శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల
(శ్రీత్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల నుండి దారిమార్పు చెందింది)
రకం | ప్రభుత్వ విద్యా సంస్థ |
---|---|
స్థాపితం | 1952 |
ప్రధానాధ్యాపకుడు | రాఘవ్ రాజ్భట్ |
విద్యార్థులు | 1300 |
చిరునామ | ఈడెన్ బాగ్, రాంకోఠీ, హైదరాబాదు, తెలంగాణ, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
జాలగూడు | http://stgcmd.com/ |
శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల హైదరాబాదులోని ప్రసిద్ధిచెందిన సంగీత, నృత్య కళాశాల.[1] ఇది రాంకోఠీ ప్రాంతంలో కలదు. మొదట్లో ఈ కళాశాల సాంకేతిక విద్యాశాఖ నియంత్రణలో పనిచేసేది. ప్రస్తుతం భాషా సాంస్కృతిక శాఖ నియంత్రణలో ఉంది. ఇది పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.[2]
ఇది 1952 సంవత్సరంలో స్థాపించబడినది.
కోర్సులు
[మార్చు]ఈ కళాశాలలో నాలుగు సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సు, రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సు ఈ క్రింది విభాగాలలో ప్రవేశ పెట్టారు[1].
- కర్ణాటక సంగీతం (గాత్రం)
- హిందుస్థానీ సంగీతం (గాత్రం)
- కూచిపూడి నృత్యం
- భరతనాట్యం
- పేరిణి నృత్యం
- కథక్ నృత్యం
- వీణ
- వేణువు
- వయోలిన్
- తబలా
- మృదంగం
- సితార్
- డోలు
సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి అభ్యర్థికి కనీసం 10 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. డిప్లొమా కోర్సులో చేరడానికి ఆ విభాగంలో సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణుడై ఉండాలి.
పూర్వ విద్యార్థులు
[మార్చు]ఈ కళాశాలలో చదువుకొన్న కొందరు కళాకారులు[1].
- రాధా రెడ్డి, రాజా రెడ్డి
- సబిత - సినిమా నటి
- మాధవి
- అలేఖ్య పుంజాల
- ఊటుకూరు భూదేవి
- డి.శేషాచారి
- గంగాధర శాస్త్రి
- కోవెల శాంత
- మహావాది సరిత
పూర్వ అధ్యాపకులు
[మార్చు]ఈ కళాశాలలో పనిచేసిన కొందరు కళాకారులు[1].
- జి.ఎన్.దంతాలె (ప్రిన్సిపాల్)
- నూకల చినసత్యనారాయణ (ప్రిన్సిపాల్)
- శ్రీరంగం గోపాలరత్నం (ప్రిన్సిపాల్)
- ఆకెళ్ల మల్లికార్జునశర్మ
- నేదునూరి కృష్ణమూర్తి
- లలిత
- హరిప్రియ
- వాసా పద్మనాభం
- పుచ్చా శేషయ్య శాస్త్రి
- ఉమా రామారావు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 వెబ్ మాస్టర్. "Sri Thyagaraja Government College of Music & Dance". stgcmd. Govt of Telangana Department of Language and Culture. Archived from the original on 16 డిసెంబరు 2019. Retrieved 21 June 2020.
- ↑ "తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల జాబితా". Archived from the original on 2020-06-23. Retrieved 2020-06-21.