శైలజామిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శైలజామిత్ర
జననంశైలజామిత్ర
1966, జనవరి 15
చిత్తూరు జిల్లా, చిన్నగొట్టిగల్లుగ్రామం
నివాస ప్రాంతంహైదరాబాదు
వృత్తిఆకాశవాణి ఎఫ్ .ఎమ్ రైన్ బో కోఆర్డినేటర్ స్టాఫ్ రిపోర్టర్ (టుడే ఫ్రీడమ్ )
ప్రసిద్ధిరచయిత్రి, కవయిత్రి
ఎత్తు5'
మతంహిందు
భార్య / భర్తసత్యమిత్ర మటేటి
పిల్లలువనమాలి, సుచరిత
తండ్రితెలికిచెర్ల శేషగిరిరావు
తల్లిఅనసూయాదేవి

శైలజామిత్ర 1966 జనవరి 15తేదీ చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు గ్రామంలో తెలికిచెర్ల శేషగిరిరావు, అనసూయాదేవి దంపతులకు జన్మించారు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ.చదివారు. జర్నలిజంలో స్నాతకోత్తర డిప్లొమా చేసారు. 1997 నుండి విరివిగా రచనలు చేయడం ప్రారంభించారు . వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు, కథలు, నవలలు ప్రచురించారు . అనువాదం కూడా చేసారు. రాయలసీమ, చిత్తూరు జిల్లా వాస్తవ్యులైన శైలజామిత్ర దాదాపు 30 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేస్తున్నారు. ముక్కుసూటి దానం, నిజాయితీ పెట్టుబడిగా ఉన్న వీరు అందుకోవాల్సిన పురస్కారాలు, అభినందనలు అందుకోలేక పోయారనే చెప్పాలి. అయినా తన అక్షరాలకు విలువ ఉందని, అవి ఏనాటికైనా ప్రజలని పలకరిస్తాయని నమ్మకంగా చెబుతారు. పరుగులు తీసినా అందుకు ఒక పద్ధతి ఉండాలని కోరుకుంటారు. కొన్నాళ్ళు ఆకాశవాణి లో ఎఫ్ ఎం లో డి.ఏ.ఓ గా రెండు సంవత్సరాలు పని చేసి, ప్రస్తుతం ఉషోదయ వెలుగు అనే ఆధ్యాత్మిక పత్రికలో అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్నారు. . ఈ రచనలతో పాటుగా దాదాపు 675 గ్రంథాలకు సమీక్ష చేసి ప్రముఖ విమర్శకురాలిగా ప్రముఖుల అభినందనలు అందుకున్నారు. అలాగే 68 సాంఘిక, ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు. నిరంతరం సాహిత్యమే శ్వాసగా జీవించే వీరికి తెలుగు సాహిత్యంలో తగిన స్థానం దక్కుతుందనే ఆశిద్దాం.

రచనలు[మార్చు]

 1. శంఖారావం (కవితా సంపుటి)
 2. మనోనేత్రం (కవితా సంపుటి)
 3. నిశ్శబ్దం (కవితా సంపుటి)
 4. అగ్నిపూలు (కవితా సంపుటి)
 5. అంతర్మథనవేళ (కవితా సంపుటి)
 6. Silver Lines
 7. Glowing Flowers (అనువాదం )
 8. Hard Working Earth (అనువాదం )
 9. Voice of Water (అనువాదం )
 10. రాతిచిగుళ్ళు (కవితా సంపుటి)
 11. తడిసి ముద్దయిన కాలం (కవిత సంపుటి)
 12. సృష్టి కేతనం ( దీర్ఘ కవిత )

[1]

 1. తరంగాలు (కథల సంపుటి)
 2. అడ్డా (కథల సంపుటి)
 3. ఆకుపచ్చని జాబిల్లి (చిత్ర మాసపత్రిక అనుబంధ నవల)
 4. ఏ నావది ఏ తీరమో ( ఆంధ్రభూమి దినపత్రికలో ధారావాహికం )
 5. నేల మీది నక్షత్రాలు (తెలుగు పొయట్రీ.కాంలో ధారావాహికం )

సన్మానాలు,సత్కారాలు[మార్చు]

 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం
 • అఖిల భారత భాషాసాహిత్య సమ్మేళన్, భోపాల్ వారిచే సాహితీయువరత్న, సాహిత్యశ్రీ బిరుదులు
 • దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం
 • శ్రీశ్రీ అవార్డు
 • ఆరుద్ర పురస్కారం
 • జ్వాలాముఖి పురస్కారం
 • ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు

మూలాలు[మార్చు]

 1. [1] Archived 2014-03-31 at the Wayback Machine అస్తిత్వవేదన, అనుభూతి సాంద్రతల ‘రాతిచిగుళ్ళు’-ద్వా.నా.శాస్త్రి సమీక్ష

ఇతర లింకులు[మార్చు]