Jump to content

శోభిత శివన్న

వికీపీడియా నుండి
శోభిత శివన్న
జననం (1992-09-23) 1992 సెప్టెంబరు 23 (వయసు 32)
మరణం2024 నవంబరు 30(2024-11-30) (వయసు 32)
మరణ కారణంఆత్మహత్య
జాతీయతభారతీయురాలు
వృత్తివీజే, నటి
క్రియాశీల సంవత్సరాలు2015 - 2024

శోభిత శివన్న (1992 సెప్టెంబరు 23 - 2024 నవంబరు 30) భారతీయ వీడియో జాకీ, నటి. ప్రధానంగా కన్నడ వినోద పరిశ్రమకు చెందిన ఆమె రాజ్ మ్యూజిక్ ఛానెల్‌లో వీజేగా కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె పలు కన్నడ సీరియల్స్‌తో పాటు తెలుగులోనూ నటించింది. కుమార్ దత్ సినిమా ఎరడోండ్ల మూరు (2015)తో ఆమె శాండల్ వుడ్ అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె చందన్ కుమార్, శ్వేతా పండిట్‌లతో కలిసి నటించింది. 2018లో ఆమె అమర్ గౌడ దర్శకత్వంలో వచ్చిన ఎటిఎమ్ (అటెంప్ట్ టు మర్డర్), ఎంఎస్ త్యాగరాజ్ రూపొందించిన కవి చిత్రాలలో నటించింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆమె 1992 సెప్టెంబరు 23న బెంగళూరులో జన్మించి, అక్కడే విద్యాభ్యాసం చేసింది. బాల్డ్‌విన్ గర్ల్స్ హై స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీని అభ్యసించింది.

మరణం

[మార్చు]

హైదరాబాదులో తాను ఉంటున్న ఆపార్ట్ మెంట్‌లో 2024 నవంబరు 30న ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత సంవత్సరమే సుధీర్‌రెడ్డిని పెళ్లి చేసుకున్న ఆమె భర్తతో కలిసి ఉంటోంది[1][2].

మూలాలు

[మార్చు]
  1. "Shobitha Shivanna: కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి | kannada-actress-shobitha-shivanna-dies-in-hyderabad". web.archive.org. 2024-12-02. Archived from the original on 2024-12-02. Retrieved 2024-12-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. India, Aaj (2024-12-02). "Kannada TV Actor Shobitha Shivanna Found Dead at Home". Aaj India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-12-02.