ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ చిహ్నం

ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) భారతదేశంలో పురాతన కార్మిక సంఘం సమాఖ్య.  భారత కమ్యూనిస్టు పార్టీతో సంబంధం కలిగి ఉంది. లాలా లజపతిరాయ్ మొదటి అధ్యక్షుడిగా 31 అక్టోబరు 1920న స్థాపించబడింది. బొంబాయిలో లాలా లజపతిరాయ్, జోసెఫ్ బాప్టిస్టా, ఎన్. ఎం జోషి, దివాన్ చమన్ లాల్,మరికొంత మంది ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ స్థాపించడం ముఖ్యపాత్ర వహించారు.[1]

పరిచయం

[మార్చు]

దేశంలోని మొదటి జాతీయ కార్మిక సంఘం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి). భారతదేశంలో బ్రిటిష్ పాలన లో శ్రమ తరగతి ఆవిర్భవించింది. స్వయం సమృద్ధి గల గ్రామ ఆర్థిక వ్యవస్థ కొత్త నిర్మాణాలు లేకుండా ఛిన్నాభిన్నమైంది,  రైతులను పేదలుగా చేయడం మొదలైనవి జరిగినవి. చౌకైన పారిశ్రామిక వస్తువులను విదేశాలనుంచి భారతదేశం లో ప్రవేశ పెట్టడం తద్వారా  లక్షలాది మంది కళాకారులు, , నేతకార్మికులు, చేతివృత్తులవారు, వడ్రంగి , కుమ్మరి, వ్యవసాయము పై ఆధారపడి ఉన్న శ్రామికులు , పరిశ్రమలలో పనిచేసే వారు గా  1850 సంవత్సరం నుండి 1890 సంవత్సరం వరకు భారతదేశంలో జరిగింది . లక్షలాది మంది ప్రజలు చనిపోవడం , పేదలుగా మారడం జరిగింది[2] .మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో రష్యాలో 1917 లో అక్టోబర్ విప్లవం భారతీయ కార్మిక ఉద్యమానికి గొప్ప ప్రేరణగా నిలిచింది, ఎందుకంటే కార్మిక వర్గం రైతులతో కలిసి మానవజాతి చరిత్రలో మొదటిసారి అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో  ధరలు , తరువాత కార్మికుల తక్కువ జీవన ప్రమాణాలకు దారితీయడం, మహాత్మా గాంధీ నాయకత్వం లో  సామాజిక-రాజకీయ పరిస్థితుల ప్రభావం రష్యన్ విప్లవం, 1919 సంవత్సరం లో  అంతర్జాతీయ కార్మిక సంస్థ  ఏర్పాటు కావడం మొదలైనవి భారతదేశం లో  ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పాటుకు మార్గం  సుగమం చేసింది.[1]

చరిత్ర

[మార్చు]

ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) 1920 అక్టోబరు 31న బొంబాయి (ముంబై)లో స్థాపించబడింది. మొట్ట మొదటి సమావేశం 1920 అక్టోబరు 31న ఎంపైర్ థియేటర్ లో లాలా లజపతిరాయ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రారంభమైంది. ఈ సమావేశం లో భారతదేశం నలుమూలల నుంచి 1,40,854 మంది సభ్యత్వం కలిగిన 64 సంఘాల కు చెందిన 101 మంది ప్రతినిధులు మోతీలాల్ నెహ్రూ, ఎం.ఎ. జిన్నా, అనీ బిసెంట్ , వి.జె. పటేల్, వంటి రాజకీయ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  బి.పి. వాడియా, జోసెఫ్ బాప్టిస్టా, లాలూభాయ్ సామల్దాస్, జమ్నాదాస్, ద్వారకా దాస్, బిడబ్ల్యు వాడియా, ఆర్ ఆర్ కరండికర్, కల్నల్ జె.సి . వెడ్గ్ ఉడ్. లాలా లజపతిరాయ్ అధ్యక్షుడిగా ఈ మొదటి సమావేశంలో జరిగింది , దీవాన్ చమన్ లాల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తరువాత జవహర్ లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వి.వి.గిరి, సరోజినీ నాయుడు, చిత్త రంజన్ దాస్ స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన అనేక ఇతర రాజకీయ నాయకులు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కార్యక్రమాలలో సంబంధం కలిగి ఉన్నారు. 1921లో ఝరియాలో జరిగిన ఎఐటియుసి తన రెండవ సమావేశంలో స్వాతంత్ర్య పోరాట వేదికకు దాదాపు ఎనిమిదేళ్ల ముందు భారత బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం విముక్తికి తీర్మానాన్ని ఆమోదించింది- భారత జాతీయ కాంగ్రెస్ 1929 సంవత్సరంలో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. లాలా లజపతిరాయ్, (1865-1928) మొదటి అధ్యక్షుడు, జోసెఫ్ బాప్టిస్టా (1864-1930), ఎన్.ఎం . జోషి (1879-1955), దివాన్ చమన్ లాల్ (1892-1973) ఉన్నారు.[3]

లక్ష్యాలు

[మార్చు]

ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) క్రింది లక్ష్యాలను పెట్టుకున్నది.[4]

  • భారతదేశంలో సామ్యవాద రాజ్యాన్ని ఏర్పాటు చేయడం.
  • వస్తు ఉత్పత్తి ని జాతీయం చేయడం.
  • మెరుగైన ఆర్థిక, సామాజిక పరిస్థితులను కల్పించడం.
  • వాక్ స్వాతంత్య్రం, సంఘాలను ఏర్పాటు చేసుకునే అవకాశం
  • జాతీయ పోరాటంలో కార్మికులు పాల్గొనేటట్లు చేయడం.
  • కుల, వృత్తి, జాతి, మత వివక్షను రద్దు చేయడం.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "ALL INDIA TRADE UNION CONGRESS - JournalsOfIndia". 2020-11-05. Archived from the original on 2021-10-02. Retrieved 2021-10-02.
  2. "AITUC: The Mother of All CTUOs". www.labourfile.com. Retrieved 2021-10-02.
  3. "DSpace at My University: ALL INDIA TRADE UNION CONGRESS (AITUC)". indianlabourarchives.org. Archived from the original on 2022-01-29. Retrieved 2021-10-02.
  4. "ఏఐటీయూసీని ఎప్పుడు స్థాపించారు?". Sakshi. 2014-08-30. Retrieved 2021-10-02.