వేదాంతం రత్తయ్య శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేదాంతం రత్తయ్య శర్మ (జ.1943) కూచిపూడి నాట్యాచార్యుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన అన్నపూర్ణమ్మ మరియు రామయ్య దంపతులకు జన్మించాడు. ఆయన వేదాంతం పార్వతీశం, చింతా కృష్ణమూర్తి మరియు వెంపటి చినసత్యం యొక్క ఆరాధకుడు. ఆయన వివిధ ప్రదర్శనలలో హిరణ్యకశిపుడు, బాణాసురుడు, అనిరుద్ధుడు, శివుడు, శ్రీరాముడు, శ్రీనివాసుడు పాత్రలను మరియు రంగసాని వంటి స్త్రీ పాత్రలను ధంరించాడు. ఈ నటన మాత్రమే కాకుండా ఆయన వివిధ నృత్య నాటికలను వ్రాసి వాటికి దర్శకత్వం వహించేవాడు. వెంపటి చినతత్యం డ్రామాలలో ఆయన అనేక వైవిధ్యమైన పాత్రలను పోషించాడు.అ అయన ఆకాశరాజు, భృగుమహర్షి మరియు చోళరాజు గా పద్మావతీ శ్రీనివాస కళ్యాణం నాటకంలోనూ, దక్షునిగా హరవిలాసం నాటకంలోనూ మరియు యితర నాటకాలలో వివిధ పాత్రలను ధరించాడు. ప్రత్యేకంగా శివధనుర్భంగం, క్షీరసాగర మథనం మరియు రుక్మిణీ కల్యాణం లలో మంచి గుర్తింపు తెచ్చిన పాత్రలలో నటించాదు. అదే కాకుండా సినిమాలలో కూడా నటించాడు.

ఆయన దేశ విదేశాలలో 2000లకు పైగా ప్రదర్శనలిచ్చాడు. ఆయన 1969 నుండి కూచిపూడి కళాక్షేత్రంలో నాట్యాచార్యునిగా పనిచేస్తున్నాడు. ఆయన ఆ సంస్థకు ప్రధానాధ్యాపకులు గా ఉంటూ ప్రహ్లాద విజయ యక్షగానం, గిరిజా కల్యాణం, అర్థనారీశ్వరం, క్షీరసాగర మథనం మరియు భామాకలాపం నాటకాలకు నృత్య దర్శకత్వం వహించాడు.[1]

కూచిపూడి నాట్యారామం, కేంద్ర సంగీత నాటక అకాడమీ, నర్తనం పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో నాట్యక్షేత్రం కూచిపూడి శ్రీసిద్ధేంద్రయోగి కళాపీటం ఆవరణలో కూచిపూడి యక్షగాన మహోత్సవాలలో నాట్యాచార్యులు వేదాంతం రత్తయ్య శర్మ స్వీయ దర్శకత్వంలో భామాకలాపం ప్రదర్శించబడినది.[2]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]