వెంపటి నాగేశ్వరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెంపటి నాగేశ్వరి ప్రముఖ కూచిపూడి నాట్యాచారిణి. తన జీవితాన్నంతా నాట్యశిక్షణకే వెచ్చించారు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె వరంగల్ జిల్లాకు చెందిన సాంప్రదాయ కుటుంబంలో అక్టోబరు 24, 1957న జన్మించారు. వరంగల్ జిల్లాకు కూచిపూడి నాట్యాన్ని పరిచయం చేయడంతోపాటు 43 సంవత్సరాల పాటు సేవలందించి నాట్య కళాకారిణులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆమె తండ్రి వెంపటి కోదండరామశాస్త్రి, తాత వెంపటి వెంకటనారాయణ కూచిపూడి త్రిమూర్తులలో ఒక్కరు. తాతగారి పేరిట నాగేశ్వరి 1979లో వరంగల్‌లో వెంపటి వెంకటనారాయణ కాకతీయ నృత్యకళాక్షేత్రాన్ని స్థాపించారు.

సేవలు[మార్చు]

ఆమె "శ్రీ వెంపటి నారాయణ కాకతీయ నృత్య కళాక్షేత్రం" నకు డైరక్టరుగా పనిచేసారు. 35 సంవత్సరాలుగా ఆమె వివిధ నాట్య మరియు నాట్య నాటకాలను కంపోజ్ చేసారు. ఈ కాలంలో వందలాది మంది విద్యర్థులు ఆమె నాట్య పాఠశాలలొ గ్రాడ్యుయేషన్ చేసారు. ఆమె శిష్యులు జాతీయ మరియు అంతర్జాతీయంగా వివిధ ప్రదర్శన ద్వారా ఖ్యాతి పొందారు. అందులో కొందరు విద్యార్థులకు నేషనల్ డాన్స్ స్కాలర్‌షిప్ మరియు దూరదర్శన్,టెలివిజన్ లలో "బి" గ్రేడు ఆర్టిస్టులుగా గుర్తింపు వచ్చింది. ఆమె దూరదర్శన్ ఛానళ్ళైన సప్తగిరి, జెమిని, ఈ టీ.వి లలో నృత్య పోటీలలొ పాల్గొన్నారు. ఆమె అనేక నృత్య పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆమె తన శిష్యులకు శాతవాహన ఉత్సవాలు, కాకతీయ ఉత్సవాలు, అన్నమయ్య ఉత్సవాలు, ఆంధ్రప్రదేశ్ దినోత్సవం, అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్, జాతీయ నృత్య పోటీలు, రాజమండ్రి కళా జ్యోతి నృత్య పోటీలు వంతి వాటిలో పాల్గొనేందుకు అవకాశం కల్పించేవారు. ఆమె శిష్యులలో 50 మంది సిలికానాంధ్ర లో నిర్వహించిన 2వ, 3వ అంతర్జాతీయ కూచిపూడీ నాట్యోత్సవాలలో పాల్గొన్నారు. 2010 మరియు 2012లలో గిన్నిస్ రికార్డును పొందారు.[1]

నాట్యాచార్యులలో ఆధ్యులు, ప్రముఖ నాట్యాచార్యులైన ఉమావైజయంతిమాల, కొంపెల్లి భ్రమరాంబ, గీత, రాజ్యలక్ష్మి తదితర కూచిపూడి కళాకారిణులు నాగేశ్వరి వద్ద నేర్చుకున్న విద్యార్థులే. ఇంకా అనేకమంది శిష్యులున్నారు. వెంపటి నాగేశ్వరి భక్తప్రహ్లద, గంగాగౌరి సంవాదం, భక్తశిరియాల వంటి అనేక నృత్యనాటికలకు దర్శకత్వం వహించారు. ఇవి దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి.[2]

ఆమె జూన్ 8, 2014న గుండెపోటుతో మరణించారు.[3]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]