శతావధానసారము ఒక విశిష్టమైన సంకలనము. ఇందులో తిరుపతి వేంకట కవులు వివిధ ప్రాంతాలలో విజయవంతంగా నిర్వహించిన అవధానముల నుండి ఎంచుకోబడిన పద్యగద్యముల సంకలనం. ఇది పూర్వార్థము మరియు ఉత్తరార్థముగా చేయబడినది.
ఇది మొదటిసారిగా 1908 లో ముద్రించబడినది.[1] తర్వాతకాలంలో మరికొన్ని అవధానాల వివరాలను అనుబంధములో చేర్చారు. ఇది 1956లో ప్రచురించబడింది.[2] ఈ మూడవకూర్పు చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి పర్యవేక్షణలో ముద్రించబడినది.