Jump to content

శశి థరూర్

వికీపీడియా నుండి
(శశి థరూర్‌ నుండి దారిమార్పు చెందింది)
శశి థరూర్
శశి థరూర్


పార్లమెంట్ సభ్యుడు
పదవీ కాలం
31 మే 2009 – ప్రస్తుతం
ముందు పణ్ణయన్ రవీంద్రన్
నియోజకవర్గం తిరువనంతపురం

మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
28 అక్టోబర్ 2012 – 26 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు దగ్గుబాటి పురంధేశ్వరి
తరువాత ఉపేంద్ర కుశ్వాహా

విదేశాంగ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
28 మే 2009 – 18 ఏప్రిల్ 2010
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు ఆనంద్ శర్మ
తరువాత ఈ. అహమ్మద్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-03-09) 1956 మార్చి 9 (వయసు 68)
లండన్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి తిలోత్తమ ముఖేర్జీ - 1981లో విడాకులు
క్రిష్ట గిల్స్ (2007 - 2010లో విడాకులు)
సునంద పుష్కర్(2010 - 2014లో మరణించింది)
సంతానం ఇద్దరు
పూర్వ విద్యార్థి సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ
వృత్తి రాజకీయ నాయకుడు, రచయిత

శశి థరూర్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం తిరువనంతపురం ఎంపీగా ఉన్నాడు. భార‌త్, అమెరికాలో శ‌శి థ‌రూర్ విద్యాభ్యాసం జ‌రిగింది. 1978లో ఫ్లెచ‌ర్ స్కూలు ఆఫ్ లా అండ్ డిప్లోమ‌సీ నుంచి పీహెచ్‌డీని పూర్తి చేశాడు. ఐక్యరాజ్య సమితిలో మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోఫీ అన్న‌న్ నేతృత్వంలో శ‌ర‌ణార్థుల కార్య‌క‌ర్త‌గా, శాంతిస్థాప‌కుడిగా, ప‌రిపాల‌న‌వేత్త‌గా ప‌ని చేశాడు. న్యూయార్క్ టైమ్స్‌, ద వాషింగ్ట‌న్ పోస్టు, గార్డియ‌న్ వంటి జాతీయ‌, అంత‌ర్జాతీయ ప‌బ్లికేష‌న్ సంస్థ‌ల‌కు శ‌శి థ‌రూర్ కాల‌మిస్టు, రచ‌యిత‌గా.. న్యూస్‌సీక్ ఇంట‌ర్నేష‌న‌ల్‌కు అకేష‌న‌ల్ కాల‌మిస్టు, భాగ‌స్వామ్య సంపాద‌కుడిగా ఉన్నాడు.[1]

జననం

[మార్చు]

శశి థరూర్‌ 1956, మార్చి 9న యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్, లండన్లో చంద్రన్ థరూర్, సులేఖ మీనన్ దంపతులకు జన్మించాడు.[2][3] ఆయనకు ఇద్దరు చెల్లులు శోభా & స్మిత ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

శశి థరూర్ 2009లో తిరువ‌నంతపురం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి క‌మ్యూనిస్టు పార్టీకి చెందిన పీ.రామ‌చంద్ర‌న్ నాయ‌ర్‌ పై గెలిచి ఎంపీగా 15వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యాడు. ఆయన యూపీఏ హ‌యాంలోని మన్మోహన్ సింగ్ పభుత్వంలో విదేశాంగ శాఖ, మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ స‌హాయమంత్రిగా పనిచేశాడు. 2014లో తిరువ‌నంత‌పురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండవసారి లోక్‌స‌భ‌కు పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఓ. రాజ‌గోపాల్‌పై 15,700 ఓట్ల తేడాతో గెలిచాడు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తిరువనంతపురం లోక్‌స‌భ స్థానం నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కుమ్మ‌నం రాజశేఖరన్ ను ఓడించి మూడోసారి ఎంపీగా గెలిచాడు.[4] ఆయన 2023 ఆగస్ట్ 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "About Shashi". Shashi Tharoor. 31 March 2007. Archived from the original on 1 July 2013. Retrieved 10 July 2013.
  2. India Today (9 March 2016). "Shashi Tharoor turns 60: Some lesser-known facts you shouldn't overlook". Archived from the original on 28 April 2021. Retrieved 28 April 2021.
  3. https://youtube.com/QbkZItEJv6c[permanent dead link]
  4. The Indian Express (17 March 2017). "Shashi Tharoor responds to online petition wanting him as UPA PM contender in 2019". Archived from the original on 28 April 2021. Retrieved 28 April 2021.
  5. Namasthe Telangana (20 August 2023). "కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని పునరుద్ధరించిన ఖర్గే.. సచిన్‌ పైలట్‌, శశిథరూర్‌, రఘువీరాలకు చోటు". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
  6. The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=శశి_థరూర్&oldid=4286351" నుండి వెలికితీశారు