Jump to content

వేంపల్లి గంగాధర్

వికీపీడియా నుండి
(వేంపల్లె గంగాధర్ నుండి దారిమార్పు చెందింది)


డాక్టర్ వేంపల్లి గంగాధర్
వృత్తిరచయిత, కథకుడు, కవి, పరిశోధకుడు
జాతీయతభారతీయుడు
కాలంప్రస్తుతం
Website
http://vempalligangadhar.com

డాక్టర్ వేంపల్లి గంగాధర్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత. ఈయన కడప జిల్లాకు చెందిన కథకుడు, కవి, పరిశోధకుడు.సుపరిచితులైన పాత్రికేయుడు, కవి, రచయిత[1] రాష్టపతి భవన్ 'ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం' కు ఎంపిక అయ్యారు[2] . రాష్ట పతి భవన్ లో 2014 సెప్టెంబరు 8 వ తేది నుంచి 26 వరకు విశిష్ట అతిథిగా వీరు విడిది చేశారు.కేంద్ర సాహిత్య అకాడెమీ వారి 'రైటర్స్ ట్రావెల్ గ్రాంట్' ప్రోగ్రాం ద్వారా విశ్వ కవి రవీంద్రనాథ్ టాగోర్ 150 వ జయంతిని పురస్కరించు కొని 2011, ఏప్రిల్ 27 నుంచి మే 7వ తేది వరకు ' శాంతి నికేతన్ 'లో పర్యటించారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు.కేంద్ర సాహిత్య అకాడమీ మొదటిసారిగా 'లక్షద్వీప్' లో ఏర్పాటు చేసిన సాహిత్య కార్యక్రమానికి తెలుగు సాహిత్యకారుడిగా హాజరయ్యారు. వీరి' పాపాఘ్ని కథలు ' కడప ఆకాశవాణి కేంద్రం నుంచి ధారావాహిక గా ప్రసారమయ్యాయి. యోగి వేమన విశ్వవిద్యాలయం ఎం.ఏ విద్యార్థులకు వీరి నవల' నేల దిగిన వాన' పాఠ్యాంశంగా నిర్దేశించారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ నూతనంగా వెలువరించిన ఒకటి నుంచి ఆరు తరగతుల తెలుగుపాఠ్యపుస్తకాలకు సమన్వయకర్తగా వ్యవహరించారు.

డాక్టర్ వేంపల్లి గంగాధర్, సాహిత్య అకాడమీ అవార్డ్ జ్ఞాపికతో.

రచనలు

[మార్చు]

ప్రచురితమయిన పుస్తకాలు

[మార్చు]
  • దీపమాను ( సాహిత్య వ్యాసాలు )
  • మట్టి పొరల మధ్య మహా చరిత్ర ( చరిత్ర వ్యాసాలు )
  • సి.పి. బ్రౌన్ కు మనమేం చేశాం? - సంపాదకత్వం
  • యురేనియం పల్లె ( నవల )
  • ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు-ప్రత్యేక రచన
  • అనంతపురం చరిత్ర -సంపాదకత్వం
  • రావణ వాహనం కథలు - (కథా సంపుటి )
  • పాపాఘ్ని కథలు - (కథా సంపుటి )
  • నేను చూసిన శాంతినికేతన్ (పర్యటన )
  • గ్రీష్మ భూమి కథలు - (కథా సంపుటి ) [3]
  • నేల దిగిన వాన - (నవల )
  • తొలి తెలుగు శాసనం (కలమళ్ళ శాసనం ఫై పరిశోధన)
  • దేవరశిల - (కథా సంపుటి )
  • కడప వైభవం -ప్రత్యేక సంచిక -సమన్వయ కర్త
  • పూణే ప్రయాణం (రాయలసీమ గిరిజన తండాల్లో మహిళల ఆక్రందన)
  • హిరణ్య రాజ్యం - (రాయలసీమ కక్షల చరిత్ర )
  • మొలకల పున్నమి- (కథా సంపుటి)
  • కథనం (వ్యాస సంకలనం )

నవలలు

[మార్చు]
  • నేల దిగిన వాన
  • యురేనియం పల్లె

కవితలు

[మార్చు]
  • విధ్వంసం (నవ్య వార పత్రిక 24-8-2005)
  • వాన దెయ్యం (ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం 2008 ఏప్రిల్ 6 )
  • దుఃఖిత హస్తాలు (ఆంధ్ర ప్రదేశ్ మాస పత్రిక )
  • ఒక తెల్ల పావురం, ఒక ఎర్ర గులాబీ (సూర్య ;అక్షరం పేజి 2011 అక్టోబరు 31)
  • హంపి బజార్ (ఆంధ్ర భూమి ;సాహితి పేజి 2011 నవంబరు 7)
  • ఈ రాత్రి నక్షత్ర పూల చెట్టు కింద .... ( కవి సంగమం;2012 సంకలనం)
  • జైలు బయట ఒక రోజు (ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం;2012 ఫిబ్రవరి 26)
  • నీ పూర్వ వృత్తాంతం (పాలపిట్ట మాస పత్రిక మార్చి2013)
  • ఏ జెండా కింద ఈ నేల ? (ఆంధ్ర జ్యోతి;వివిధ 2013 అక్టోబరు 28 )

పలు కవితలు ప్రముఖ పత్రికల్లో ముద్రించబడ్డాయి.[4][5]

వ్యాసాలు

[మార్చు]

వేంపల్లి గంగాధర్ రాసిన పలు వ్యాసాలు ప్రముఖ తెలుగు పత్రికల్లో అచ్చయినాయి.[6]

గుర్తింపు, పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం పురస్కారం
1999 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక సమాఖ్య సాహిత్య విమర్శ పురస్కారం
2001 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక సమాఖ్య మీడియా రైటింగ్ పురస్కారం

బయటి లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "డా. వేంపల్లి గంగాధర్ గురించి". poddu.net. Retrieved 2015-06-12.
  2. "వేంపల్లి గంగాధర్‌కు రాష్టపతి భవనం నుండి అహ్వానం". kadapa.info. Archived from the original on 2015-06-12. Retrieved 2015-06-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "గ్రీష్మభూమి: వేంపల్లి గంగాధర్ కథలు". sakshi.com. Archived from the original on 2015-06-12. Retrieved 2015-06-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. వేంపల్లి, గంగాధర్ (2015). "పురాతన ఉషోదయం | పొద్దు". poddu.net. Retrieved 2015-06-12.
  5. * ఏ జెండా కింద ఈ నేల ? (ఆంధ్ర జ్యోతి;వివిధ 28అక్టోబర్ 2013 )
  6. "రాయలసీమ పలుకే రత్నం - తెలుగు వెలుగు సెప్టెంబర్ 2012 (ఫ్లాష్ పేజీ)". Archived from the original on 2014-10-12. Retrieved 2015-06-12.