వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 27

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 సెప్టెంబరు 27 (2008-09-27)!(శనివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ఢిల్లీలో మళ్ళి బాంబుపేలుళ్ళు జరిగి ఇద్దరు మృతిచెందారు, 20 మందికిపైగా గాయపడ్డారు.
  • మున్సిపల్, జిల్లా, మండల పరిషత్తు పాఠశాలలకు శాశ్వత గుర్తింపు కల్పిస్తూ ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
  • తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అద్యక్ష పదవి నుంచి కాకర్ల ప్రభాకర్‌ను తొలిగించాలని తానా పాలకమండలి నిర్ణయించింది.
  • చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది.
  • ఇరానీ ట్రోఫి క్రికెట్‌ను రెస్టాఫ్ ఇండియా విజయం సాధించింది. ఈ ట్రోఫీ రెస్టాఫ్ ఇండియా చేజిక్కించుకోవడం ఇది 21వ సారి. వదోదరలో జరిగిన ఫైనల్లో ఢిల్లీ జట్టుపై 187 పరుగుల ఆధిక్యతతో గెల్చింది.
  • ప్రముఖ సినీగాయకుడు మహేంద్ర కపూర్ ముంబాయిలో మరణించాడు.
  • ప్రముఖ హాలివుడ్ నటుడు పాల్ న్యూమన్ లాస్ ఏంజిల్స్ లో మరణించాడు.
  • భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అద్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితులైనాడు. కార్యదర్శి పదవి ఎన్.శ్రీనివాసన్‌కు దక్కింది.
  • భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మెన్‌గా కృష్ణమాచారి శ్రీకాంత్ ఎన్నికయ్యాడు.
  • భారత మహిళల క్రికెట్ జట్టు సెలెక్టర్‌గా ఆమ్ధ్ర ప్రదేశ్‌కు చెందిన పూర్ణిమారావు ఎంపికైంది.
  • చైనా మాస్టర్స్ సూపర్ సీరీస్ టోర్నమెంటు సమీఫైనల్లో సైనా నెహ్వాల్ పరాజయం పొందింది.