Jump to content

విశాఖ స్టీల్ ప్లాంట్

వికీపీడియా నుండి
(వైజాగ్ స్టీలు ప్లాంటు నుండి దారిమార్పు చెందింది)
విశాఖ స్టీల్ ప్లాంట్
రకంపబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్
పరిశ్రమఉక్కు
స్థాపన1971
ప్రధాన కార్యాలయంవిశాఖపట్నం, భారతదేశం
కీలక వ్యక్తులు
కపిల్, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్
ఉత్పత్తులుForged Rounds
re-bars
Rounds
Wire rods Coil
Structurals
యజమానిరాష్ట్రీయ ఇస్పాత్ నిగం
వెబ్‌సైట్www.vizagsteel.com Edit this on Wikidata

వైజాగ్ స్టీల్ (Vizag Steel) గా ప్రసిద్దమైన విశాఖ ఉక్కు కర్మాగారం , భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు. ఇది, విశాఖపట్టణం నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో, జర్మనీ, సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించారు. కర్మాగారం ఉత్పత్తులు మన్నిక కలిగినవిగా దేశవిదేశాలలో పేరుగన్నవి. సంస్థ రాబడిలో 80% జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలకు చేయబడుతున్న ఎగుమతుల ద్వారానే వస్తున్నాయి. 2010 నవంబరు 10న నవరత్న హోదా పొందింది. కర్మాగారం విస్తరించి ఉన్న ప్రాంతం, భారతదేశం, ఆసియా మైనర్ లలోనే అతి పెద్దది.

చరిత్ర

[మార్చు]
వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దనున్న స్మారక చిహ్నం

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ తమనంపల్లి అమృతరావు మరణ నిరాహారదీక్షతో "విశాఖఉక్కు ఆంధ్రులహక్కు" అనే 1966 అక్టోబరు, 15న ప్రారంభమైంది. ఆ ఉద్యమం మొదలు తరువాత పదిరోజులకు దివంగత తెన్నేటి "అఖిలపక్ష సంఘం ఏర్పాటు చేసారు. తెన్నేటి విశ్వనాధం, అమృతరావు ధీక్షకు సానుభూతిగా నాడు నడిపిన ఉద్యమ ఫలితంగా, అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ, నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిచే1966 నవంబరు, 3 న ఉద్యమనేత అమృతరావుకు లిఖితపూర్వక హామీ ఇచ్చింది.1970 ఏప్రిల్ 17 న విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6000 ఎకరాలు 1970లో దానం చేసారు. 1970 జూన్ లో ఏర్పాటు చేసిన స్ఠల పరిశీలన కమిటీతో కర్మాగారాపు ప్రణాళికలు మొదలయ్యాయి. 1971 జనవరి 20న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేతులు మీదుగా కర్మాగార శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

1971 ఫిబ్రవరిలో సలహాదారులు నియమింపబడ్డారు. 1972 లో సాధ్యాసాధ్య నివేదిక (feasibility report) ప్రభుత్వానికి సమర్పంపబడింది.1974 ఏప్రిల్ 7న మొదటి దశ స్థల సేకరణ జరిగింది. 1975 ఏప్రిల్ నెలలో సమగ్ర నివేదిక సమర్పంచేందుకు M/s M.N.దస్తూర్ & కోని సలహాదారుగా ఏర్పాటు చేయగా, 3.4 ఎం.టి.పి.ఏ ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యత గల కర్మాగార ఏర్పాటుకై ప్రతిపాదనలు 1977 అక్టోబరులో ప్రభుత్వానికి చేరాయి. పూర్వ సంయుక్త రష్యా సహకారంతో నివేదికలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. 1980 నవంబరులో M/s M.N.దస్తూర్ & కో సమగ్ర నివేదికని సమర్పించింది. కోక్ ఒవెన్, సెగ కొలిమి, సింటర్ ప్లాంట్ల రూపకల్పనకై పూర్వపు రష్యా దేశంతో 1981 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. 1982 జనవరిలో సెగ కొలిమి నిర్మాణానికి, ఉద్యోగస్ఠుల పట్టణానికి శంకుస్థాపన జరిగింది.

1982 ఫిబ్రవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) ఏర్పడింది. 1982 ఏప్రిల్ నెలలో వైజాగ్ స్టీల్, భారతీయ ఉక్కు సంస్థ (SAIL) నుండి, విడివడి RINL గా గుర్తింపు పొందాయి..

33వేల ఎకరాలలో విస్తరించి ఉన్న వైజాగ్ స్టీల్, భారతదేశంలోని తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం. 3.6 MTగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3MTకి పెంచే రూ. 8,692కోట్ల విస్తరణ ప్రాజెక్టుని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ 2009 మే 29న ప్రారంభించాడు.

విభాగాలు

[మార్చు]

కర్మాగారం మొత్తంగా, 35 మైళ్ళ మేర 25 వేల ఎకరాలలో విస్తరించి ఉంది. సంస్థలోని విభాగాలు

  • రా మెటీరియల్ హాండ్లింగ్ ప్లాంట్ (Raw Material Handling Plant - RMHP)
  • కోక్ ఒవెన్, కోల్ కెమికల్ ప్లాంట్ (Coke Ovens and Coal Chemical Plant)
  • సింటర్ ప్లాంట్ (Sinter Plant)
  • బ్లాస్ట్ ఫర్నెస్ (సెగ కొలిమి)
  • స్టీల్ మెల్ట్ షాప్, కంటిన్యుస్ కాస్టింగ్ (Steel Melt Shop and Continuous Casting)
  • లైట్ & మీడియం మర్చంట్ మిల్ల్ (Light and Medium Merchant Mill)
  • మీడియం మర్చంట్ & స్ట్రక్చరల్ మిల్ల్ (Medium Merchant and Structural Mill)
  • వైర్ రాడ్ మిల్ల్ (Wire Rod Mill)
  • థర్మల్ పవర్ ప్లాంట్ (THERMAL POWER PLANT)

ప్రమాదాలు

[మార్చు]

కొత్తగా ఏర్పాటు చేయబడిన ఆక్సిజన్ ప్లాంట్ ని పరీక్షిస్తున్న సమయంలో (2012 జూన్ 13న), జరిగిన భారీ విస్ఫోటనంలో 19 మంది మృతి చెందారు. [1] కేంద్ర ఉక్కు శాఖా మంత్రి బేణీ ప్రసాద్ వర్మ, మృతిచెందిన ఉద్యోగస్థుల కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.

కార్మికుల సంఘం

[మార్చు]

ఇక్కడి కార్మికుల కోసం విశాఖ ఉక్కు కార్మికుల సంఘం కూడా ఉంది. ఇది ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌తో అనుబంధంగా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Massive explosion and fire in Vizag Steel plant, 16 dead, many injured". 13 June 2012.

బయటి లింకులు

[మార్చు]