విజ్ఞాన చంద్రికా మండలి
సమాజం ముందడుగు వేయాలంటే విజ్ఞానంలో అభివృద్ధి అత్యవసరమని గుర్తించి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, నాయని వేంకట రంగారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, రావిచెట్టు రంగారావు వంటివారు 1906 లో హైదరాబాదులో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి స్థాపించారు. అప్పటివరకు తెలుగులో రచనలు సాహిత్యానికే అధికంగా పరిమితమై ఉండేవి. అందరికీ ఆధునిక విజ్ఞానాన్ని అందించడానికి తెలుగులో విజ్ఞానశాస్త్రము, చరిత్ర వంటి విషయాలలో పుస్తకాలు ప్రచురించుట వారి లక్ష్యము. ఈ మండలి ప్రధానోద్దేశ్యము ఇలా చెప్పబడింది - స్వరాజ్యం కొఱకు ఆంధ్రదేశంలోను, యావద్భారతంలోను కూడా గాఢ వాంఛ ప్రబలియున్నది. కులమత భేదాలు లేక యుక్తవయసు వచ్చిన ప్రతి పురుషునికి, స్త్రీకి వోటు గలిగిన స్వరాజ్యమే మన గమ్యస్థానం.....పంచముల అస్పృశ్యత రూపుమాపనిది స్వరాజ్యము రానేరదు. .... ఆంధ్ర ప్రజలకు నవీన ప్రపంచములో అత్యంతముగా వృద్ధియైన ప్రకృతి శాస్త్ర, చారిత్రక, రాజకీయ, ఆర్ధిక విజ్ఞానములనిచ్చుట ఆవశ్యకము.
విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి తెలుగుదేశానికి అందించిన మొదటి పుస్తకం గాడిచర్ల హరి సర్వోత్తమరావు రచించిన "అబ్రహాం లింకన్". దీని ప్రచురణకు ప్రూఫులు దిద్దడం నుండి తొలిపలుకు వ్రాయడం వరకు చాలా భారాన్ని లక్ష్మణరావు నిర్వహించాడు.
మండలి ప్రచురించిన గ్రంథాలు
[మార్చు]మండలి ప్రచురించిన ముఖ్య గ్రంథాలలో కొన్ని ఈ పట్టికలో చూడొచ్చు:[1]
ప్రచురణ కాలం | గ్రంథం పేరు | రచయిత పేరు |
---|---|---|
1907 | అబ్రహాం లింకను చరిత్ర | గాడిచర్ల హరిసర్వోత్తమరావు |
1907 | హిందూ మహాయుగం (క్రీ,శ.1000 వరకు) | కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు |
1907 | జీవశాస్త్రము | ఆచంట లక్ష్మీపతి |
1908 | రాణీ సంయుక్త | వేలాల సుబ్బారావు |
1908 | మహమ్మదీయ మహాయుగము (సా.శ..1000 నుండి 1560 వరకు) | కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు |
1909 | పదార్థ విజ్ఞాన శాస్త్రము | మంత్రిప్రగడ సాంబశివరావు |
1909 | రసాయన శాస్త్రము | వేమూరి విశ్వనాధ శర్మ |
1910 | ఆంధ్రదేశ చరిత్ర (సా.శ.. 1100 వరకు) |
చిలుకూరి వీరభద్రరావు |
1910 | ఆంధ్రదేశ చరిత్ర (సా.శ.. 1100 నుండి సా.శ.. 1323 వరకు) |
చిలుకూరి వీరభద్రరావు |
1910 | విమలాదేవి | భోగరాజు నారాయణ మూర్తి |
1910 | కలరా | ఆచంట లక్ష్మీపతి |
1910 | జంతుశాస్త్రము | -- |
1910 | వృక్షశాస్త్రము | వి. శ్రీనివాసరావు |
1910 | శారీరకశాస్త్రము | -- |
1911 | స్వీయచరిత్రము 1-2 భాగములు |
చిలుకూరి వీరభద్రరావు |
1911 | భౌతికశాస్త్రము | మైనంపాటి నరసింహం |
-- | చంద్రగుప్త చక్రవర్తి | ? |
-- | మహాపురుషుల జీవితచరిత్రలు | కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు |
-- | రావిచెట్టు రంగారావు జీవితచరిత్ర | కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు |
-- | వ్యవసాయ శాస్త్రము (2 భాగములు) | గోవేటి జోగిరాజు |
-- | భారత అర్థశాస్త్రము (2 భాగములు) | కట్టమంచి రామలింగారెడ్డి |
-- | చలిజ్వరము | ఆచంట లక్ష్మీపతి |
-- | విజయనగర సామ్రాజ్యము | దుగ్గిరాల రాఘవచంద్ర్యచౌదరి |
-- | రాయచూరి యుద్ధము | కేతవరపువేంకటశాస్త్రి |
-- | అస్తమయము | భోగరాజు నారాయణ మూర్తి |
-- | అల్లాహా అక్బర్ | భోగరాజు నారాయణ మూర్తి |
-- | ప్రళయభైరము | ఎ.వి. నరసింహ పంతులు |
- డాక్టర్ ఆచంట లక్ష్మీపతి - జీవశాస్త్రం (3,000 ప్రతులు అమ్ముడు పోయాయి), కలరా, మలేరియా (ఇవి రెండూ అనతికాలంలోనే 8,000 ప్రతులు అమ్ముడు పోయాయి)
- మంత్రిప్రగడ సాంబశివరావు - పదార్థ విజ్ఞాన శాస్త్రం
- దుగ్గిరాల రామచంద్రయ్య చౌదరి - విజయనగర సామ్రాజ్యం
- కందుకూరి వీరేశలింగం - స్వీయచరిత్ర
1906 - 1910 మధ్యకాలంలో మండలి 30 పైగా గ్రంథాలను ప్రచురించింది. గ్రంథాలన్నింటిలోనూ సంపాదకునిగా లక్ష్మణరావు హస్తం సోకనిదేదీ లేదంటారు. 1908 లో ఈ సంస్థను మద్రాసుకు మార్చారు.
విజ్ఞాన చంద్రికా పరిషత్తు
[మార్చు]1912లో దీనికి అనుబంధంగా విజ్ఞాన చంద్రికా పరిషత్తును స్థాపించారు. గ్రంథ పఠనాభిరుచిని పెంపొందించడం పరిషత్తు లక్ష్యం. అనేక కేంద్రాలలో సాహిత్యం, చరిత్ర, ప్రకృతి శాస్త్రం వంటి రంగాలలో పోటీలు పెట్టి విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు ఇచ్చేవారు.
ఈ పరిషత్తు విజ్ఞానచంద్రికా మండలి వారిచే 3 సంవత్సరముల కొకసారి ఏర్పరుపబడును. ఇందు ఒక అధ్యక్షుడును, ఒక ఉపాధ్యక్షుడును, 7 గురు సభాసదులును ఉందురు.
సభాసదులలో నలుగురు విజ్ఞానచంద్రికా సభాసదులుగా నుండవలెను. మండలి సభాసదులలో నొక్కరు దీనికి కార్యదర్శిగా నుండవలెను. మొదటి 3-సంవత్సరములలో ఈక్రింద నుదహరించినవారు పరిషత్తునకు సభాసదులు.
అధ్యక్షుడు : రావుబహదూరు కందుకూరి వీరేశలింగము పంతులు గారు, రాజమహేంద్రవరము.
ఉపాధ్యక్షుడు : వావిలికొలను సుబ్బారావు పంతులు గారు, చెన్నపట్టణము.
సభాసదులు :
- కట్టమంచి రామలింగారెడ్డి గారు, మైసూరు.
- కే. వి. లక్ష్మణరావు గారు, మునగాల.
- ఆచంట లక్ష్మీపతి గారు బి. ఏ., చెన్నపట్టణము.
- అయ్యదేవర కాళేశ్వరరావు గారు, బెజవాడ.
- పి. శ్రీనివాసాచార్యులు గారు
- చిలుకూరి వీరభద్రరావు గారు, చెన్నపట్టణము.
- వి. వి. శర్మ గారు.
మూలాలు
[మార్చు]- ↑ అజ్మీరు వీరభద్రయ్య. తెలుగు భాష, చరిత్రల పరిశోధనా పితామహుడు శ్రీ కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు జీవిత చరిత్ర. అజ్మీరు వీరభద్రయ్య.