వై. సతీష్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యెరువ సతీష్ రెడ్డి
వై. సతీష్ రెడ్డి


చైర్మన్
తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ
పదవీ కాలం
2022 జూన్ 21 – 07 డిసెంబర్ 2023[1]

వ్యక్తిగత వివరాలు

జననం (1981-08-25) 1981 ఆగస్టు 25 (వయసు 42)
దేవగిరిపట్నం, ములుగు మండలం, ములుగు జిల్లా, తెలంగాణ
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
నివాసం హైదరాబాద్
పూర్వ విద్యార్థి బీటెక్ (ఈసీఈ)
వృత్తి రాజకీయ నాయకుడు
మతం హిందూ

యెరువ సతీష్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2022 జూన్ 21న తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ గా నియమించబడ్డాడు.[2]

జననం, విద్య[మార్చు]

సతీష్ రెడ్డి 1981, ఆగ‌స్టు 25న తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, ములుగు మండలం, దేవగిరిపట్నంలో జ‌న్మించాడు. బీటెక్ (ఈసీఈ) పూర్తిచేశాడు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో విద్యార్థి నాయ‌కుడిగా చేరిన సతీష్, మలిదశ తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించాడు. 2012 నుంచి 2019 వ‌ర‌కు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిగా ప‌నిచేశాడు. 2018లో తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో జరిగిన టిఆర్ఎస్ పార్టీ ప్ర‌గ‌తి నివేద‌న స‌భ మీడియా క‌మిటీ మెంబ‌ర్‌గా కూడా ప‌నిచేశాడు. 2020 నుంచి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్‌గా కొన‌సాగుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ విధానాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తున్నాడు.[4]

2022 జూన్ 21న తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ గా సతీష్ రెడ్డిని నియమిస్తూ, తెలంగాణ ప్రభుత్వం తరపున ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ జీవో నంబరు 1273 ద్వారా ఉత్తర్వులు జారీచేశాడు. సతీష్ ఈ పదవిలో మూడేళ్ళపాటు కొన‌సాగుతాడు.[3]

2022 జూన్ 24న తెలంగాణ రాష్ట్ర రెడ్‌కో చైర్మ‌న్‌గా స‌తీశ్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించాడు. ఈ కార్య‌క్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.[5] 2023 ఎన్నికల్లో  కాంగ్రెస్‌ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ప్రభుత్వం మారడంతో  కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకాలను రద్దు చేసింది.[6]

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Telangana News: చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అనిల్‌ కుర్మాచలం". EENADU. 2022-06-21. Archived from the original on 2022-06-21. Retrieved 2022-06-21.
  3. 3.0 3.1 telugu, NT News (2022-06-21). "ఆ రెండు కార్పొరేష‌న్ల‌ చైర్మన్లు వీరే.. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌". Namasthe Telangana. Archived from the original on 2022-06-21. Retrieved 2022-06-21.
  4. Telugu, Tnews (2022-06-21). "రెండు కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు". TNews Telugu. Archived from the original on 2022-06-21. Retrieved 2022-06-21.
  5. telugu, NT News (2022-06-24). "రాష్ట్ర రెడ్‌కో చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన వై స‌తీశ్ రెడ్డి". Namasthe Telangana. Archived from the original on 2022-06-24. Retrieved 2022-06-27.
  6. Eenadu (10 December 2023). "తెలంగాణలో 54 కార్పొరేషన్ల ఛైర్మన్‌ల నియామకాలు రద్దు". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.