శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
| శంకర్ దాదా MBBS (2004 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | జయంత్ సి పరాన్జీ |
|---|---|
| నిర్మాణం | అక్కినేని రవిశంకర్ ప్రసాద్ |
| రచన | రాజకుమార్ హిరానీ (హిందీ మూలకథ) పరుచూరి సోదరులు (మాటలు) |
| తారాగణం | చిరంజీవి, శ్రీకాంత్, సోనాలి బింద్రే |
| సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
| ఛాయాగ్రహణం | కె. దత్తు |
| కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
| పంపిణీ | జెమిని ఫిల్మ్ సర్క్యూట్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
శంకర్ దాదా ఎం. బి. బి. ఎస్ జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో 2004లో విడుదలైన సినిమా. ఇందులో చిరంజీవి, సోనాలీ బెంద్రే ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం హిందీలో సంజయ్ దత్ నటించిన మున్నాభాయి MBBS కి పునర్నిర్మాణం. తెలుగులో కూడా ఈ చిత్రం విజయం సాధించినది.ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించారు.
కథ
[మార్చు]హైదరాబాద్‌లో శంకర్ ప్రసాద్ (చిరంజీవి), 'శంకర్ దాదా'గా పిలవబడే ఒక స్థానిక గూండా. తన తండ్రి సత్య ప్రసాద్ (గిరీష్ కర్నాడ్) కోరిక మేరకు తను డాక్టర్ అయ్యానని అబద్ధం చెబుతాడు. తన తండ్రి వచ్చినప్పుడు నమ్మించడం కోసం 'శ్రీ సత్య ప్రసాద్ ఛారిటబుల్ హాస్పిటల్' పేరుతో ఒక నకిలీ ఆసుపత్రిని సెటప్ చేసి, అక్కడ తను వైద్యుడిగా నటిస్తుంటాడు.
ఒకరోజు, శంకర్ తండ్రి తన పాత స్నేహితుడైన డాక్టర్ రామలింగేశ్వరరావు (పరేష్ రావల్)ని కలుస్తాడు. శంకర్‌ను రామలింగేశ్వరరావు కుమార్తె సునీత అలియాస్ 'చిట్టి' (సోనాలి బింద్రే)కి ఇచ్చి వివాహం చేయాలని వారు నిర్ణయించుకుంటారు. ఆ సమయంలో శంకర్ అసలు నిజం బయటపడుతుంది. రామలింగేశ్వరరావు శంకర్ తల్లిదండ్రులను అందరి ముందు అవమానిస్తాడు. తన తండ్రి పడిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని, నిజంగానే డాక్టర్ కావాలని శంకర్ నిర్ణయించుకుంటాడు.
తన అనుచరుడైన ATM (శ్రీకాంత్) సహాయంతో, శంకర్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (HIMS)లో అక్రమ పద్ధతిలో ప్రవేశం పొందుతాడు. అక్కడ రామలింగేశ్వరరావే డీన్ (Dean)గా ఉంటాడు. వైద్య శాస్త్రం గురించి పెద్దగా తెలియకపోయినా, తన తల్లి నేర్పిన "జంతర్ మంతర్" (ప్రేమతో ఇచ్చే కౌగిలింత) ద్వారా రోగులలో నమ్మకాన్ని, ఆనందాన్ని నింపుతాడు. వైద్యం అంటే కేవలం మందులు ఇవ్వడమే కాకుండా, రోగిని మనిషిగా గుర్తించి ప్రేమను పంచడమని శంకర్ నిరూపిస్తాడు.
చాలా కాలంగా అపస్మారక స్థితిలో ఉన్న శ్రీరామ్ అనే బాలుడిని శంకర్ తన మాటలతో, పలకరింపులతో సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. ఆసుపత్రిలోని సిబ్బందిని, రోగులను తన మంచితనంతో ఆకట్టుకుంటాడు. ఇది నచ్చని రామలింగేశ్వరరావు శంకర్‌ను కాలేజీ నుండి పంపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. చివరకు ఒక మౌఖిక పరీక్షలో (Oral Exam) శంకర్ విఫలమయ్యేలా చేసి, అతన్ని బయటకు పంపుతాడు.
కానీ శంకర్ వెళ్ళిపోయే సమయంలో, శ్రీరామ్ కోలుకుని "శంకర్" అని పిలుస్తాడు. సునీత తన తండ్రిని విమర్శిస్తూ, శంకర్ వల్ల ఆసుపత్రిలో కలిగిన సానుకూల మార్పులను వివరిస్తుంది. అలాగే ఆసుపత్రిలో కొందరు వైద్యులు చేస్తున్న అవినీతిని శంకర్ బయటపెడతాడు. చివరకు రామలింగేశ్వరరావు తన తప్పు తెలుసుకుని శంకర్‌ను క్షమాపణ కోరుతాడు. శంకర్, సునీత పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
తారాగణం
[మార్చు]- చిరంజీవి
- సోనాలి బెంద్రే
- శ్రీకాంత్
- పరేష్ రావల్
- గిరీష్ కర్నాడ్
- ఎం. ఎస్. నారాయణ
- వేణుమాధవ్
- ఆలీ
- ఆహుతి ప్రసాద్
- రోహిత్
- సూర్య
సంభాషణలు
[మార్చు]- రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం
- ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్
- వల్చర్ ఈటింగ్ హండ్రెడ్ బఫ్ఫల్లోస్, వన్ సైక్లోన్ ఫినిష్
విశేషాలు
[మార్చు]- ఈ చిత్రంలో చిరంజీవి తెలుగుసామెతలని ఆంగ్లంలోకి అనువదించటం ప్రత్యేక ఆకర్షణ (ఎంకీస్ మ్యారేజ్ సుబ్బిస్ డెత్ యానివర్సరీ, హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్, ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకొడైల్ ఫెస్టివల్, వల్చర్ ఈటింగ్ హండ్రెడ్ బఫ్ఫల్లోస్, వన్ సైక్లోన్ ఫినిష్)
సంగీతం
[మార్చు]| శంకర్ దాదా M.B.B.S. | ||||
|---|---|---|---|---|
| Soundtrack album by | ||||
| Released | 4 సెప్టెంబర్ 2004 | |||
| Recorded | 2004 | |||
| Genre | చలనచిత్ర సౌండ్‌ట్రాక్ | |||
| Length | 33:22 | |||
| Language | తెలుగు | |||
| Label | సుప్రీమ్ మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ | |||
| Producer | దేవి శ్రీ ప్రసాద్ | |||
| దేవి శ్రీ ప్రసాద్ chronology | ||||
| ||||
ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకను తొలుత చారిత్రక ప్రదేశమైన తారామతి బారాదరిలో నిర్వహించాలని నిర్మాతలు భావించారు. అక్కడి భౌగోళిక ప్రత్యేకత వల్ల అక్కడ చేసే శబ్దం గోల్కొండ కోట అంతటా వినబడుతుంది, అందుకే ప్రత్యేక అనుమతితో అక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా, చివరి నిమిషంలో వేదికను మాదాపూర్ లోని శిల్పకళావేదికకు మార్చారు.
ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులైన కె. రాఘవేంద్రరావు, డి. రామానాయుడు, సి. అశ్వనీదత్, కేఎల్ నారాయణ, కేఎస్ రామారావు, అల్లు అరవింద్, విజయ బాపినీడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సి. కళ్యాణ్, వి. వి. వినాయక్, శ్రీను వైట్ల, అల్లు అర్జున్, అలీ తదితరులు హాజరయ్యారు. రఘు కుంచె, భార్గవి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.[1]
సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత, "సందె పొద్దు" (గానం: శంకర్ మహదేవన్, కల్పన; రచన: సాహితి), "తెల్లారిందో మావా" (గానం & రచన: దేవి శ్రీ ప్రసాద్) అనే రెండు పాటలను అదనంగా చేర్చి ఆడియోను తిరిగి విడుదల చేశారు. ఈ రెండు వెర్షన్లు కూడా విశేష ఆదరణ పొందాయి. ఇందులోని “పట్టు పట్టు” పాటను తమిళ చిత్రం Thirupaachi (2005) లో “కట్టు కట్టు”గా రీమేక్ చేశారు.[2]
| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "శంకర్ దాదా M.B.B.S." | చంద్రబోస్ | మనో, చిరంజీవి (డైలాగ్స్), కోరస్ | 5:46 |
| 2. | "నా పేరే కాంచనమాల" | వేటూరి | మాలతి, కార్తీక్, కోరస్ | 5:22 |
| 3. | "ఛైల ఛైలా ఛైలా ఛైలా, నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా" | దేవి శ్రీ ప్రసాద్ | చిరంజీవి (డైలాగ్స్), కెకె | 6:07 |
| 4. | "ఏ జిల్లా" | చంద్రబోస్ | అద్నాన్ సమీ, కల్పన | 5:03 |
| 5. | "పట్టు పట్టు చేయే పట్టు" | సాహితి | మాణిక్య వినాయగం, సుమంగళి | 5:11 |
| 6. | "తెల్లారిందోయ్ మామా మామ" | సాహితి | శంకర్ మహదేవన్, కల్పన | 5:34 |
| మొత్తం నిడివి: | 33:22 | |||
ఇవి కూడా చూడండి
[మార్చు]- ↑ "Telugu Cinema function - Audio Launch - Shankar Dada MBBS - Chiranjeevi - Devi Sri Prasad". idlebrain.com.
- ↑ "Borrowing tunes!". Sify. 24 December 2004. Archived from the original on 26 March 2005. Retrieved 20 April 2025.
- 2004 తెలుగు సినిమాలు
- Album articles lacking alt text for covers
- చిరంజీవి నటించిన సినిమాలు
- తెలుగు హాస్య సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- హాస్య భరితమైన సినిమాలు
- శ్రీకాంత్ నటించిన సినిమాలు
- దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- వేణుమాధవ్ నటించిన సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- ఆహుతి ప్రసాద్ నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- పరుచూరి బ్రదర్స్ సినిమాలు