వీ.డీ. సతీశన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీ.డీ. సతీశన్
వీ.డీ. సతీశన్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
22 మే 2021 (2021-05-22)
గవర్నరు ఆరీఫ్ మహమ్మద్ ఖాన్
డిప్యూటీ పికె కున్హాలికుట్టి
ముందు రమేష్ చెన్నితాల

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2001 (2001)
ముందు పి. రాజు
నియోజకవర్గం పరవూరు[1]

వ్యక్తిగత వివరాలు

జననం (1964-05-31) 1964 మే 31 (వయసు 60)
నెట్టూర్ , కేరళ , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ ఐఎన్‌సీ
తల్లిదండ్రులు కె. దామోదర మీనన్
వి. విలాసిని అమ్మ
జీవిత భాగస్వామి ఆర్.లక్ష్మీప్రియ
సంతానం 1
నివాసం ఉత్తర పరవూరు
పూర్వ విద్యార్థి
  • సేక్రేడ్ హార్ట్ కాలేజ్, తేవరరాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్, కొచ్చి
  • కేరళ లా అకాడమీ లా కాలేజీ, తిరువనంతపురం
  • ప్రభుత్వ న్యాయ కళాశాల, తిరువనంతపురం
వృత్తి
  • రాజకీయ నాయకుడు
  • సామాజిక కార్యకర్త
  • న్యాయవాది

వడస్సేరి దామోదరన్ సతీశన్ (జననం 31 మే 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 15వ కేరళ శాసనసభలో 22 మే 2021 నుండి ప్రతిపక్ష నాయకుడిగా పని చేస్తున్నాడు.[2][3]

2021 కేరళ శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితాల తర్వాత సతీశన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేస్తున్నాడు.[2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

వీ.డీ. సతీశన్ 31 మే 1964న కె. దామోదర మీనన్, వి. విలాసిని అమ్మలకు ఎర్నాకుళం జిల్లాలోని నెట్టూరులో జన్మించాడు.[4] అయన తన ప్రాథమిక విద్యను పనంగాడ్ హైస్కూల్ నుండి, అండర్-గ్రాడ్యుయేషన్, సేక్రేడ్ హార్ట్ కాలేజ్, తేవరా నుండి పోస్ట్-గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ వర్క్ (MSW) రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుండి పూర్తి చేశాడు.[5] సతీశన్ కేరళ లా అకాడమీ లా కాలేజీ నుండి తన బ్యాచిలర్ ఆఫ్ లాస్ (ఎల్‌ఎల్‌బీ), తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి మాస్టర్ ఆఫ్ లాస్ (ఎల్‌ఎల్‌ఎం) పూర్తి చేశాడు. సతీశన్ కేరళ హైకోర్టులో న్యాయవాదిగా పని చేశాడు.[6]

వివాహం

[మార్చు]

వీ.డీ. సతీశన్ ఆర్. లక్ష్మి ప్రియను వివాహం చేసుకున్నాడు, ఈ దంపతులకు కుమార్తె ఉన్నిమయ ఉంది.[7]

రాజకీయ జీవితం

[మార్చు]

సతీశన్ 1986-1987 కాలంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ యూనియన్‌కు చైర్మన్‌గా ఆ తరువాత నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా కూడా పని చేశాడు.[8]

  • సతీశన్ కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 2001లో తొలిసారిగా పరవూరు శాసనసభ నియోజకవర్గం నుండి కేరళ శాసనసభకు ఎన్నికయ్యాడు.
  • 2006 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో పరవూరు నియోజకవర్గంలో కె.ఎం దినకరన్‌పై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[9]
  • 2011లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన పన్నయన్ రవీంద్రన్‌ను 11349 ఓట్లతో ఓడించి మళ్లీ కేరళ శాసనసభకు ఎన్నికయ్యాడు.[10]
  • 2016లో భారత కమ్యూనిస్టు పార్టీకి చెందిన శారదా మోహన్‌పై 20,634 ఓట్ల తేడాతో పరవూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యాడు.[11] అతను 12వ అసెంబ్లీలో భారత జాతీయ కాంగ్రెస్ చీఫ్ విప్‌గా పని చేశాడు .
  • 2021లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఎం.టి నిక్సన్‌ను 21,301 ఓట్ల తేడాతో ఓడించడం ద్వారా పరవూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఐదవసారి మళ్లీ కేరళ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[12]
  • 22 మే 2021న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 15వ కేరళ శాసనసభలో వీ.డీ. సతీశన్‌ను ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించింది.[13]

మూలాలు

[మార్చు]
  1. "Ernakulam District MLA List". Archived from the original on 7 April 2013. Retrieved 9 January 2013.
  2. 2.0 2.1 "Congress appoints VD Satheesan as leader of opposition in Kerala". 22 May 2021.
  3. 3.0 3.1 "Muziris Projects Limited Information - Muziris Projects Limited Company Profile, Muziris Projects Limited News on the Economic Times".
  4. Hindustan Pages[permanent dead link]
  5. "V D Satheesan".
  6. "Members - Kerala Legislature".
  7. "പിണറായി വിജയന്റെ കരുത്തിനെ നേരിടാൻ വി.ഡി സതീശന്റെ പോരാട്ടവീര്യം". ManoramaOnline (in మలయాళం). Retrieved 26 May 2021.
  8. "Members - Kerala Legislature". www.niyamasabha.org. Retrieved 20 May 2021.
  9. Sushanth. "ASSEMBLY ELECTIONS 1957 - 2016(Kerala)". data-analytics.GitHub.io. Retrieved 20 May 2021.
  10. "Members - Kerala Legislature". www.niyamasabha.org. Retrieved 20 May 2021.
  11. "Kerala Assembly Election Results in 2016". www.elections.in. Retrieved 22 May 2021.
  12. Sudhi, K. s (19 March 2021). "Kerala Assembly Elections | Congress banks yet again on Satheesan in Paravur". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 20 May 2021.
  13. തങ്ങള്‍, ശിഹാബുദ്ദീന്‍. "ഇനി പ്രതിപക്ഷത്തിന്റെ ചാട്ടുളി സതീശന്‍; തിരിച്ചുവരവിലേക്കുള്ള ആദ്യചുവട്‌". Mathrubhumi (in ఇంగ్లీష్). Retrieved 22 May 2021.