శిఖా పాండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్క్వాడ్రన్ లీడర్ (విశ్రాంత)
శిఖా పాండే
2017లో శిఖా పాండే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
శిఖా సుబాస్ పాండే
పుట్టిన తేదీ (1989-05-12) 1989 మే 12 (వయసు 35)
రామగుండం , ఆంధ్ర ప్రదేశ్ , భారత దేశము. (ప్రస్తుతం తెలంగాణ, భారత దేశము)
మారుపేరుశిఖిపీడియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 78)2014 ఆగస్టు 13 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2021 జూన్ 16 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 112)2014 ఆగస్టు 21 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2021 3 జులై - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.12
తొలి T20I (క్యాప్ 48)2014 9 మార్చ్ - బంగ్లాదేశ్ తో
చివరి T20I2023 ఫిబ్రవరి 23 - ఆస్ట్రేలియా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.12
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007/08–ప్రస్తుతంగోవా మహిళా క్రికెట్ జట్టు (Goa Women)
2019–2020IPL వేగం
2023–ప్రస్తుతంఢిల్లీ క్యాపిటల్స్ (WPL)
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WT20I
మ్యాచ్‌లు 3 55 56
చేసిన పరుగులు 55 512 207
బ్యాటింగు సగటు 18.33 20.48 12.93
100s/50s 0/0 0/2 0/0
అత్యధిక స్కోరు 28 నాట్ అవుట్ 59 26 నాట్ అవుట్
వేసిన బంతులు 249 2,472 938
వికెట్లు 4 75 40
బౌలింగు సగటు 35.25 21.92 25.32
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/33 4/18 3/14
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 11/- 18/-
మూలం: Cricinfo, 23 ఫిబ్రవరి 2023

స్క్వాడ్రన్ లీడర్ (రిటైర్డ్) శిఖా సుబాస్ పాండే ఒక భారతీయ క్రికెటర్[1], భారత వైమానిక దళంలో మాజీ అధికారి.[2][3][4]. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (ప్రస్తుతం తెలంగాణా) రామగుండంలో 1989 మే 12న జన్మించింది. ఆమె ఆల్ రౌండర్, జాతీయ క్రికెట్ జట్టుకు కుడిచేతి వాటం మీడియం పేసర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్.[2][3] శిఖా పాండే మారుపేరు "షికిపీడియా ". ఇది క్రికెట్ గీక్ గా ఆమె కున్న హోదాను తెలియ చేస్తుంది.[5]

పాండే తన మొదటి అంతర్జాతీయ ట్వంటీ20 (టి20) మ్యాచ్ ని 2014 మార్చి 9న బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్తో ఆడింది .[6][7] అదే సంవత్సరం ఆగస్టులో ఆమె తన ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ (ODI), టెస్ట్ క్రికెట్ వరుసగా ఇంగ్లాండ్ తో 'వార్మ్ స్లీ స్కార్బోరో' లో ప్రారంభం చేసింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

శిఖా పాండే ఆమె పాఠశాల విద్యను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విధానంలో పూర్తి చేసింది. 15 సంవత్సరాల వయస్సులో, రాష్ట్ర బోర్డు నుంచి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి క్రీడాకారిణి ఆమె. ఆ కొద్ది నెలల్లోనే, ముంబై మాజీ క్రీడాకారిణి సురేఖా భండారే, ఎంపిక చేసే అధికారిణి హోదాలో ప్రవేశించి ఆమె ఆట చూసి, భవిష్యత్ భారతక్రీడాకారిణికి గల అన్ని అర్హతలు పాండేకు ఉన్నాయని గుర్తించింది. ఆమెలోని ప్రతిభను కూడా గుర్తించింది. పదో తరగతి బోర్డు (సెకండరీ స్కూల్) పరీక్షల్లో ఆమె రాష్ట్రవ్యాప్తంగా మూడవ స్థానం (ర్యాంక్)గెలుచుకుంది. ఆ సమయంలోనే ఆమె చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. తదుపరి మూడు సంవత్సరాలు క్రికెట్ లో వెనుకబడి ఉంది. ఆమె ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో అండర్ గ్రాడ్యుయేట్ రెండవ సంవత్సరానికి ముందే ఆమె క్రికెట్ ను కొనసాగించడం ప్రారంభించింది.

ఆమె విద్యకి ఎల్లప్పుడూ ప్రాముఖ్యత ఇచ్చేది. అందుకని క్రికెట్ ను, కళాశాలను సమంగా పరిగణించవలసి వచ్చింది. ఆమె ఉదయం వ్యాయమశాల(జిమ్) లోను, తరగతులు, చదువుకు సంబంధమైన పనులతో గడుపుతుంది. ఆమె మధ్యాహ్నం 'మాపుసా' కు 12 కిలోమీటర్ల ప్రయాణం చేసి మాజీ గోవా క్రికెటర్, గోవా క్రీడా అధికార సంస్థ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గోవా) కు చెందిన శిక్షకుడు (కోచ్) నితిన్ వెర్నేకర్ ఆధ్వర్యంలో శిక్షణ పొండేది. అక్కడ 16, 19 సంవత్సరాల లోపు క్రీడాకారుల శిక్షణ (U - 16, U - 19) బాలురకే ఉండేది. శిఖా అక్కడ ఏకైక అమ్మాయి. ఈ దశలో పేస్ బౌలింగ్ ను మెరుగుపరుచుకోవడం ఒక క్రికెట్ క్రీడాకారిణిగా ఈ ఎదుగుదలకు ఆమెకు కీలకం.

అయితే, ఆమె ఆటపైనున్న తన దృష్టి, చదువును ప్రభావితం చేయనివ్వలేదు. ఆమె క్రికెట్ లో పని తీరు, చదువు/తరగతులకు విలోమానుపాతంలో లేవని, దానికి తనకు సహాయం చేసినందుకు ఆమె తన అనువర్తిత గణిత (అప్లైడ్ మ్యాథమెటిక్స్) అధ్యాపకురాలు ఉజ్వల ఫడేకు ప్రత్యేకంగా ఘనత ఇచ్చింది.

2017 ఆగస్టు 1న న్యూఢిల్లీలో లెఫ్టినెంట్ శిఖా పాండే. ఎయిర్ చీఫ్ మార్షల్ బి. ఎస్. ధనోవా అప్పటి విమాన సిబ్బందిని సత్కరించారు.

2010లో గోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇంజనీరింగ్ పట్టా పూర్తి చేసిన తరువాత మూడు బహుళజాతి కంపెనీలు ఆమెకు అవకాశాలను అందించాయి. కానీ ఆమె ఈ ఉద్యోగ అవకాశాలన్నింటిని తిరస్కరించింది. ఒక సంవత్సరం విరామం తీసుకొని తన క్రికెట్ పై పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది.[8] అయితే 2011 జూలైలో ఆమె భారత వైమానిక దళంలో చేరి, 2012 జూన్ లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా నియమింపబడింది.[9][10] 2020 ఐసిసి మహిళా టి20 ప్రపంచ కప్ సమయంలో ఆమె స్క్వాడ్రన్ లీడర్ హోదాతో ఉంది.[4]

క్రికెట్ జీవితం

[మార్చు]

15 సంవత్సరాల వయస్సులో 2004లో గోవా తరఫున ఆడేందుకు పాండే ఎంపికయ్యింది. తరువాత 2007 - 08 దేశీయ సీజన్లో 17 సంవత్సరాల వయస్సులో ఆమె గోవా స్టేట్ మహిళల సీనియర్ కోసం ఆడటానికి ఎంపికైంది.[11] రెండు రోజుల పాటు జరిగిన అంతర్ రాష్ట్ర టోర్నమెంట్ - రాణి ఝాన్సీ ట్రోఫీలో ఆమె నాలుగు వికెట్లు తీసింది. ఇది ఆమెకు గోవా సీనియర్ మహిళల క్రికెట్ లో ఆరంభం కూడా. అప్పటికే భారత అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి అయిన త్రిషి కామినిను బౌలింగ్ చేసి క్యాచ్ పట్టి ఆమె మొదటి వికెట్ తీసింది. అదే సీజన్లో ఆమె జోనల్ జట్టులోకి ఎంపిక కావడానికి అదే కారణం, ఇంకా ఆమె గోవా అండర్ - 19 జట్టుకు మూడు అర్ధ శతకాలు సాధించింది.[8]

ఆమె ఇంజనీరింగ్ కోర్సు నుండి సెలవు తీసుకున్న సంవత్సరంలో పాండే 2010, 2011 జనవరిలో వరుసగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లతో బోర్డు ప్రెసిడెంట్స్ 11 తరపున ఆడారు. 2010 ఆటలో ఆమె మొదటి అంతర్జాతీయ షార్లెట్ ఎడ్వర్డ్స్ వికెట్ కూడా తీసుకున్నారు. ఆమె గోవా తరఫున ఆడటం కొనసాగించింది. 2013 - 14 సీజన్ తరువాత అంతర రాష్ట్ర టి20 టోర్నమెంట్ (ప్లేట్ గ్రూప్) లో భారత జట్టు బంగ్లాదేశ్ తో 3 స్నేహపూర్వక మ్యాచ్ లు, 2014 ఐసిసి మహిళా ప్రపంచ ట్వంటీ 20 మ్యాచ్ ల కొరకు బంగ్లాదేశ్ పర్యటనకు ఆమె ఎంపికైంది.[12]

Devine batting for New Zealand during the 2020 ICC Women's T20 World Cup
2020 ఐసిసి మహిళల టి 20 ప్రపంచ కప్ సందర్భంగా బౌలింగ్ చేస్తున్న శిఖా పాండే.

దిలీప్ సర్దేశాయ్ తరువాత, గోవా నుండి భారత జాతీయ జట్టుకు ఆడిన మొదటి క్రీడాకారిణి శిఖా పాండే. ఆమె భారతదేశం తరఫున గోవా క్రికెట్ సంఘం నుంచి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడిన మొదటి అనుబంధ క్రికెటర్ కూడా .[7][9][13] టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆమె ఇంగ్లాండ్తో ఒక టెస్ట్ మ్యాచ్, 2 వన్డే మ్యాచ్ లు ఆడింది.[14][15] 2014 నవంబరు 26న దక్షిణాఫ్రికాపై భారత్ విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది. 59 పరుగులతో 3 వికెట్లు తీసింది.[16]

శిఖా పాండే భారత జట్టు తరపున 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఆటలో పాల్గొంది. అక్కడ ఇంగ్లాండ్ తో ఫైనల్ కు చేరుకున్న భారత జట్టు తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది.[17][18][19] 2020 జనవరిలో ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్ కోసం ఆడడానికి భారత జట్టులో ఆమె ఎంపికైంది.[20] 2021 మేలో ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన ఏకైక మ్యాచ్ ఆడడానికి భారత టెస్ట్ జట్టులో ఆమె ఎంపికైంది.[21]

బాల్ ఆఫ్ ది సెంచురీ

[మార్చు]

2021 లో భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో, 2021 అక్టోబరు 9 న జరిగిన రెండవ టి20 లో శిఖా పాండే అలిస్సా హీలీకి వేసిన బంతిని బాల్ ఆఫ్ ది డే అని, బాల్ ఆఫ్ ది డెకేడ్ అనీ బాల్ ఆఫ్ ది సెంచురీ అనీ వర్ణించారు. శిఖా వేసిన బంతి ఆఫ్ స్టంపు నుండి 2 అడుగులు బైట నుండి లోపలికి స్వింగు అవుతూ, నేలకు తాకి లేచాక మరింతగా టర్నై, బ్యాటునూ బ్యాటరునూ తప్పించుకుని వికెట్లకు తగిలి రెండు బెయిళ్ళనూ లేపేసింది. దీన్ని బాల్ ఆఫ్ ది సెంచురీగా అభివర్ణించారు.[22][23][24]

సూచనలు

[మార్చు]
 1. "Shikha Pandey". ESPN Cricinfo. Retrieved 5 July 2017.
 2. 2.0 2.1 Junaid, Abdul (డిసెంబరు 2016). "Fl Lt Shikha Pandey: The Unsung Officer of Indian Women Cricket Team". SSBCrack. Retrieved 20 July 2020.
 3. 3.0 3.1 Gaur, Akshat (26 February 2020). "From being an Air Force officer to Indian's frontline బౌలరు, Shikha Pandey reveals her journey". The Cricket Times. Retrieved 20 July 2020.[permanent dead link]
 4. 4.0 4.1 Staff writer (14 March 2020). "IAF felicitates Shikha Pandey for stellar performance in Women's T20 World Cup". The Times of India. ANI. Retrieved 13 June 2021.
 5. Upendran, Ananya (31 October 2020). "With more in her armoury, Shikha Pandey aims to build on the success of 2019-20". Women’s CricZone. Retrieved 4 June 2021.
 6. "India recall Latika Kumari, Sravanthi Naidu for Women's WT20". ESPN Cricinfo. 21 February 2014. Retrieved 27 November 2014.
 7. 7.0 7.1 "गोव्याची शिखा पांडे भारतीय क्रिकेट संघात" (in Marathi). Tarun Bharat. 21 February 2014. Retrieved 27 November 2014.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
 8. 8.0 8.1 "Hard-working Shikha Pandey lives her dream". ESPNcricinfo (in ఇంగ్లీష్). 20 August 2017. Retrieved 15 December 2018.
 9. 9.0 9.1 "Shikha, and engineering cricket dreams". International Cricket Council. Archived from the original on 5 డిసెంబర్ 2014. Retrieved 27 November 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 10. "Shikha Pandey LT interview October 2017 Lucknow Show". LT Media. Retrieved 21 December 2017.
 11. "Panday Selected For Goa State". ICC Cricket. 16 March 2010. Archived from the original on 8 ఆగస్టు 2020. Retrieved 4 April 2015.
 12. "Goa's Shikha Pandey makes India cut". The Times of India. The Times Group. 22 February 2014. Retrieved 27 November 2014.
 13. "शिखा बनली गोव्याची पहिली महिला कसोटीपटू" (in Marathi). eskal.com. 14 August 2014. Archived from the original on 17 డిసెంబర్ 2014. Retrieved 12 December 2014. {{cite news}}: Check date values in: |archive-date= (help)CS1 maint: unrecognized language (link)
 14. "All round record – Shikha Pandey ODI". ESPN Cricinfo. Retrieved 28 November 2014.
 15. "All round record- Shikha Pandey Test cricket". ESPN Cricinfo. Retrieved 28 November 2014.
 16. "Shikha Pandey helps India level series against South Africa". Hindustan Times. HT Media. 27 November 2014. Archived from the original on 27 November 2014. Retrieved 28 November 2014.
 17. Live commentary: Final, ICC Women's World Cup at London, Jul 23, ESPNcricinfo, 23 July 2017.
 18. World Cup Final, BBC Sport, 23 July 2017.
 19. England v India: Women's World Cup final – live!, The Guardian, 23 July 2017.
 20. "Kaur, Mandhana, Verma part of full strength India squad for T20 World Cup". ESPN Cricinfo. Retrieved 12 January 2020.
 21. "India's Senior Women squad for the only Test match, ODI & T20I series against England announced". Board of Control for Cricket in India. Retrieved 14 May 2021.
 22. "'Ball of the century': Jaffer's tweet on Shikha Pandey's 'unreal' delivery to knock over Alyssa Healy goes viral". Hindustan Times. 8 October 2021. Retrieved 15 January 2022.
 23. "'Ball of the century' leaves cricket world in a frenzy". Yahoo Sports. 9 October 2021. Retrieved 15 January 2022.
 24. "Breaking Boundaries and Setting Records: The Rise of Alyssa Healy in Women's Cricket An Inspiration to Women Cricketers Everywhere". Retrieved 22 July 2023.

బాహ్య లింకులు

[మార్చు]