విఠలరావు గాడ్గిల్
విఠలరావు గాడ్గిల్ | |
---|---|
పౌర విమానయాన శాఖ మంత్రి | |
ప్రధాన మంత్రి | రాజీవ్ గాంధీ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1928 సెప్టెంబరు 22 [1] |
మరణం | 2001 |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
విఠలరావు గాడ్గిల్ (1928 సెప్టెంబరు 22 - 2001) భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. రాజీవ్ గాంధీ హయాంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేసాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]ఆయన పూణే నుండి ఎన్నికైన లోక్ సభ సభ్యుడు. ఆయన 1971 నుండి 1980 వరకు, 1994 నుండి 2000 వరకు రాజ్యసభ సభ్యుడిగా, 1980 నుండి 1991 వరకు లోక్‍సభ సభ్యుడిగా ఉన్నాడు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, నరసింహారావు, సోనియా గాంధీ వంటి పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధిగా పనిచేసాడు. ఆయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా, ముంబైలోని రూపారెల్ కళాశాలలో ఆర్థిక శాస్త్ర గౌరవ ప్రొఫెసర్ గా, న్యూ లా కళాశాలలో రాజ్యాంగ న్యాయ ప్రొఫెసర్ గా పనిచేసాడు. ఆయన మరాఠీలో ట్రయల్స్ ఆఫ్ గ్రేట్ మ్యాన్, జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా, అబ్సెనిటీ అండ్ ది లా అండ్ ఇంటర్నేషనల్ లా అనే నాలుగు పుస్తకాలు రాసాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]విఠలరావు గాడ్గిల్ తండ్రి, నరహర్ విష్ణు గాడ్గిల్ (కాకాసాహెబ్ గాడ్గిల్ అని కూడా పిలుస్తారు) కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, జవాహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో, పంజాబ్ గవర్నర్ గా పనిచేసాడు. ఆయన కుమారుడు అనంత్ గాడ్గిల్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్సి, అలాగే జాతీయ మీడియా ప్యానలిస్ట్ కూడా.[3]
మూలాలు
[మార్చు]- ↑ Joshi, P. K. (1989). Gadgil Kulavruttanta [The Gadgil Family Genealogy Almanac] (in మరాఠీ). Pune. p. 216.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link) - ↑ "The Tribune, Chandigarh, India - Main News". tribuneindia.com. Retrieved 2014-06-12.
- ↑ "Congress plays Brahmin card: Congress plays Brahmin card in Maharashtra, makes governor nominate Anant Gadgil to Vidhan Parishad | Mumbai News - Times of India". The Times of India.