వొడితల రాజేశ్వర్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వొడితల రాజేశ్వర్ రావు

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
1992 – 1998

ఎమ్మెల్సీ
పదవీ కాలం
1980 – 1985

ఎమ్మెల్యే
పదవీ కాలం
1972 – 1978
తరువాత దుగ్గిరాల వెంకటరావు
నియోజకవర్గం హుజూరాబాద్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1931 సెప్టెంబర్‌ 16
సింగాపూర్ గ్రామం, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి శారద
బంధువులు వొడితల ల‌క్ష్మీకాంత రావు (సోదరుడు)
నివాసం వరంగల్
మూలం [1]

వొడితల రాజేశ్వర్‌రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా, ఆ తరువాత ఎమ్మెల్సీగా, 1992 నుండి 98 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

వొడితల రాజేశ్వర్‌రావు తన స్వగ్రామం సింగాపూర్ సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అనంతరం హుజూరాబాద్ పంచాయతీ సమితి అధ్యక్షుడయ్యాడు. ఆయన 1972లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభ సభ్యునిగా ఎన్నికై, ఆ తర్వాత 1980-85 వరకు శాసనమండలి సభ్యునిగా పని చేశాడు. రాజేశ్వర్‌రావు 1992 నుండి 1998 వరకు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆయన 1994లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సభ్యుడిగా నియమితుడయ్యాడు.[3]

మరణం

[మార్చు]

వొడితల రాజేశ్వర్‌రావు కిడ్నీ సంబంధిత సమస్యలతో 2011 జూలై 24న హైదరాబాద్‌లో మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు వొడితల కిషన్‌రావు, శ్రీనివాసరావు, ఒక కుమార్తె జ్యోతి ఉన్నారు.[4]

విగ్రహం

[మార్చు]

వొడితల రాజేశ్వర్‌రావు విగ్రహాన్ని ఆయన మనుమడు వొడితల ప్రణవ్‌బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని సింగాపూర్‌లో మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, మాజీ ఎంపీ కెప్టెన్‌ ల‌క్ష్మీకాంత రావు తదితరులు పాల్గొన్నారు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Kavikulguru Institute Of Technology And Science". 2024. Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  2. Dishadasha (23 July 2023). "ప్రజా ప్రతినిధిగా… విద్యా సంస్థల అధిపతిగా…". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  3. Namaste Telangana (24 July 2023). "రాజేశ్వర్‌రావుకు అరుదైన గౌరవం". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  4. The New Indian Express (16 May 2012). "Singapuram Rajeshwar Rao dead" (in ఇంగ్లీష్). Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  5. Namaste Telangana (25 July 2023). "మాజీ ఎంపీ రాజేశ్వర్‌రావు మహా శిఖరం". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.