Jump to content

శోభన సమర్థ్

వికీపీడియా నుండి
శోభన సమర్థ్
జననం
సరోజ్ శిలోత్రి

(1916-11-17)1916 నవంబరు 17
బాంబే, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటీష్ రాజ్ (నేటి ముంబై, మహారాష్ట్ర, భారతదేశం)
మరణం2000 ఫిబ్రవరి 9(2000-02-09) (వయసు 83)
జాతీయతఇండియన్
వృత్తినటి, దర్శకురాలు, నిర్మాత
జీవిత భాగస్వామికుమార్‌సేన్ సమర్థ్
భాగస్వామిమోతీలాల్
పిల్లలు4; నూతన్, తనూజ సహా
తల్లిదండ్రులు
  • ప్రభాకర్ శిలోత్రి (తండ్రి)
  • రత్తన్ బాయి (తల్లి)
బంధువులుముఖర్జీ-సమర్థ్ కుటుంబం

శోభనా సమర్థ్ (1916 నవంబరు 17 - 2000 ఫిబ్రవరి 9) భారతీయ నటి, దర్శకురాలు, నిర్మాత. ఆమె టాకీ సినిమాల రోజులలో తన కెరీర్ ని ప్రారంభించింది. 1950లలో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రధాన పాత్రలతో ఆమె మెప్పించింది.

ఆమె మొదటగా మరాఠీ చిత్రసీమలో అడుగుపెట్టింది. తన మొదటి హిందీ చిత్రం నిగహెన్ నఫ్రత్ 1935లో విడుదలైంది. 1943లో రామ్ రాజ్య చిత్రంలో సీత పాత్ర పోషించి అందరికి చిరకాలం గుర్తుండిపోయింది. ఆమె కళలకు చేసిన కృషికి 1997లో ఫిల్మ్‌ఫేర్ ప్రత్యేక అవార్డుతో సత్కరించింది.

ఆమె కుమార్తెలు నూతన్, తనూజ కెరీర్‌ను ప్రారంభించిన జంట చిత్రాలకు స్వయంగా దర్శకత్వం వహించి, నిర్మించింది శోభన సమర్థ్.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ముంబైకి చెందిన దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కుమార్‌సేన్ సమర్థ్‌ను శోభన వివాహం చేసుకుంది. వారికి నూతన్, తనూజ, చతుర అనే ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు జైదీప్ ఉన్నారు. అయితే ఈ జంట స్నేహపూర్వకంగా విడిపోయారు. ఆ తరువాత నటుడు మోతీలాల్ రాజ్‌వంశ్‌తో ఆమెకు అనుబంధం ఏర్పడింది.[2][3]

ఆమె ఇద్దరు కుమార్తెలు నూతన్, తనూజ కూడా నటీమణులు అయ్యారు. ఆమె మరో కుమార్తె చతుర కళాకారిణి. ఆమె కుమారుడు జైదీప్ ప్రకటనల చిత్ర నిర్మాత.

నూతన్ కుమారుడు మోహ్నీష్ బహల్ కూడా నటుడే, అలాగే తనూజా కుమార్తెలు కాజోల్, తనీషా ముఖర్జీ కూడా నటనారంగంలోనే ఉన్నారు. నటుడు అజయ్ దేవగన్‌ను కాజోల్ వివాహం చేసుకుంది. తనూజ భారతీయ దర్శకుడు, రచయిత, నిర్మాత కూడా అయిన షోము ముఖర్జీని వివాహం చేసుకుంది.[4] 2000లో క్యాన్సర్‌తో శోభన సమర్థ్ మరణించింది.[5]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

నటిగా

[మార్చు]
   విలాసి ఈశ్వర్ (1935)
   నిగా-ఎ-నఫ్రత్ (1935)
   దో దివానే (1936)
   కోకిల (1937)
   పతి పత్ని (1939)
   అప్ని నగరియ (1940)
   సవేరా (1942)
   విజయ లక్ష్మి (1943)
   రామరాజ్య (1943)
   నౌకర్ (1943)
   మహాసతి అనసూయ (1943)
   వీర్ కునాల్ (1945)
   తారామతి (1945)
   షాకర్ (1947)
   సతి తోరల్ (1947)
   మాలిక (1947)
   రాంబన్ (1948)
   నరసింహ అవతార్ (1949)
   హమారీ బేటీ (1950)
   రామజన్మ (1951)
   ఇన్సానియత్ (1955)
   లవ్ ఇన్ సిమ్లా (1960)
   ఛలియా (1960)
   చిత్రలేఖ (1964)
   నై ఉమర్ కీ నై ఫసల్ (1965)
   వహన్ కే లాగ్ (1967)
   ఏక్ బార్ మూస్కురా దో (1972)
   దో చోర్ (1972)
   పాణితీరత వీడు (1973)
   ఘర్ ద్వార్ (1985)

దర్శకురాలిగా

[మార్చు]
  • హమారీ బేటీ (1950)
  • ఛబిలి (1960)
  • షావుకర్

మూలాలు

[మార్చు]
  1. "Shobhna Samarth produced daughter Tanuja's debut film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 6 November 2020.
  2. D, Johnny. "Star couples search for love". Hindustan Times. Retrieved 25 December 2016.
  3. Rediff On The Net
  4. "Kajol's Feminist Role Models: Grandmother Shobhna Samarth, Great-Grandmother Rattan Bai". NDTV.com. Retrieved 6 November 2020.
  5. "Shobhana Samarth dead". The Indian Express. 10 February 2000. Retrieved 5 June 2017.