ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏలాంకుళం మనక్కళ్ శంకరన్ నంబూద్రిపాద్
ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్

ఏలాంకుళం మనక్కళ్ శంకరన్ నంబూద్రిపాద్


పదవీ కాలం
5 ఏప్రెల్ 1957 – 31 జులై 1959
పదవీ కాలం
6 మార్చి 1967 – 1 నవంబరు 1969

వ్యక్తిగత వివరాలు

జననం మూస:పుట్టిన రోజు
పెరిందాళ్ మన్న, మలప్పురం, మద్రాస్ ప్రాంతం, బ్రిటిష్ ఇండియా
మరణం 1998 మార్చి 19(1998-03-19) (వయసు 88)
తిరువనంతపురం, కేరళ, ఇండియా
రాజకీయ పార్టీ సిపిఎమ్
జీవిత భాగస్వామి ఆర్యా అంతర్జనం
సంతానం ఇరువురు కుమారులు, ఇరువురు కుమార్తెలు.
నివాసం A house rented for him by the Communist party in Kerala's capital, Thiruvanthapuram
మతం నాస్తికుడు

ఈయెమ్మెస్ అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన ఏలాంకుళం మనక్కళ్ శంకరన్ నంబూద్రిపాద్, (1909 జూన్ 13 – 1998 మార్చి 19), భారత దేశ చరిత్ర లోనే చెప్పుకోదగ్గ గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు, సాంఘిక-మార్క్స్ వాద సూత్ర బద్ధుడు, విప్లవవాది, రచయిత, చరిత్రకారుడు, సాంఘిక విమర్శకుడే కాక, కేరళ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్య మంత్రి కూడాను. కాంగ్రెస్ పార్టీ బయటివాడైన ముఖ్యమంత్రిగా భారత దేశములో ఎన్నికైన మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వ నాయకుడీయన.

ఏలాంకుళం మనక్కళ్ శంకరన్ నంబూద్రిపాద్ కేరళలో శ్రీకారం చుట్టిన మౌలికమైన భూ సంస్కరణలు, విద్యా సంస్కరణలను అనుకరించే ప్రయత్నాలు ఈ నాటికి ఇతర భారతీయ రాష్ట్రాలలో జరుగుతూనే ఉన్నాయి. మార్క్స్ వాద కమ్యూనిస్ట్ పార్టీ ఆచరణా సమితి సభ్యుడిగా, 14 యేళ్ళ పాటు ప్రధాన కార్యదర్శిగా ఈయన తీసుకున్న చొరవ, ముందుచూపు గల నిర్ణయాలవలనే ఆ పార్టీ ఈనాడు జాతీయ స్థాయి సంకీర్ణ ప్రభుత్వ రాజకీయాలను ప్రాభావితం చేయగలిగే ప్రముఖమైన రాజకీయ పక్షంగా ఎదిగిందనడంలో అతియోశక్తి లేదు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఏలాంకుళం మనక్కళ్ శంకరన్ నంబూద్రిపాద్ 1909 జూన్ 13 నాడు, ప్రస్తుత మలప్పురం జిల్లా పెరింతాళ్ మన్న తాలూకా ఏలాంకుళం గ్రామంలోని కులీన అగ్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.వీరి తండ్రిగారి పేరు పరమేశ్వరన్ నంబూద్రిపాద్. చిన్న వయసులోనే ఈయన వి.టి.భట్టాద్రిపాద్ మొదలయిన పెద్దవారికి చేయూతగా, కేరళ నంబూద్రి కుటుంబాలలో పాతుకుపోయిన కులవివక్ష, సాంప్రదాయ వాదం ధోరణులకు వ్యతిరేకంగా పోరాడారు. చదువుకునే రోజుల్లో భారత జాతీయ కాంగ్రెస్తో సహచర్యంతో స్వాతంత్ర్య సంగ్రామంలో తీవ్ర కృషి చేసారు. ఈయన వ్రాసిన పలు గ్రంథాలలో కేరళ చరిత్ర అనే పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది.[1]

సామ్య వాదం

[మార్చు]

1934 లో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సామ్యవాద పక్షంగా తలయెత్తిన కాంగ్రెస్ సామ్యవాద పక్షం ఆద్యులలో ఈయెమ్మెస్ ఒకరు. ఈ పార్టీ అఖిల భారత సహకార్యదర్శిగా 1934 నుంచి 1940 వరకు పనిచేసి, 1939 అదే హోదాలో మద్రాస్ విధాన సభకు కూడా ఎన్నికైనారు. 1938 లో కేరళ కంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆ సమయంలో చునంగత్ కుంజికావమ్మ అధ్యక్షురాలిగా ఉండేది.

సామ్యవాద ఆదర్శాలకు నిబద్ధుడైన ఈయెమ్మెస్ లోని పీడితప్రజల పట్ల గల సానుభూతి ఆయనను కమ్యూనిస్ట్ ఉద్యమం కేసి ఆకర్షించింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాని కేరళలో స్థాపించిన వారిలో ముఖ్య పాత్ర పోషించినందుకు కొంతకాలం అజ్ఞాతవాసంలోకి కూడా వెళ్ళవలసి వచ్చింది. భారత్ చైనా యుద్ధం 1962 లో, కమ్యూనిస్ట్ చైనా దృక్పథాన్ని బలపరచి వివాదాస్పదుడైనాడు ఈయెమ్మెస్. 1964 లో కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయినప్పుడు ఈయన సిపిఎమ్ వైపు మొగ్గు జూపారు. సిపిఎమ్ ఆచరణా సమితి (Politburo) కేంద్రీయ సభ్యుడిగా మొదలుపెట్టి తన జీవితాంతం కొనసాగిన నంబూద్రిపాద్,1977 లో సిపిఎమ్ ప్రధాన కార్యదర్శిగా పదవిని చేబట్టి 1992 వరకు ఆ బాధ్యతలను నిర్వహించారు. విశిష్టమైన మార్క్సిస్ట్ సూత్రవేత్తగా పేరొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సాంఘిక మేధావి ఈయెమ్మెస్ నంబూద్రిపాద్ ముందుచూపుకు, నిజాయితీనిబద్ధతలకు కేరళ సాధించిన అభివృద్ధే తార్కాణం. ఈ నాటికీ కేరళలో ఈయన పేరు,ఒకప్పటి ఈయన ప్రభుత్వ పనితీరుల గుఱించి దినదినం గొప్పగా చెప్పుకుంటూనే ఉంటారు.

రాష్ట్ర ప్రభుత్వ ఎన్నిక

[మార్చు]

మూస:Indcom

1957 మొట్టమొదటి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలలోకమ్యూనిస్ట్ పార్టీకి విజయం సాధించిన నంబూద్రిపాద్ ప్రపంచంలోనే "ఎన్నికైన కమ్యూనిస్ట్" నాయకులలో ఆద్యుడైనాడు. భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పక్షం రాష్ట్రస్థాయిలో గెలుపొందటంకూడా ఇదే ప్రథమం. 1957 ఏప్రిల్ 5 నాడు ఈయెమ్మెస్ కేరళ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి, త్వరలోనే భూ సంస్కరణల చట్టాన్ని,విద్యా చట్టాన్ని తీసుకువచ్చారు. వివాదాస్పదమైన పరిస్థితుల్లో 1959 లో కేంద్ర ప్రభుత్వం,భారత రాజ్యాంగం లోని 356 వ ప్రకరణం అనుసరించి రాష్ట్రపతి పాలన విధిస్తూ ఈ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. 1967 లో రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి నంబూద్రిపాద్ ముస్లిమ్ లీగ్ తో సహా 7 పార్టీల మద్దతు స్వీకరించారు. తన ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు ముస్లిముల కోసం ప్రత్యేక 'మలప్పురం' జిల్లా ఏర్పాటు చేసి,'స్వార్థ రాజకీయ వేత్త' అన్న విమర్శలకు పాలయ్యారు.

ఈయెమ్మెస్ కేరళ శాసన సభకు 1960-64, తిరిగి 1970-77 కాలంలో ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు. ప్రజల యోజన ద్వారా కేరళలో అధికార, వనరుల వికేంద్రీకరణకు, అక్షరాస్యతా ఉద్యమానికి కృషి చేసారు. ఆంగ్ల, మలయాళ భాషల్లో అనేక పుస్తకాలు రచించిన నంబూద్రిపాద్ పత్రికా విలేఖరిగా కూడా సుపరిచితుడే.

మృతి

[మార్చు]

నంబూద్రిపాద్ 1998 మార్చి 19 న మరణించారు. ఈయన భార్య పేరు ఆర్యా అంతర్జనం. వీరికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు.

ఇవికూడా చూడండి

[మార్చు]

ఉటంకింపులు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]
అంతకు ముందువారు
(none)
Chief Minister of Kerala
1957–1959
తరువాత వారు
Pattom Thanupillai
అంతకు ముందువారు
R. Sankar
Chief Minister of Kerala
1967–1969
తరువాత వారు
C. Achutha Menon