Jump to content

శీతల్ ఠాకూర్

వికీపీడియా నుండి
శీతల్ ఠాకూర్
2022లో శీతల్ ఠాకూర్
జననం (1991-11-13) 1991 నవంబరు 13 (వయసు 33)
విద్యాసంస్థఢిల్లీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2016–ప్రస్తుతం
జీవిత భాగస్వామి[1]

శీతల్ ఠాకూర్ మాస్సే భారతీయ నటి, ఆమె ప్రధానంగా హిందీ సినిమాలు, స్ట్రీమింగ్ టెలివిజన్ షోలలో పనిచేస్తుంది. ఆమె 2016లో పంజాబీ చిత్రం బంబుకట్‌తో తొలిసారిగా నటించింది, దాని కోసం ఆమె ఫిల్మ్‌ఫేర్ అవార్డుల పంజాబీ ఉత్తమ సహాయ నటి నామినేషన్‌ను అందుకుంది. ఆమె 2018లో బ్రిజ్ మోహన్ అమర్ రహేతో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది.[2] చప్పడ్ ఫాడ్ కే, శుక్రాను, బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ అనే వెబ్ సిరీస్‌లలో ఆమె పాత్రకు ప్రసిద్ధి చెందింది.[3]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆమె 1991 నవంబరు 13న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జన్మించింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె కాలేజీ రోజుల్లో ఫెమినా మిస్ హిమాచల్ ప్రదేశ్‌లో పాల్గొని 'మిస్ బ్యూటిఫుల్ స్మైల్' టైటిల్‌ను గెలుచుకుంది.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె విక్రాంత్ మాస్సేతో కలసి బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్‌ చిత్రంలో నటించింది. వారు 2022 ఫిబ్రవరి 14న వివాహం చేసుకున్నారు.[5][6][7] వారికీ ఒక కుమారుడు వర్దాన్ ఉన్నాడు.[8]

కెరీర్

[మార్చు]

శీతల్ ఠాకూర్ 2016లో పంజాబీ చిత్రం బంబుకట్‌తో తన నటనా రంగ ప్రవేశం చేసింది, దాని కోసం ఆమె ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ పంజాబీ ఉత్తమ సహాయ నటి ప్రతిపాదనను అందుకుంది.[9] 2017లో, ఆమె వినయ్ పాఠక్‌తో కలిసి డార్క్ బ్రూ అనే షార్ట్ ఫిల్మ్‌ చేసింది.

నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన బ్రిజ్ మోహన్ అమర్ రహేతో ఆమె 2018లో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది.[10] ఇందులో ఆమె అర్జున్ మాథుర్తో జోడి కట్టింది. అదే సంవత్సరం ఆమె వియు బ్యాన్డ్‌తో వెబ్‌లోకి ప్రవేశించింది. ఆల్ట్ బాలాజీ బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ సీజన్ 1లో విక్రాంత్ మాస్సే సరసన చేసింది.[11]

2019లో ఆమె హిందీ చిత్రాలలో కొనసాగింది, డిస్నీ+ హాట్‌స్టార్ ఒరిజినల్ చప్పడ్ ఫాడ్ కే[12], నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ అప్‌స్టార్ట్స్[13] లలో ఆమె నటించింది. ఆ తర్వాత వూట్ ఫూ సే ఫాంటసీ ఒక ఎపిసోడ్‌లో ఆమె కనిపించింది.[14] ఆల్ట్ బాలాజీ బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ సీజన్ 2లో తన పాత్రను తిరిగి పోషించింది.[15]

ఆమె తర్వాత 2020 జీ5 చిత్రం శుక్రనులో దివ్యేందు సరసన[16], 2021 చిత్రం దిల్ఫైర్‌లో కరణ్ కుంద్రా సరసన నటించింది.[17]

మూలాలు

[మార్చు]
  1. "From haldi to emotional bidaai: Sheetal Thakur shares unseen moments from her wedding with hubby Vikrant Thakur". The Times Of India. 7 April 2022. Retrieved 6 September 2022.
  2. "Sheetal Thakur changes her name on social media after marriage to Vikrant Massey". Times Of India. Retrieved 22 February 2022.
  3. "Hotstar Specials maiden movie: Chhappad Phaad Ke to premiere on 18 October". First Post. 16 October 2019. Retrieved 16 October 2019.
  4. "दिल्ली यूनिवर्सिटी से लेकर फेमिना मिस हिमाचल प्रदेश तक, जाने शीतल ठाकुर के जीवन के रोचक तथ्य". Amar Ujala. Retrieved 15 February 2022.
  5. "Vikrant Massey confirms he got engaged to girlfriend Sheetal Thakur in private roka ceremony". Hindustan Times. 3 December 2019. Retrieved 3 December 2019.
  6. "Vikrant Massey and Sheetal Thakur registered their marriage today: Report - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-15.
  7. "Vikrant Massey ties the knot with Sheetal Thakur. See first photos of newlyweds". Hindustan Times. 18 February 2022. Retrieved 18 February 2022.
  8. TV9 Telugu (31 March 2024). "కుమారుడి పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న '12th ఫెయిల్' హీరో.. ఫొటోస్ చూశారా?". Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Service, Tribune News. "'Bambukat' highlights social stereotypes and biases based on appearances". Tribuneindia News Service.
  10. "Brij Mohan Amar Rahe – film review". Hindustan Times. 15 August 2018. Retrieved 2018-10-13.
  11. "Broken But Beautiful: Vikrant Massey and Harleen Sethi's web series is a romantic drama that touches the right chords". Retrieved 27 November 2018.
  12. "Review: 'Chappad Phaad Ke' Is A Twisted Comedy That Tries Too Hard". Archived from the original on 19 అక్టోబరు 2019. Retrieved 23 October 2019.
  13. "Upstarts is a heartwarming journey of friendship and ambition". Mid Day. 4 October 2019. Retrieved 6 October 2019.
  14. "WATCH! Fuh se Fantasy Episode 7, #Fantasy 7: The Girl Next Door". Voot. Retrieved 3 May 2019.[permanent dead link]
  15. "Broken but Beautiful Season 2 review: Harleen Sethi, Vikrant Massey make love messier and even more intriguing". Firstpost. 3 December 2019. Retrieved 3 December 2019.
  16. "ZEE5's original film Shukranu to be a humorous take on sterilisation". indianexpress. 3 December 2019. Archived from the original on 24 March 2020. Retrieved 2020-02-14.
  17. "Dilphire Cast & Crew: Known all about the Karan Kundra and Sheetal Thakur starrer". Bollywood Hungama. Retrieved 29 October 2021.