Jump to content

వి. నారాయణరావు

వికీపీడియా నుండి
వి. నారాయణరావు
జననం(1921-12-21)1921 డిసెంబరు 21
బెంగళూరు, కర్ణాటక
మరణం2009 ఆగస్టు 13(2009-08-13) (వయసు 87)
బెంగళూరు
వృత్తిరక్షణ రంగ శాస్త్రవేత్త
ప్రసిద్ధిఎలక్ట్రానిక్ యుద్ధం
పిల్లలుముగ్గురు కుమార్తెలు
తల్లిదండ్రులుశ్రీపతిరావు
కమలమ్మ
పురస్కారాలుపద్మశ్రీ
VASVIK పారిశ్రామిక పరిశోధనా పురస్కారం

వక్కలేరి నారాయణరావు (1921 డిసెంబరు 21 - 2009 ఆగస్టు 13) భారతీయ రక్షణ రంగ శాస్త్రవేత్త, భారతదేశంలో ఎలక్ట్రానిక్ యుద్ధపు మార్గదర్శకులలో ఒకరు.[1] అతను హైదరాబాద్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీకి మాజీ డైరెక్టరు.[2] భారత ప్రభుత్వం అతనికి 1982 లో నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది.[3]

జీవిత చరిత్ర

[మార్చు]

నారాయణరావు 1921 డిసెంబరులో కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో కమలమ్మ, శ్రీపతిరావు దంపతులకు వారి ఎనిమిది మంది సంతానంలో మూడవ సంతానంగా జన్మించాడు.[1] అతను చామరాజ్‌పేట, విశ్వేశ్వరపురంలలో పాఠశాల విద్య అభ్యసించి, షిమోగా హైస్కూల్, బెంగళూరు లోని ఫోర్ట్ హైస్కూల్‌లలో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. బెంగుళూరులోని ఇంటర్మీడియట్ కళాశాలలో తన విద్యను కొనసాగించాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ కాలేజ్ ఆఫ్ బెంగుళూరు నుండి 1943 లో భౌతికశాస్త్రంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు.[1] 1945లో మైసూర్ యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. అతను రేడియో డిపార్ట్‌మెంట్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ట్రైనీగా తన వృత్తిని ప్రారంభించాడు. కాని రెండు నెలల తర్వాత ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా చేరి, విక్రమ్ సారాభాయ్‌ పూణేలో ఏర్పాటు చేసిన పరిశోధనాశాలలో ఆయనకు సహాయం చేశాడు.[1] తరువాత, స్కాలర్‌షిప్ పొందాక, రావు యునైటెడ్ కింగ్‌డమ్ వెళ్లి బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్, చెమ్స్‌ఫోర్డ్‌లోని మార్కోని కాలేజ్ ఆఫ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్స్‌లలో శిక్షణ పొందాడు. ఆ తర్వాత మాంచెస్టర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ (MCT), యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌లో పరిశోధనలు చేశాడు. అక్కడ తాను చేసిన పనికి గాను పేటెంట్ పొందాడు.[1] 1948 లో అతని థీసిస్ ఎంపికయ్యాక, అతను మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ (MSc టెక్)లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.[4]

1948 ఆగస్టులో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, రావు ఆల్ ఇండియా రేడియోలో ఢిల్లీలోని హై పవర్ ట్రాన్స్‌మిటింగ్ స్టేషన్ (HPT)లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా చేరాడు. 1954 లో అతను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో చేరి, కొచ్చి లోని నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ లాబొరేటరీలో నియమితుడయ్యాడు. DRDO 1962 లో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (DERL) ని స్థాపించినప్పుడు, రావు దానికి వ్యవస్థాపక డైరెక్టరుగా నియమితుడయ్యాడు.[5]

రావు 1978 లో VASVIK పారిశ్రామిక పరిశోధనా పురస్కారం అందుకున్నాడు.[2][6] భారత ప్రభుత్వం అతనికి 1982 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.[3] అతను శకుంతలను పెళ్ళి చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[2] DERL నుండి పదవీ విరమణ పొందిన తరువాత, అతను బెంగళూరులో స్థిరపడ్డాడు.[2]

అతను 87 సంవత్సరాల వయస్సులో 2009 ఆగస్టు 13 న బెంగుళూరులో మరణించాడు.[7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

 

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Reminiscences of a Defence Scientist - Foreword" (PDF). Defence Research and Development Organization. 2007. Retrieved 2 July 2015.
  2. 2.0 2.1 2.2 2.3 "Indian Who's Who". Indian Who's Who. 2015. Retrieved 2 July 2015.
  3. 3.0 3.1 "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 18 June 2015.
  4. "University of Manchester: Register of Graduates". University of Manchester. 2015. Retrieved 2 July 2015.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; V. Narayana Rao అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. "Electronic Sciences & Technology". Vasvik. 2015. Archived from the original on 29 March 2012. Retrieved 2 July 2015.
  7. "Former DLRL Director Narayan Rao passes away". Archived from the original on 2021-11-20. Retrieved 2024-09-03.