శివవిష్ణు దేవాలయం (లాన్‌హామ్)
శివవిష్ణు దేవాలయం | |
---|---|
మతం | |
అనుబంధం | హిందూ |
Region | వాషింగ్టన్ డిసి |
ప్రదేశం | |
ప్రదేశం | సిప్రియానో రోడ్ |
రాష్ట్రం | మేరీల్యాండ్ |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
వాస్తుశాస్త్రం. | |
గ్రౌండ్‌బ్రేకింగ్ | 1988 |
పూర్తైనది | 2002 |
శివవిష్ణు దేవాలయం (లాన్‌హామ్), అమెరికా, వాషింగ్టన్ డిసి వెలుపల ఉన్న మేరీల్యాండ్‌లోని లాన్‌హామ్‌లో ఉన్న హిందూ దేవాలయం. యునైటెడ్ స్టేట్స్‌లోని అతిపెద్ద దేవాలయాలలో ఇదీ ఒకటి.[1]
చరిత్ర, నిర్మాణం
[మార్చు]దేశ రాజధానిలో హిందూ దేవాలయం నిర్మించాలని కొద్దిమంది ప్రవాస భారతీయులు కలిసి 1976లో నిర్ణయం తీసుకున్నారు. ఆ ఆలోచనతో 1980 నాటికి శివవిష్ణు దేవాలయ ట్రస్టును ఏర్పాటుచేశారు. 1984లో ట్రస్టు ఆధ్వర్యంలో సబర్బన్ వాషింగ్టన్‌లో ఒక చిన్న ఇంటితో కూడిన స్థలాన్ని కొనుగోలు చేశారు. దేవాలయ నిర్మాణం 1988లో ప్రారంభమైంది. మొదటగా బాలాలయం, పూజా మందిరాలు స్థాపించబడ్డాయి.[2]
1990లో 1400మంది భక్తుల సమక్షంలో దేవాలయ భవనంలో మొదటి విగ్రహాల ప్రతిష్ఠాపన జరిగింది. 1991లో, దేవాలయం మొదటి కుంబాభిషేకాన్ని నిర్వహించింది. 1990 - 1995 మధ్యకాలంలో పదిహేడుమంది దేవతామూర్తులు విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మరింత భూమిని కొనుగోలు చేసి వెంకటేశ్వరుడు, అయ్యప్ప విగ్రహాలను ప్రతిష్ఠించారు. 2002లో మహాకుంభాభిషేకం సందర్భంగా రాజగోపురం, విశాలమైన వసంత మండపం ప్రారంభించబడింది. 2003 జూలైలో వెంకటేశ్వరస్వామి, అయ్యప్పలకు కొత్త గోపురాలు నిర్మించబడ్డాయి. అదనంగా, దేవాలయంలో కచేరీలు, నృత్య ప్రదర్శనలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల కోసం ఆడిటోరియం, పెద్ద భోజనశాల, 2 హోమ గదులు నిర్మించబడ్డాయి.[3]
ప్రదేశం
[మార్చు]నాసా గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ నుండి ఒక మైలు దూరంలో సిప్రియానో రోడ్‌లో ఈ దేవాలయం ఉంది. ఇక్కడికి సమీపంలో ఉత్తర అమెరికాలోని మురుగన్ దేవాలయం కూడా ఉంది.
దేవతలు
[మార్చు]శివుడు రామనాథస్వామిగా (రామేశ్వరం దేవాలయ దేవుడు), విష్ణువు అనంతపద్మనాభుడిగా ( పద్మనాభస్వామి దేవాలయం దేవుడు)గా ఇక్కడ కొలువై ఉన్నారు. పార్వతి, లక్ష్మి, సరస్వతి, దుర్గ, రాముడు, కృష్ణుడు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, ఆండాళ్, హనుమంతుడు, నవగ్రహాల ఆలయాలు కూడా ఉన్నాయి.[4][5] ప్రసిద్ధ శబరిమల దేవాలయ నమూనాలో అయ్యప్పకు 18 మెట్లతో ప్రత్యేక మందిరం కూడా ఉంది.
సాంస్కృతిక కార్యక్రమాలు
[మార్చు]ఈ దేవాలయంలో సంవత్సరాంతం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. కచేరీలు, నృత్య కళాకారుల నృత్య ప్రదర్శనలు మొదలైనవి ఉంటాయి.[6]
చిత్రాలు
[మార్చు]-
దేవాలయ సముదాయం
-
దేవాలయ సముదాయం
మూలాలు
[మార్చు]- ↑ "Sri Siva Vishnu Temple, Maryland". TemplePurohit - Your Spiritual Destination | Bhakti, Shraddha Aur Ashirwad (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-04-03.
- ↑ "Sri Siva Vishnu Temple | Timings | Address". www.holidify.com. Retrieved 2022-04-03.
- ↑ "Sri Siva Vishnu Temple". Retrieved 2022-04-03.
- ↑ Sri Siva Vishnu temple's official website
- ↑ David G. Hackett (2003). Religion and American culture: a reader. Routledge. pp. 517. ISBN 0-415-94272-1.
- ↑ "Sri Siva Vishnu Temple". ssvt.org. Archived from the original on 2017-02-15. Retrieved 2022-04-03.