శాకిని డాకిని
శాకిని డాకిని | |
---|---|
దర్శకత్వం | సుధీర్ వర్మ |
నిర్మాత | దగ్గుబాటి సురేష్ బాబు సునీత తాటి థామస్ కిమ్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | రిచర్డ్ ప్రసాద్ |
కూర్పు | విప్లవ్ నిషాదమ్ |
సంగీతం | మైకీ మెక్ క్లియరీ నరేష్ కుమారన్ |
నిర్మాణ సంస్థలు | సురేష్ ప్రొడక్షన్స్ గురు ఫిలింస్ క్రాస్ పిక్చర్స్ |
విడుదల తేదీs | 2022 సెప్టెంబర్ 16 (థియేటర్) 2022 అక్టోబర్ 23 (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ)[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శాకిని డాకిని 2022లో రూపొందిన తెలుగు సినిమా. కొరియన్ సినిమా 'మిడ్ నైట్ రన్నర్స్' ను తెలుగులో 'శాకిని - డాకిని'గా రీమేక్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్‌లపై దగ్గుబాటి సురేష్ బాబు, సునీత తాటి, థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 16న విడుదలైంది.[2]
జనవరి 2020లో, నిర్మాత సురేష్ బాబు సియోల్ ఆధారిత క్రాస్ పిక్చర్స్ సహకారంతో దక్షిణ కొరియా చిత్రం మిడ్‌నైట్ రన్నర్స్ రీమేక్ హక్కులను పొందారు. దర్శకుడు సుధీర్ వర్మ అదే నెలలో రీమేక్‌కు దర్శకత్వం వహించడానికి సంతకం చేశారు. ఆగస్ట్ 2020లో నటి రెజీనా కసాండ్రా, నివేత థామస్ ప్రధాన పాత్రలు పోషించేందుకు సంతకం చేశారు. ఈ చిత్రం పూర్తిగా హైదరాబాద్‌లో చిత్రీకరించబడింది.
కథ
[మార్చు]రెజీనా, నివేదా థామస్ ఇద్దరు పోలీస్ అకాడమీలో ట్రైనీ పోలీస్ ఆఫీసర్లు. అనుకోని పరిస్థితుల్లో అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపే రౌడీ మూకల బారిన పడతారు. మానవ అక్రమ రవాణా నుంచి ఆ ఇద్దరు అమ్మాయిలు తమను తాము కాపాడుకుంటూనే మిగతా వారిని హ్యూమెన్ ట్రాఫికింగ్ ముఠా నుండి ఎలా రక్షించారు అనేదే సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "'శాకిని డాకిని' ఓటీటీలోకి వచ్చేస్తున్నారు.. ఎప్పుడంటే?". 29 September 2022. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
- ↑ V6 Velugu (16 August 2022). "సెప్టెంబర్ 16న 'శాకిని డాకిని'". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Prabha News (16 August 2022). "శాకిని డాకిని థ్రిల్ చేసేందుకు రెడీ త్వరలోనే థియేటర్లలో రిలీజ్". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
- ↑ 10TV Telugu (3 November 2021). "శాకిని.. డాకిని.. కొరియన్ రీమేక్ లో రెజీనా.. నివేదా." Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (3 November 2021). "శాకిని- ఢాకినిలుగా నివేదా రెజీనా… ఇంట్రెస్టింగ్‌గా మూవీ టైటిల్". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.