Jump to content

వెంపటి రవిశంకర్

వికీపీడియా నుండి

వెంపటి రవిశంకర్‌ కూచిపూడి నాట్యాచార్యుడు.[1][2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన అక్టోబరు 11 1969 న ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారుడు అయిన వెంపటి చినసత్యం గారి చివరి కుమారుడు. ఆ సమయంలో ఆయన తండ్రి ప్రసిద్ధ కూచిపూడి కళాకారునిగా ప్రసిద్ధి చెంది 1963లో కూచిపూడి ఆర్ట్ అకాడమీని స్థాపించారు. ఆ అకాడమీలో ప్రముఖ నృత్యకారులు శోభానాయుడు, మంజుభార్గవి, బాల కొండలరావు వంటి వారు శిక్షణ పొందారు. చినసత్యం తన పిల్లలకు కూడా నాట్యకళలో శిక్షణనిప్పించారు. వారిలో రవిశంకర్ నాట్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచేవారు కానీ తన తండ్రిగారి ప్రోత్సాహాన్ని పొందలేకపోయారు. తరువాత చినసత్యం గారి శిష్యులలో ఒకరైన శ్రీమతి బాల కొండలరావు రవిశంకర్ కు శిక్షణ నిప్పుంచుటలో శ్రద్ధ కనబరచారు. ఆయన తన సోదరీమణులైన కామేశ్వరి, కాత్యాయని, బాలాత్రిపురసుందరి ల ప్రోత్సాహాన్ని పొందారు. ఆ ప్రోత్సాహంతో ఆయన బాలకొండలరావు వద్ద శిక్షణను తన తండ్రికి తెలియకుండా పొందారు. వారికి అ అకాడమీలో శిక్షకులు బాగా నిద్రపోతున్న సమయంలో, అర్థరాత్రి వేళలో శిక్షణనిచ్చేవారు. ఈ శిక్షణలో బాలకొండలరావు పది సంవత్సరాలపాటు అనేక నృత్య విషయాలను బోధించారు.[1]

తండ్రి ఎదుట ప్రదర్శన

[మార్చు]

రవిశంకర్ బాగా నాట్య శిక్షణ పొందిన అనంతరం బాలకొండలరావు తన తండ్రి ఎదుట ప్రదర్శన నిప్పించుటకు నిర్ణయించుకుంది. ఒక విజయదశమి రోజున ఆమె రవిశంకర్ ను అకాడమీలోని వేదికపైకి ఆయనను చేర్చింది. చినసత్యం గారు తన కుమారుడిని వారించాడు. కానీ బాలకొండలరావు తనకుమారుని నృత్యశిక్షణ గూర్చి ఆయనకు తెలియజేసారు. అపుడు చినసత్యం నృత్య ప్రదర్శనకు అంగీకరించాడు. తాను తన తండ్రి ఎదుట తన జీవితంలో మొదటి ప్రదర్శాననిచ్చాడు. తండ్రి కుమారుని అభినందించలేదు కానీ తన తల్లితో "బాగా చేశాడు" అని అన్నారు.

ఆ కార్యక్రమం తదుపరి ఆయన నృత్యకౌశలాన్ని అభివృద్ధి చేసుకొని పరిణితి చెందిన నాట్యకారునిగా ప్రసిద్ధి చెందారు. మొదట్లో చినసత్యం అంగీకరింపకపోయినా తరువాత అవకాశం యిప్పించాడు. చినసత్యం గారి "శ్రీనివాస కళ్యాణం"లో ప్రదర్శననిచ్చాదు. తరువాత అనేక పాత్రలను పోషించారు.

1994 నుండి 2004 వరకు ఆయన కూచిపూడి ఆర్ట్ అకాడమీ నాటకాలలో ముఖ్య పాత్రను పోషించారు. హరవిలాసంలో శివునిగానూ, రామాయణంలో రామునిగానూ, అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతునిగానూ, కిరాతార్జునీయంలో అర్జునునిగానూ వివిధ పాత్రలలో నటించారు. ఈయన నటించిన పాత్రలలో హరవిలాసం, అర్థనారీశ్వరం నాటకాలలో శివుని పాత్ర ప్రశస్త్యమైనది.[1]

అవార్డులు

[మార్చు]
  • 2015 మన్మధ నామ సంవత్సర కళారత్న అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అందుకున్నారు.[3]

మరణం

[మార్చు]

ఇతడు 2018, జనవరి 23 మంగళవారం తెల్లవారు జామున అస్వస్థతతో తన 49వ యేట మరణించాడు[4].

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "vempati ravisankar:following his father foot steps". The kalaparva. harshita mrutinti kamat. Archived from the original on 16 నవంబరు 2015. Retrieved 7 January 2016.
  2. "An affirmation of life". Akhila Seetharaman. The Hindu. Jan 27, 2004. Retrieved 7 January 2016.
  3. "ఉగాది పురస్కార విజేతలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - Published On:20-03-2015". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-10.
  4. వెంపటి రవిశంకర్‌ కన్నుమూత[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]