Jump to content

శంకర్‌లాల్ బ్యాంకర్

వికీపీడియా నుండి
శంకర్‌లాల్ బ్యాంకర్
జననం1889
మరణం1985 (aged 95–96)
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు

శంకర్‌లాల్ ఘెలాభాయ్ బ్యాంకర్ (1889 - 1985)[1] భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు.[2] మహాత్మా గాంధీ సహచరులలో ఒకడిగా ఉన్నాడు.[3]

జననం

[మార్చు]

శంకర్‌లాల్ 1889లో అహ్మదాబాదులో జన్మించాడు.

ఉద్యమం

[మార్చు]

బ్యాంకర్, అతని స్నేహితుడు ఇందులాల్ యాగ్నిక్ వరుసగా యంగ్ ఇండియా, నవజీవన్ ప్రచురణలను స్థాపించి మహాత్మా గాంధీ ప్రజా జీవితంలోకి వచ్చినపుడు ఈ ప్రచురణలను అందజేశారు.[1] 1922 మార్చి 10న గాంధీ, బ్యాంకర్ ఇద్దరూ గాంధీ వార్తాపత్రిక యంగ్ ఇండియా ప్రచురణకర్త, ఎడిటర్‌గా దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేయబడ్డారు.[4][5]

గాంధీ ఆధ్వర్యంలో అహ్మదాబాద్‌ పట్టణంలో జరిగిన అనేక కార్యకలాపాలకు బ్యాంకర్ ప్రధానపాత్ర పోషించాడు.[6] అహ్మదాబాద్‌లో టెక్స్‌టైల్ మిల్లు కార్మికుల సమ్మె, 1918 ఖేడా సత్యాగ్రహం, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో పాల్గొన్నాడు. ఖాదీ, చర్ఖాలను ప్రోత్సహించిన భారతీయ చర్ఖా సంఘానికి కార్యదర్శిగా కూడా ఉన్నాడు.[1]

మరణం

[మార్చు]

శంకర్‌లాల్ 1985లో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Kothari, Urvish (2018-10-02). "How an engineer and 2 high-flyers became Gandhi's men". The Print.
  2. "Shankarlal Banker". www.onlinebooks.library.upenn.edu. Retrieved 2021-09-11.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "How an engineer and 2 high-flyers became Gandhi's men". www.theprint.in. 2018-10-02. Retrieved 2021-09-11.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. Mulk Raj Anand; National Council of Educational Research and Training (India) (1987). The Historic trial of Mahatma Gandhi. National Council of Educational Research and Training. p. 24.
  5. "TRIAL OF MAHATMA GANDHI - 1922". Bombay High Court.
  6. "When Gandhi stood trial for sedition". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-10-01. Retrieved 2021-09-11.