విల్ సోమర్‌విల్లే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విల్ సోమర్‌విల్లే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
విలియం ఎడ్గార్ రిచర్డ్ సోమర్‌విల్లే
పుట్టిన తేదీ (1984-08-09) 1984 ఆగస్టు 9 (వయసు 39)
వాడెస్టౌన్, వెల్లింగ్టన్, న్యూజీలాండ్
మారుపేరుడాడ్[1]
ఎత్తు6 ft 4 in (1.93 m)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 275)2018 డిసెంబరు 3 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2021 డిసెంబరు 3 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004/05–2007/08Otago
2014/15–2017/18న్యూ సౌత్ వేల్స్
2015/16–2017/18Sydney Sixers
2018/19–presentAuckland
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 6 45 29 43
చేసిన పరుగులు 115 918 328 200
బ్యాటింగు సగటు 14.37 18.73 19.29 25.00
100లు/50లు 0/0 0/3 0/2 0/0
అత్యుత్తమ స్కోరు 40* 60* 59 37*
వేసిన బంతులు 1,466 9,176 1,596 833
వికెట్లు 15 135 35 40
బౌలింగు సగటు 48.26 29.82 36.20 27.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 4 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/75 8/136 4/48 3/18
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 17/– 10/– 7/–
మూలం: ESPNcricinfo, 2022 ఆగస్టు 23

విలియం ఎడ్గార్ రిచర్డ్ సోమర్‌విల్లే (జననం 1984, ఆగస్టు 9) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆక్లాండ్ తరపున ఆడాడు. 2018 డిసెంబరులో న్యూజీలాండ్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

ప్రారంభ, దేశీయ కెరీర్[మార్చు]

సోమర్‌విల్లే 1984, ఆగస్టు 9న వెల్లింగ్‌టన్ శివారు ప్రాంతమైన వేడ్‌టౌన్‌లో జన్మించాడు. తొమ్మిదేళ్ళ వయసులో ఇతని కుటుంబం న్యూజీలాండ్ నుండి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి మారడంతో అక్కడ పెరిగాడు.[2] సిడ్నీ తూర్పు శివారులోని క్రాన్‌బ్రూక్ పాఠశాలలో చదువుకున్నాడు.[3] ఒటాగో విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి న్యూజీలాండ్‌కు తిరిగి వచ్చాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, ఆఫ్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. ఒటాగో తరపున మూడు మ్యాచ్‌లు ఆడాడు, 2005 మార్చిలో వెల్లింగ్‌టన్‌తో, 2006 మార్చిలో కాంటర్‌బరీ, నార్తర్న్ డిస్ట్రిక్ట్‌లపై ఆడాడు. 2005-06 సీజన్‌లో న్యూజీలాండ్ అకాడమీ తరపున అనేక మ్యాచ్‌లలో కూడా ఆడాడు.[4]

తన చదువు తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేయడానికి, యూనివర్సిటీకి క్రికెట్ ఆడటానికి సిడ్నీకి తిరిగి వచ్చాడు.[2] 2013-14లో న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడటం ప్రారంభించాడు. 2016 జనవరి 2న, 2015–16 బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[5]

2016 నవంబరులో షెఫీల్డ్ షీల్డ్‌లో న్యూ సౌత్ వేల్స్ తరపున బౌలింగ్ చేస్తూ, వెస్టర్న్ ఆస్ట్రేలియాపై మూడు వికెట్ల విజయంలో సోమర్‌విల్లే 61 పరుగులకు 4 వికెట్లు, 65 పరుగులకు 5 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.[6] క్వీన్స్‌లాండ్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు 8 వికెట్లతో సహా 23.14 సగటుతో 35 వికెట్లతో ఆ సీజన్‌లో షెఫీల్డ్ షీల్డ్‌లోని ప్రముఖ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.[7] 2017, అక్టోబరు 15న 2017–18 జెఎల్టీ వన్-డే కప్‌లో న్యూ సౌత్ వేల్స్ తరపున తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[8]

2018 జూన్ లో, 2018–19 సీజన్ కోసం ఆక్లాండ్‌తో ఒప్పందం లభించింది.[9] 2018 సెప్టెంబరులో, 2018 అబుదాబి టీ20 ట్రోఫీ కోసం ఆక్లాండ్ ఏసెస్ జట్టులో ఎంపికయ్యాడు.[10]

2020 జూన్ లో, 2020–21 దేశవాళీ క్రికెట్ సీజన్‌కు ముందు ఆక్లాండ్ కాంట్రాక్ట్ ఇచ్చింది.[11][12]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

2018 నవంబరులో, సోమర్‌విల్లే పాకిస్తాన్‌తో జరిగిన వారి సిరీస్ కోసం న్యూజీలాండ్ టెస్ట్ జట్టులో చేర్చబడ్డాడు.[13] 2018 డిసెంబరు 3న పాకిస్తాన్‌పై న్యూజీలాండ్ తరపున తన తొలి టెస్ట్ అరంగేట్రం చేసాడు. 75 పరుగులకు 4 వికెట్లు, 52 పరుగులకు 3 వికెట్లు తీసి న్యూజీలాండ్ కు 123 పరుగుల విజయాన్ని అందిచాడు.[14]

మూలాలు[మార్చు]

  1. "Back in the Black Caps: Will Somerville plays on in sister's memory" (in ఇంగ్లీష్). Retrieved 2020-12-31.
  2. 2.0 2.1 "Meet Will Somerville". Retrieved 7 November 2016 – via YouTube.
  3. "Will Somerville (2002) to Play in Sheffield Shield". Old Cranbrookians Association. Retrieved 7 November 2016.
  4. "Miscellaneous Matches played by Will Somerville". CricketArchive. Retrieved 9 November 2016.
  5. "Big Bash League, 17th Match: Perth Scorchers v Sydney Sixers at Perth, Jan 2, 2016". ESPNcricinfo. Retrieved 2 January 2016.
  6. "New South Wales v Western Australia 2016–17". ESPNcricinfo. Retrieved 7 November 2016.
  7. "Sheffield Shield bowling 2016-17". ESPNcricinfo. Retrieved 13 February 2019.
  8. "19th match (D/N), JLT One-Day Cup at Sydney, Oct 15 2017". ESPNcricinfo. Retrieved 15 October 2017.
  9. "Central Districts drop Jesse Ryder from contracts list". ESPNcricinfo. Retrieved 15 June 2018.
  10. "Auckland Aces to face the world in Abu Dhabi". Scoop. Retrieved 27 September 2018.
  11. "Daryl Mitchell, Jeet Raval and Finn Allen among major domestic movers in New Zealand". ESPNcricinfo. Retrieved 15 June 2020.
  12. "Auckland lose Jeet Raval to Northern Districts, Finn Allen to Wellington in domestic contracts". Stuff. 15 June 2020. Retrieved 15 June 2020.
  13. "Uncapped 34-year-old Will Somerville replaces injured Todd Astle in Blackcaps Test squad". International Cricket Council. Retrieved 8 November 2018.
  14. "3rd Test, New Zealand tour of United Arab Emirates at Abu Dhabi, Dec 3-7 2018". ESPNcricinfo. Retrieved 3 December 2018.

బాహ్య లింకులు[మార్చు]