Jump to content

వివృతబీజాలు

వికీపీడియా నుండి
(వివృతబీజవృంతం నుండి దారిమార్పు చెందింది)

వివృతబీజాలు
White Spruce leaves (needles)
Scientific classification
Kingdom:
Divisions

పైనోఫైటా - పైన్, దేవదారు
జింకోఫైటా - జింకో
సైకడోఫైటా - సైకస్
Gnetophyta - Gnetum, Ephedra, Welwitschia

ఆచ్ఛాదనలేని, ఫలరహిత నగ్న విత్తనాలు ప్రత్యేక లక్షణంగా ఉన్న వర్గాన్ని వివృతబీజాలు లేదా నగ్నబీజాలు (Gymnosperms) అంటారు. వీటిలో నాలుగు విభాగాలు ఉన్నాయి. అవి సైకడోఫైటా, పైనోఫైటా, నీటోఫైటా, జింకోఫైటా.

ప్రధాన లక్షణాలు

[మార్చు]
  • ఇవి ఎక్కువగా బహువార్షిక, సతతహరిత, దారుయుత ఎడారి మొక్కలు.
  • ఈ మొక్క సిద్ధబీజదం, తల్లి వేరువ్యవస్థని, దారుయుత కాండాన్ని, స్థూల పత్రాలను కలిగి ఉంటుంది.
  • ఈ మొక్కల్లో నాళికా కణజాలాలు ఉంటాయి. దారునాళాలు ఉండవు. పోషకకణజాలంలో సహకణాలు ఉండవు.
  • వీటిలో భిన్నసిద్ధబీజత ఉంటుంది. సిద్ధబీజాశయ పత్రాలు సాధారణంగా శంకులుగా సంకలితం చెందుతాయి.
  • సూక్ష్మసిద్ధబీజాశయం సూక్ష్మసిద్ధబీజాలను ఉత్పత్తిచేస్తుంది. గాలి వల్ల పరాగసంపర్కం.
  • అండాలు స్థూలసిద్ధబీజసయ పత్రాలపై బహిర్గతంగా ఉంటాయి. ఏకస్థితిక స్థూలసిద్ధబీజం నుంచి ఏర్పడిన స్త్రీ సంయోగబీజదాన్ని అంకురచ్ఛదం అంటారు. ఈ అంకురచ్ఛదం స్త్రీ సంయోగబీజాశయాలను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా పిండానికి శోషణను ఇస్తుంది.
  • లైంగిక ప్రత్యుత్పత్తి సైఫనోగమీ రకానికి చెందిన అండసంయోగం వల్ల జరుగుతుంది. పురుష సంయోగబీజాలను పరాగనాళం స్త్రీసంయోగ బీజాశయాల వద్దకు చేరవేస్తుంది. కాని సైకస్ లో జాయిడోగమీ, సైఫనోగమీ రెండూ ఉంటాయి.
  • ద్వయస్థితిక సంయుక్తబీజం అండంలో ఉన్నప్పుడే పిండంగా అభివృద్ధి చెందుతుంది.

బయటి లింకులు

[మార్చు]