వినయ ప్రసాద్
వినయ ప్రసాద్, దక్షిణ భారతదేశంలో ప్రముఖ టివీ, సినీ నటి. ఆమె ఎక్కువగా కన్నడ, మలయాళ భాషా సినిమాల్లో నటించారు. తమిళ, తెలుగు సినిమాల్లో కూడా ఆమె నటించారు. ఆటంకా(1993), బన్నడే హెజ్జె(2001) సినిమాల్లోని నటనకు గానూ ఆమె రాష్ట్ర ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు. దక్షిణభారత సినీ రంగంలో ప్రముఖ కథానాయకులైన విష్ణువర్ధన్, రజినీకాంత్, మోహన్ లాల్, అంబరీష్, వెంకటేష్, అనంత్ నాగ్, నాగార్జున, వి.రవిచంద్రన్, శివరాజ్ కుమార్, మహేష్ బాబు, జూ.ఎన్.టి.ఆర్ లతో ఎన్నో సినిమాల్లో నటించిన సీనియర్ నటి ఆమె. | image =
కెరీర్
[మార్చు]కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి ప్రాంతంలో పుట్టారు వినయ. 1988లో జి.వి.అయ్యర్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం మధ్వాచార్యతో తెరంగేట్రం చేశారు ఆమె. అనంత్ నాగ్ సరసన గణేషణ మదువే సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు వినయ. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఆమె తన కెరీర్ లో కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు భాషల్లో దాదాపు 60 సినిమాల్లో నటించారు. కన్నడలో ఆమె చేసిన గణేషణ మదువే, నేను నక్కరె హాలు సక్కరే, గౌరీ గణేషా, మైసూర్ జాన, సూర్యోదయ సినిమాలు చెప్పుకోదగ్గవి. హీరోయిన్ గా మంచి విజయాలు అందుకున్న ఆమె, తరువాత సహాయ నటి పాత్రలు చేయడం మొదలుపెట్టారు. ఆమె మంచి వ్యాఖ్యాత, గాయకురాలు కూడా. మైసూర్ లో నిర్వహించే దసరా ఉత్సవాల్లో నృత్యగ్రం కార్యక్రమంలో వసంత హబ్బ అనే కార్యక్రమాలకు కూడా ఆమె చాలాసార్లు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.[1]
ఆమె కొన్ని మలయాళం సినిమాల్లో కూడా నటించారు. 1998 నుంచి 2000 మధ్య వరకూ ఏషియా నెట్ లో వచ్చిన స్త్రీ అనే మలయాళ సీరియల్ లో ఆమె ఒక కీలక పాత్రలో నటించారు. ఈ సీరియల్ చాలా పెద్ద హిట్. ఈ సీరియల్ కన్నడ వెర్షన్ లో కూడా ఆమె నటించారు. మలయాళంలో ఈ సీరియల్ ఎంత విజయవంతమైందంటే ఈమె పేరు కేరళలోని ప్రతివారి ఇంట్లో తెలిసే అంత.
తమిళ్ లో తైకులమే తైకులమే అనే హిట్ చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటించారు ఆమె. ఈ సినిమాలో పాండిరాజన్, ఊర్వశిలతో కలసి చేశారు వినయ. మలయాళంలో ఆల్ టైం హిట్ చిత్రం మణిచిత్రతాళు సినిమాలో సహాయ నటి పాత్రలో నటించారు ఆమె. ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్ అయిన చంద్రముఖిలో కూడా నటించారు వినయ. తెలుగులో ఇంద్ర, దొంగా దొంగది, ఆంధ్రుడు, దూకుడు వంటి సినిమాల్లో ఆమె సహాయ పాత్రల్లో నటించారు. ఈ సినిమాల్లోని ఆమె పాత్రలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది ఆమెకు.
2006లో స్త్రీ సీరియల్ రెండో పార్ట్ లోనూ నటించారు ఆమె. మొదటి స్త్రీ సీరియల్ లోని ఇందు పాత్రకు కొనసాగింపులోనే రెండో పార్ట్ లోనూ నటించారు వినయ.
వ్యక్తిగత జీవితం
[మార్చు]కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో పుట్టిన వినయ, ఉడిపిలోనే పెరిగారు. ఆమె కర్హదె బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. టివీ సీరియల్ దర్శకుడు జ్యోతి ప్రకాష్ ను వివాహం చేసుకున్నారు ఆమె. అంతకుముందు కన్నడ సినిమా ఎడిటర్, దర్శకుడు వి.ఆర్.కె.ప్రసాద్ ను పెళ్ళి చేసుకున్నారు ఆమె. కానీ ఆయన చిన్నవయసులో 1995లో మరణించారు. దాంతో జ్యోతి ప్రకాష్ ను రెండో వివాహం చేసుకున్నారు వినయ. వినయకు ఒక అక్క విజయ సత్యనారాయణ, కవల చెల్లెళ్ళు క్షమ భట్, కృపా భట్ ఉన్నారు. సోదరుడు రవి భట్ టీవీ రంగంలో నటునిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వినయ బెంగళూరులో తన భర్త జ్యోతి ప్రకాష్, కుమార్తె ప్రతమా ప్రాసాద్ లతో కలసి ఉంటున్నారు. జ్యోతి ప్రకాష్ కుమారుడు జై అత్రే కూడా ముంబైలో సినీ దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయితగా పనిచేస్తున్నారు.[2]
సినిమాలు
[మార్చు]టీవీ రంగంలో
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ http://www.us.imdb.de/name/nm1110573/
- ↑ [1] Archived 13 October 2007 at the Wayback Machine.