శిద్దా రాఘవరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శిద్దా రాఘవరావు
శిద్దా రాఘవరావు

శిద్దా రాఘవరావు

పదవీ కాలము
2020 (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ)
నియోజకవర్గము దర్శి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
నివాసము ఒంగోలు
మతం ఆర్యవైశ్య, హిందూ

శిద్దా రాఘవరావు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. అనేక వ్యాపారాలు చేసి పేరుతెచ్చుకొన్న తర్వాత రాజకీయాలలో చేరాడు. ఇతడు జిల్లాలో అందరినీ కలుపుకొనిపోతూ అజాతశత్రువు గా పేరు తెచ్చుకొన్నాడు. ఇతని కార్యదక్షతపై నమ్మకముంచిన చంద్రబాబు నాయుడు 2014లో ఇతడు మొదటిసారి శాసన సభకు ఎన్నిక అయినప్పటికీ ఇతడికి మంత్రి పదవి కట్టబెట్టాడు.

రాజకీయాలు[మార్చు]

శిద్దా రాఘవరావు 2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించాడు. 1999లో టీడీపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేశాడు. 2007లో అదే పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎంపికయ్యాడు. గ్రానైట్ వ్యాపారిగా స్థిరపడిన ఈయన ప్రస్తుతం ఒంగోలులో ఉంటున్నాడు. 2006లో శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా నియమితులయ్యాడు. వయస్సు 57 సంవత్సరాలు. బీకాం వరకు చదువుకున్నారు. టీటీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇతడు నెల్లూరు జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా కూడా పనిచేశాడు.ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహానికి గురయ్యాడు.[1]

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]