వెంకటగిరి చీర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
PGI-Logo.svg.png ఈ వ్యాసం
భౌగోళిక గుర్తింపు (GI)
జాబితాలో భాగం

వెంకటగిరి చీర
వివరణనెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గము పత్తి చేనేత చీరలు ప్రసిద్ధి చెందింది.
రకంవస్త్రం
ప్రాంతంనెల్లూరు జిల్లాలో వెంకటగిరి
దేశంభారతదేశం
అధికారిక వెబ్‌సైటుhttp://venkatagiri.com

భౌగోళిక గుర్తింపు భౌగోళిక గుర్తింపు

నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గము పత్తి చేనేత చీరలు ప్రసిద్ధి చెందింది. ఇది దాని ప్రత్యేకమైన నేత ప్రావీణ్యత వచ్చింది. ఈ చీరెలను వెంకటగిరి చీరెలుగా వ్యవహరిస్తారు. ఇవి వాటి విశిష్ట జరీ రూపకల్పనల వలన ప్రజాదరణ పొందాయి. వీటిని చేతితో అల్లటం ద్వారా లేదా యంత్రము ద్వారా తయారు చేస్తారు.

చరిత్ర[మార్చు]

ఈ వెంకటగిరి చీరలను నెసేవారిని 1700 సంవత్సరంలోనే నెల్లూరు వెలుగుగోటి రాజవంశం పోషిస్తూన్నట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి.[1]. ఈ జిల్లా లోని వెంకటగిరి, పాటూరు, నెల్లూరు రూరల్ లోని పలు గ్రామాల్లో వేలాది కుటుంబాల చేనేత పరిశ్రమలో వున్నాయి

విశేషాలు[మార్చు]

వెంకటగిరి చీరలు ఆంధ్రాలోనే కాకుండా ఇతర రాష్ట్రాలతోపాటు విదేశీయులను ఆకర్షిస్తున్నాయి. మగువ లకు అందాన్నిచ్చే ఈ చీరలకు 150 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. వెండి జరీ, ఆఫ్ ఫైన్ జరీ వంటి రకాలతో ఇక్కడ చీరలు నేస్తున్నారు. ఎంతో నైపుణ్యంతో చీరను నేయడం వల్ల మన రాష్ట్రంలోనే కాకుండా కేరళ, తమిళ నాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో చీరలు అమ్ముడుబోతున్నా యి. విదేశీయులకు సైతం వెంకటగిరి చీరలంటే మహా ప్రీతి. ఆధునిక డిజైన్లతో చీరలను నేయడం వల్ల మహిళలు వెంకటగిరి చీరలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ చీరల్లో జాందనీ వర్క్కు మంచి డిమాండ్ ఉంది. రెండు వైపులా ఒకే డిజైన్ కనబడడం జాందనీ వర్క్ ప్రత్యేకత. చీరల తయారీలో ఇటువంటి నైపుణ్యం మరెక్కడా కాన రాదు. వెంకటగిరిలో మరో ప్రత్యేకత ఉంది. కాటన్ చీరల్లో చుట్టూ చెంగావి రంగు చీర తయారు చేయడం ఇక్కడి కార్మికుల నైపుణ్యతకు నిదర్శనం.

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

ఇతర లింకులు[మార్చు]