Jump to content

వి. డి. సతీశన్

వికీపీడియా నుండి
వి. డి. సతీశన్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2026 మే 18
గవర్నరు రాజేంద్ర అర్లేకర్
ముందు పిన‌ర‌యి విజ‌య‌న్

పదవీ కాలం
2021 మే 22  2026 మే 5
గవర్నరు ఆరీఫ్ మహమ్మద్ ఖాన్
రాజేంద్ర అర్లేకర్
ముందు రమేష్ చెన్నితాల
తరువాత పిన‌ర‌యి విజ‌య‌న్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2001 మే 13 (2001-05-13)
ముందు పి. రాజు
నియోజకవర్గం పరవూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1964-05-31) 1964 మే 31 (వయసు: 62)
నెట్టూర్ , కేరళ , భారతదేశం
రాజకీయ పార్టీ ఐఎన్‌సీ
తల్లిదండ్రులు కె. దామోదర మీనన్
వి. విలాసిని అమ్మ
జీవిత భాగస్వామి ఆర్.లక్ష్మీప్రియ
సంతానం 1
  • రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్, కొచ్చి
  • ,
  • ప్రభుత్వ న్యాయ కళాశాల, తిరువనంతపురం
పూర్వ విద్యార్థి సేక్రేడ్ హార్ట్ కాలేజ్, తేవర (బి.ఏ)
కేరళ లా అకాడమీ లా కాలేజీ (ఎల్.ఎల్.బి)
ప్రభుత్వ న్యాయ కళాశాల, తిరువనంతపురం (ఎల్.ఎల్.ఎం)

వడస్సేరి దామోదరన్ సతీశన్ (జననం 31 మే 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కేరళ 13వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన 15వ కేరళ శాసనసభలో 22 మే 2021 నుండి ప్రతిపక్ష నాయకుడిగా పని చేస్తున్నాడు.[1][2]

2021 కేరళ శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితాల తర్వాత సతీశన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేస్తున్నాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

వీ.డీ. సతీశన్ 31 మే 1964న కె. దామోదర మీనన్, వి. విలాసిని అమ్మలకు ఎర్నాకుళం జిల్లాలోని నెట్టూరులో జన్మించాడు.[3] అయన తన ప్రాథమిక విద్యను పనంగాడ్ హైస్కూల్ నుండి, అండర్-గ్రాడ్యుయేషన్, సేక్రేడ్ హార్ట్ కాలేజ్, తేవరా నుండి పోస్ట్-గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ వర్క్ (MSW) రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుండి పూర్తి చేశాడు.[4] సతీశన్ కేరళ లా అకాడమీ లా కాలేజీ నుండి తన బ్యాచిలర్ ఆఫ్ లాస్ (ఎల్‌ఎల్‌బీ), తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి మాస్టర్ ఆఫ్ లాస్ (ఎల్‌ఎల్‌ఎం) పూర్తి చేశాడు. సతీశన్ కేరళ హైకోర్టులో న్యాయవాదిగా పని చేశాడు.[5]

వివాహం

[మార్చు]

వీ.డీ. సతీశన్ ఆర్. లక్ష్మి ప్రియను వివాహం చేసుకున్నాడు, ఈ దంపతులకు కుమార్తె ఉన్నిమయ ఉంది.[6]

రాజకీయ జీవితం

[మార్చు]

సతీశన్ 1986-1987 కాలంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ యూనియన్‌కు చైర్మన్‌గా ఆ తరువాత నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా కూడా పని చేశాడు.[7]

  • సతీశన్ కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 2001లో తొలిసారిగా పరవూరు శాసనసభ నియోజకవర్గం నుండి కేరళ శాసనసభకు ఎన్నికయ్యాడు.
  • 2006 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో పరవూరు నియోజకవర్గంలో కె.ఎం దినకరన్‌పై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[8]
  • 2011లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన పన్నయన్ రవీంద్రన్‌ను 11349 ఓట్లతో ఓడించి మళ్లీ కేరళ శాసనసభకు ఎన్నికయ్యాడు.[9]
  • 2016లో భారత కమ్యూనిస్టు పార్టీకి చెందిన శారదా మోహన్‌పై 20,634 ఓట్ల తేడాతో పరవూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యాడు.[10] అతను 12వ అసెంబ్లీలో భారత జాతీయ కాంగ్రెస్ చీఫ్ విప్‌గా పని చేశాడు .
  • 2021లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఎం.టి నిక్సన్‌ను 21,301 ఓట్ల తేడాతో ఓడించడం ద్వారా పరవూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఐదవసారి మళ్లీ కేరళ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[11]
  • 22 మే 2021న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 15వ కేరళ శాసనసభలో వీ.డీ. సతీశన్‌ను ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించింది.[12]
  • 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో యూడీఎఫ్ విజయం తర్వాత, పార్టీ నాయకుల మధ్య సుదీర్ఘ చర్చల తర్వాత 2026 మే 14న సతీశన్‌ను కాబోయే ముఖ్యమంత్రిగా ఐఎన్‌సీ ప్రకటించింది
  • ఆయన 2026 మే 18న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[13]
  • త్రివేండ్రంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. కేరళ చరిత్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడం ఇదే మొదటిసారి.[14]

మూలాలు

[మార్చు]
  1. 1 2 "Congress appoints VD Satheesan as leader of opposition in Kerala". 22 May 2021.
  2. 1 2 "Muziris Projects Limited Information - Muziris Projects Limited Company Profile, Muziris Projects Limited News on the Economic Times".
  3. Hindustan Pages[permanent dead link]
  4. "V D Satheesan". the original నుండి 2020-06-22 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-05-20.
  5. "Members - Kerala Legislature".
  6. "പിണറായി വിജയന്റെ കരുത്തിനെ നേരിടാൻ വി.ഡി സതീശന്റെ പോരാട്ടവീര്യം". ManoramaOnline (in మలయాళం). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 May 2021.
  7. "Members - Kerala Legislature". www.niyamasabha.org. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 May 2021.
  8. Sushanth. "ASSEMBLY ELECTIONS 1957 - 2016(Kerala)". data-analytics.GitHub.io. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 May 2021.
  9. "Members - Kerala Legislature". www.niyamasabha.org. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 May 2021.
  10. "Kerala Assembly Election Results in 2016". www.elections.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 May 2021.
  11. Sudhi, K. s (19 March 2021). "Kerala Assembly Elections | Congress banks yet again on Satheesan in Paravur". The Hindu (in Indian English). ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 May 2021.
  12. തങ്ങള്‍, ശിഹാബുദ്ദീന്‍. "ഇനി പ്രതിപക്ഷത്തിന്റെ ചാട്ടുളി സതീശന്‍; തിരിച്ചുവരവിലേക്കുള്ള ആദ്യചുവട്‌". Mathrubhumi (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 May 2021.
  13. "కేరళ సీఎంగా సతీశన్‌ ప్రమాణం". Andhrajyothy. 19 May 2026. the original నుండి 19 May 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 May 2026.
  14. "కేరళంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. సీఎంగా వీడీ సతీశన్‌ ప్రమాణస్వీకారం". విజయక్రాంతి న్యూస్. 2026-05-18. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-05-19.