శుభా పూంజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శుభా పూంజా
శుభ
జననం (1978-08-05) 1978 ఆగస్టు 5 (వయసు 45)
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం

శుభా పూంజా (జననం 1978 ఆగష్టు 5) భారతీయ నటి, మాజీ మోడల్. ఆమె ఎక్కువగా కన్నడ, తమిళ సినిమాలలో నటించింది.

మొగ్గిన మనసు చిత్రంలో రాధిక పండిట్‌తో పాటు ప్రధాన పాత్ర పోషించినందుకు ఆమె బాగా ప్రసిద్ది చెందింది, దీని కోసం ఆమె కన్నడలో ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.

2003లో తన కెరీర్‌ను ప్రారంభించి, రెండు దశాబ్దాలలో దాదాపు 50 సినిమాలు పూర్తి చేసింది. ఆమె 2008, 2012ల మధ్య కన్నడ సినిమాలో ప్రముఖ నటీమణులలో ఒకరిగా స్థిరపడింది. ఆమె టెలీవిజన్ షోలలో, తన యూట్యూబ్ ఛానెల్‌లో నటనతో కూడా అత్యంత ప్రజాదరణ పొందింది.

కెరీర్[మార్చు]

శుభ పూంజా తుళువ కమ్యూనిటీ నుండి మంగళూరు సంతతికి చెందినది.[1] ఆమె బెంగుళూరులో పెరిగింది. జయనగర్ లోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ లో చదువుకుంది. ఆమె మోడలింగ్, వివిధ టెలివిజన్ యాడ్స్‌లతో కెరీర్ ప్రారంభించింది.[2][3]

ఆమె "మిస్ చెన్నై-టాప్ మోడల్ 2003" టైటిల్ గెలుచుకుంది.[4] ఆ తరువాత, ఆమె తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. తమిళ చిత్రం మాచిలో ఆమె ప్రధాన పాత్రను పోషించింది.[5] తిరుదియ ఇధయతై, షణ్ముగ చిత్రాలలో నటించిన తర్వాత, ఆమె 2006 చిత్రం జాక్‌పాట్‌తో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. చందా, మొగ్గిన మనసు, స్లమ్ బాలా, థాకత్ చిత్రాలలో నటించిన ఆమెకు బ్యాక్ టు బ్యాక్ హిట్‌లతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కింది

జై మారుతి 800 వాణిజ్యపరంగా విజయం సాధించింది. కన్నడ చలనచిత్ర పరిశ్రమలో మహిళల కోసం ఒక స్పోర్ట్స్ రియాలిటీ షో అయిన సూపర్ కబడ్డీకి ఆమె సలహాదారుల్లో ఒకరు. ఒక బృందానికి నాయకత్వం వహించింది కూడా. దీని తరువాత, ఆమె కన్నడ రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ - సీజన్ 8 లో పాల్గొంది. సీజన్ 1 నుండి హౌస్‌లో ఉండటానికి చాలా మంది ఎదురుచూస్తున్న సెలబ్రిటీలలో ఆమె ఒకరు. దాదాపు ముగింపు వరకు ఆమె ఇంట్లోనే ఉండిపోయింది.

ఆమె చేసిన నరగుండ బండయ్య, రైమ్స్, అంబుజా వంటి చిత్రాలు ఏవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే, ఆమె కథానాయికగా పాత్ర పోషిస్తూనే, మొదటిసారి నిర్మాతగా కూడా వ్యవహరించిన 3దేవి (2022) చిత్రం విజయం సాధించింది.

ఆమె ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పలు అవార్డులను గెలుచుకుంది.

వ్యక్తిగతం[మార్చు]

శుభాపూంజా బిగ్ బాస్‌లో చేరిన తర్వాత, ఆమె తన బాయ్‌ఫ్రెండ్ సుమంత్ బిల్లవ ను జనవరి 2022లో వివాహం చేసుకుంది.[6]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2004 మాచి రక్షిత తమిళం
2005 తిరుదియ ఇధయతై హరిత తమిళం
2006 జాక్‌పాట్ ప్రీతి కన్నడ
ఓరు పొన్ను ఓరు పైయాన్ శుభా తమిళం
2007 చందా స్వప్న కన్నడ
2008 మొగ్గిన మనసు రేణుక కన్నడ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - కన్నడ
స్లమ్ బాలా మల్లిగ కన్నడ
సుత్త పజం వందన తమిళం
2009 అంజదిరు ఉత్తర కన్నడ
థాకత్ భాగ్య (భాగీరథి) కన్నడ
2010 ప్రీతి హంగామా గీత కన్నడ
నారీ అడ్డా కన్నడ
2011 కంఠీరవ ఇంద్రుడు కన్నడ
నానాల్ల భవ్య కన్నడ
2012 గోల్మాల్ ప్రీతి కన్నడ
2013 పరారీ ఊర్మిళ కన్నడ
2014 చిరయు కన్నడ
2015 కోటిగొండ్ లవ్ స్టోరీ కన్నడ
2016 తర్లే నాన్ మక్లూ కన్నడ
జై మారుతీ 800 స్మిత కన్నడ
సిగండూరు చౌడేశ్వరి మహిమే కన్నడ
2017 మీనాక్షి మీనాక్షి కన్నడ
తాతన్ తిథి మొమ్మగన్ ప్రస్తా సంజన కన్నడ
2018 గూగల్ నందిని కన్నడ
కెలవు దినగల నంతరా ప్రియా కన్నడ
రాజా రాధను ప్రేమిస్తాడు రుక్కు కన్నడ
2019 జయమహల్ జయ కన్నడ
2020 నరగుండ బందాయ కన్నడ
2021 బీరా శుభా కన్నడ
2022 రైమ్స్ కన్నడ
2023 అంబుజా నందిని కన్నడ
3దేవి కన్నడ నిర్మాతగా కూడా

మూలాలు[మార్చు]

  1. "Shooting of Kannada film "Chirayu" at padubidri beach". Padubidri News.com. Archived from the original on 1 July 2018. Retrieved 21 July 2017.
  2. "Shuba - The new girl!". Sify. Archived from the original on 15 July 2012. Retrieved 27 May 2009.
  3. "Mangalorean Actress Shuba Punja Hits 'Jackpot'". mangalorean.com. Archived from the original on 11 అక్టోబర్ 2012. Retrieved 27 May 2009. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  4. "Mangalorean Actress Shuba Punja Hits 'Jackpot'". mangalorean.com. Archived from the original on 11 అక్టోబర్ 2012. Retrieved 27 May 2009. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  5. "Shuba Punja: Sreedevi is my role model". IndiaGlitz.com. Archived from the original on 22 April 2005. Retrieved 27 May 2009.
  6. "Shubha Poonja ties the knot with Sumanth Billava - Times of India". web.archive.org. 2023-10-28. Archived from the original on 2023-10-28. Retrieved 2023-10-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)