ క్రీం తయారీ, రోజుకు 20 టన్నుల పెరుగు ఉత్పత్తి, రోజుకు 12 వేల లీటర్ల మజ్జిగ, లస్సీ తయారీ కానున్నాయి.[4]
ప్రారంభం
[మార్చు]ఈ మెగా డెయిరీ 2023, అక్టోబరు 5న రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలోమంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "KTR Launch Vijaya Mega Dairy Plant at Raviryala : రాష్ట్రంలో పాడి రైతాంగ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు: మంత్రి కేటీఆర్". ETV Bharat News. 2023-10-05. Archived from the original on 2023-10-11. Retrieved 2023-10-11.
- ↑ Shanker (2023-10-05). "విజయ మెగా డెయిరీని ప్రారంభించిన మంత్రి కెటిఆర్". Mana Telangana. Archived from the original on 2023-10-05. Retrieved 2023-10-11.
- ↑ ABN (2023-10-03). "ప్రారంభానికి విజయ మెగా డెయిరీ ప్లాంట్ సిద్ధం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-10-11. Retrieved 2023-10-11.
- ↑ telugu, NT News (2023-10-05). "Vijaya Dairy | రావిర్యాలలో విజయ మెగా డెయిరీని ప్రారంభింనున్న మంత్రి కేటీఆర్.. లక్ష మంది పాడి రైతులకు ప్రయోజనం". www.ntnews.com. Archived from the original on 2023-10-05. Retrieved 2023-10-11.
- ↑ telugu, NT News (2023-10-05). "KTR | పాడి రైతులకు రూ. 350 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చాం : మంత్రి కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-10-06. Retrieved 2023-10-11.