వ్యోమమిత్ర
వ్యోమమిత్ర | |
|---|---|
వ్యోమమిత్ర (ఆంగ్లం: Vyommitra) అనేది అంతరిక్ష ప్రయాణం కోసం రూపొందించిన మహిళ రూపంలో ఉండే మానవరూప రోబోట్. ఇది కేరళలోని తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో రూపొందించబడింది. గగన్‌యాన్ అంతరిక్ష నౌకలో పనిచేయడానికి ఇస్రో దీనిని అభివృద్ధి చేసింది. వ్యోమమిత్ర మొట్టమొదట 2020 జనవరి 22న కర్ణాటకలోని బెంగళూరు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ సింపోజియంలో ఆవిష్కరించారు.[1][2]
అధిక పీడనం, కంపనాలను తట్టుకునేలా ఎక్కువగా అల్యూమినియం మిశ్రమంతో నిర్మించబడింది, ఇది అంతరిక్ష కార్యకలాపాలలో భారతీయ వ్యోమగాములతో పాటు స్పేస్ క్రాఫ్ట్ లోను, మానవరహిత ప్రయోగాత్మక గగన్‌యాన్ మిషన్లలో భాగంగానూ ఉంటుంది.[3][4] ఇది 2026లో గగన్‌యాన్ G-2 మిషన్‌లో అంతరిక్షంలోకి తన మొదటి స్పేస్ క్రాఫ్ట్ ని తీసుకెళ్లాలని ప్రణాళిక చేయబడింది, కాని తరువాత గగన్‌యాన్ జి-1 మిషన్‌లో కూడా ప్రయాణించాలని నిర్ణయించారు, ఇది తిరిగి Q4.2025 సమయంలో ప్రణాళిక చేయబడింది.[5]
లక్ష్యాలు, సామర్థ్యాలు
[మార్చు]2020 జనవరి 22 న మిషన్‌లోని ఇతర వ్యోమగాములతో పాటుగా స్త్రీ రూపంలో ఉండే వ్యోమమిత్ర అనే రోబోట్ కూడా వెళ్తుందని ఇస్రో ప్రకటించింది. మానవ అంతరిక్షయానం చేసిన ఇతర దేశాల మాదిరిగా కాకుండా ప్రయోగాత్మక మిషన్లలో జంతువులను పంపకూడదని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. దానికి బదులు, అంతరిక్షంలో ఎక్కువ కాలం పాటు బరువులేనితనం, రేడియేషన్ వంటివి మానవ శరీరంపై ఎలాంటి ప్రభావాలను చూపిస్తాయో బాగా అర్థం చేసుకోవడానికి ఈ మానవరూప రోబోట్లను పంపిస్తుంది.[6]
మైక్రోగ్రావిటీ ప్రయోగాలు, మాడ్యూల్ పారామితులను పర్యవేక్షించడం, వ్యోమగాములకు నడుము నుండి పైకి మానవుడి లాగా విధులను అనుకరించడం ద్వారా మానవ సహిత యాత్రలలో సహాయపడేందుకు వ్యోమమిత్ర, సిబ్బంది లేని గగన్‌యాన్ మిషన్లలో పంపిస్తారని భావిస్తున్నారు. దానికి కాళ్లు లేవు. ఇది హిందీ, ఇంగ్లీషులలో మాట్లాడుతుంది. వివిధ రకాలైన నిర్వహించేలా దీన్ని తయారు చేస్తారు.[7][8][9][10]
క్యాబిన్‌లోని పర్యావరణ మార్పులు వ్యోమగాములకు అసౌకర్యంగా ఉంటే, గాలి స్థితి మార్చినట్లయితే ఇది గుర్తించి హెచ్చరికలను ఇవ్వగలదు. ఇది స్వయంప్రతిపత్తితో పనులను పూర్తి చేయగలదు, కొత్త ఆదేశాలను పాటించనూ గలదు.[11]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Dwarakanath, Nagarjun (22 January 2020). "Gaganyaan mission: Meet Vyommitra, the talking human robot that Isro will send to space". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-01-22.
- ↑ "IAA-ISRO-ASI Symposium on Human Space Flight and Exploration was organised at Bangalore". www.isro.gov.in. 2020-01-24. Archived from the original on 4 August 2022. Retrieved 2020-01-25.
- ↑ "Meet Vyom Mitra, first Indian 'woman' to ride to space". The Hindu (in Indian English). 2020-01-22. ISSN 0971-751X. Retrieved 2020-01-23.
- ↑ "ISRO to send humanoid Vyommitra in unmanned Gaganyaan spacecraft ahead of human spaceflight". The Economic Times. 24 Jan 2020. Retrieved 29 Aug 2021.
- ↑ Dinner, Josh (2025-05-08). "India delays 1st Gaganyaan astronaut launch to 2027". Space.com (in ఇంగ్లీష్). Retrieved 2025-06-14.
- ↑ "Why is India sending robots into space?" (in ఇంగ్లీష్). 25 July 2019. Retrieved 25 January 2020.
- ↑ Kumar, Chethan (22 January 2020). "Gaganyaan mission: First glimpse of 'Vyommitra', the humanoid for Gaganyaan; it's a 'She'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 22 January 2020.
- ↑ "ISRO's manned mission to Moon will happen, but not right now: K Sivan". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 22 January 2020. Retrieved 22 January 2020.
- ↑ "'व्योममित्रा'ची पहिली झलक! भारताकडून 'ती' पहिल्यांदा जाणार अवकाशात". Loksatta (in మరాఠీ). 22 January 2020. Retrieved 22 January 2020.
- ↑ "ISRO's prototype humanoid for Gaganyaan mission is Vyom Mitra which will go to space before astronauts". Times Now News (in ఇంగ్లీష్). 22 January 2020. Retrieved 22 January 2020.[permanent dead link]
- ↑ Dwarakanath, Nagarjun (22 January 2020). "Gaganyaan mission: Meet Vyommitra, the talking human robot that Isro will send to space". India Today. Retrieved 22 January 2020.