2008
- మిడ్-రేంజ్ ఎస్ ఎల్ ఆర్ తో బాటు వీడియో రికార్డింగ్ కల నికాన్ డి90 విడుదల
2005
- నికాన్ డి3 మరియు నికాన్ డి700 విడుదల
1999
- సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా నికాన్ డి1 విడుదల
1995
- ఈ ఎఫ్ 75-300 ఎం ఎం పేరు తో కెనాన్ కెమెరా కటకం విడుదల చేసినది
1992
- ఈ ఓ ఎస్ 5 మరియు పవర్ షాట్ 600 (ఇది కెనాన్ యొక్క మొదటి డిజిటల్ కెమెరా) లని కెనాన్ విడుదల చేసినది.
1991
- DCS 100 పేరుతో కొడక్ వాణిజ్యపరంగా మొట్టమొదటి డి ఎస్ ఎల్ ఆర్ కెమెరాని అందుబాటులోకి తెచ్చింది
1988
- Nippon Kōgaku Kōgyō Kabushikigaisha గా స్థాపించబడిన సంస్థ Nikon Corporation గా మారినది
1987
- ఎలెక్ట్రో ఆప్టికల్ సిస్టం (ఈ ఓ ఎస్) శ్రేణిలో మొట్టమొదటిదైన కెనాన్ ఈ ఓ ఎస్ 650 విడుదల
1981
- మొట్టమొదటి ఛార్జ్ కపుల్డ్ డివైస్ ని సోనీ మావికా అనే కెమెరాలో వినియోగం. దీనితో ఫిలిం కి తెర పడింది.
1980
1976
- మైక్రోకంప్యూటర్ తో అనుసంధానించబడిన ప్రపంచం లోనే మొట్టమొదటి కెమెరా ఏఈ-1 ని కెనాన్ రూపొందించినది
1971
- కెనాన్ ఎఫ్-1 అనబడు ఎస్ ఎల్ ఆర్ కెమెరాని విడుదల చేసినది
- నికాన్ ఎఫ్ 2 విడుదల
1965
- కెనాన్ పెలిక్స్ అనబడు సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా విడుదల
1963
- పోలరాయిడ్ ఇన్స్టంట్ కలర్ ఫిలిం ను కనుగొన్నది
1961
- కెనాన్ 7 అనబడు రేంజ్ ఫైండర్ కెమెరా విడుదలైనది
1959
- కెనాన్ మొట్టమొదటి చలనచిత్ర కెమెరా అయిన రిఫ్లెక్స్ జూం 8 ని విడుదల చేసినది
- కెనాన్ 35 ఎం ఎం ఫిలిం సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా అయిన కెనాన్ ఫ్లెక్స్ ని విడుదల చేసినది
- నికాన్ తన మొట్టమొదటి సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా అయిన నికాన్ ఎఫ్ ని విడులద చేసినది
1958
- టెలివిజన్ ప్రసారలకై కెనాన్ జూం కటకాన్ని కనుగొన్నది
1957
- నికాన్ తన రేంజ్ ఫైండర్ కెమెరా అయిన నికాన్ ఎస్ పి ని విడుదల చేసినది
1948
- మొట్టమొదటి నికాన్ కెమెరా నికాన్ ఐ విడుదల
1940
- కెనాన్ మొదటి ఎక్స్-రే కెమెరాని రూపొందించినది
1937
- కెనాన్ మాతృ సంస్థ అయిన ప్రెసిషన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ల్యాబొరెటరీ స్థాపన
1936
- అగ్ఫా యొక్క కలర్ ఫిలిం అగ్ఫా కలర్ న్యూ రూపొందించబడినది
1935
- మొట్టమొదటి కలర్ ఫిలిం (ఇంటెగ్రల్ ట్రైప్యాక్ లేదా మోనోప్యాక్) ని కోడాక్ కోడాక్రోం పేరు తో పరిచయం చేసింది.
1932
- నికాన్ యొక్క Nikkor బ్రాండు పరిచయం
1917
1908
- గాబ్రియల్ లిప్మన్ వ్యతీకరణ పద్ధతి ద్వారా ఫోటోలలో రంగులను పునరుత్పత్తి చేయగల లిప్మన్ ప్లేట్ ను కనుగొన్నాడు
1907
- లూమియర్ సోదరులచే ఆటోక్రోం అనే కలర్ ఫోటోగ్రఫీ ప్రక్రియ కనుగొన్నారు
1888
- జార్జ్ ఈస్ట్మన్ మరియు హెన్రీ ఏ స్ట్రాంగ్ లు కలిసి కొడాక్ సంస్థను స్థాపించారు
1884
- జార్జ్ ఈస్ట్మన్ ఫోటోగ్రఫిక్ ప్లేట్ ల స్థానే ఫిలిం ని ఉపయోగించే సాంకేతికతని కనుగొన్నాడు
1873
- జర్మను ఫోటోకెమిస్ట్ హెర్మన్ వోగెల్ ఆకుపచ్చ, పసుపుపచ్చ మరియు ఎరుపు రంగులని గుర్తించగలిగే డై సెన్సిటైజేషన్ అనే ప్రక్రియను కనుగొన్నాడు. ఇదే కలర్ ఫోటోగ్రఫీ ని వాణిజ్య రంగం వైపుకి మరల్చింది
1861
- మొట్టమొదటి శాశ్వత కలర్ ఫోటోని తీశారు
1860
- లూయీస్ డుకోస్ డు హారోన్ అనే ఫ్రెంచి ఫోటోగ్రఫర్ సబ్ట్రాక్టివ్ మెథడ్ ఆఫ్ కలర్ రీప్రొడక్షన్ (వ్యవకలన పద్ధతి)ని కనుగొన్నాడు
1855
- స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త జేంస్ క్లర్క్ మ్యాక్స్వెల్ మూడు రంగుల వేర్పాటు సిద్ధాంతం (త్రీ-కలర్-సెపరేషన్ ప్రిన్సిపల్) ని కనుగొన్నాడు
1851
- ఫ్రెడరిక్ స్కాట్ wet plate collodion ప్రక్రియని ప్రచురించాడు
1840
- ఇంగ్లీషు ఆవిష్కర్త విలియం హెన్రీ ఫాక్స్ టాల్బట్ సిల్వర్ ప్రక్రియ చిత్రాన్ని శాశ్వతీకరించటానికి డాగ్యురె ప్రక్రియని ఆధారం చేసుకొని దానినే మరింత అభివృద్ధి చేసి నెగిటివ్ లని రూపొందించే క్యాలోటైప్ ప్రక్రియని కనుగొన్నాడు
1839
- మార్చి 14: లండన్ రాయల్ సొసైటీ లో సర్ జాన్ హర్షల్ ఈ ఫోటోగ్రఫీ అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు
- ఫిబ్రవరి 25: Vossische Zeitung అనే జర్మను వార్తాపత్రికలో జొహాన్ వాన్ మేడ్లర్ అనే బెర్లిన్ ఖగోళ శాస్త్రవేత్త ఈ పదాన్ని వాడాడు
- జాన్ హర్షల్ సోడియం థయోసల్ఫేట్ ఫోటోలని స్థిరీకరించి మన్నగలిగేలా చేస్తుందని టాల్బట్ మరియు డాగురె లకి సమాచారమందించాడు. మొదటి గ్లాస్ నెగటివ్ ని తయారు చేశాడు
1838
- పాలిష్ చేయించుకోవటానికి ఒక వ్యక్తి కొన్ని నిముషాల బాటు ఆగి ఉండగా, లూయిస్ డాగ్యురె అతనిని చిత్రీకరించాడు
1837
- నిసేఫోర్ నీప్సె తో కలసి సిల్వర్ కాంపౌండ్ ల పై ప్రారంభించిన ప్రయోగాలని నీప్సే మరణించిన తర్వాత కూడా కొనసాగించిన లూయీస్ డాగ్యురె డాగ్యురోటైప్ ని కనుగొన్నాడు
1835
- ఇప్పటివరకూ తెలిసిన అతి పురాతమైన నెగటివ్ గా గుర్తించబడిన ల్యాకోక్ అబ్బే లోని ఓరియల్ కిటికీ యొక్క ఛాయాచిత్రం తీయబడినది
1834
- బ్రెజిల్ లోని కెంపినాస్ లో హెర్క్యూల్స్ ఫ్లారెన్స్ అనే ఒక ఫ్రెంచి చిత్రకారుడు మరియు ఆవిష్కర్త ఒకానొక పద్ధతిని వివరించేందుకు తన డైరీలో "photographie" అనే పదాన్ని రాసుకొన్నాడు.
1832
- బ్రెజిల్ కు చెందిన హెర్క్యులెస్ ఫ్లారెన్స్ ఇంచుమించు డాగ్యురోటైప్ పద్ధతిని అవలంబించి దానిని ఫోటోగ్రఫీ అని వ్యవహరించాడు
1826
- నిసేఫోర్ నీప్సె తన కెమెరా అబ్స్క్యూరా తో మొట్టమొదటి శాశ్వత ఫోటోగ్రాఫ్ వ్యూ ఫ్రం ద విండో ఎట్ లే గ్రాస్ (View from the Window at Le Gras) ని సృష్టించటంలో సఫలీకృతులు
1822
- ఫ్రెంచి ఆవిష్కర్త నిసేఫోర్ నీప్సె మొట్టమొదటి శాశ్వత చిత్రాన్ని ముద్రించిననూ, డూప్లికేట్ చేసే ప్రక్రియలో అది చెడిపోయినది
1820
- ఫోటోగ్రఫీ లో రసాయనిక ప్రక్రియల ఉపయోగం ప్రారంభం
|