Jump to content

శ్రీదేవీ శ్రీకాంత్

వికీపీడియా నుండి

శ్రీదేవీ శ్రీకాంత్‌, తెలుగు రచయిత్రి. సాహితీరంగంలో ఇప్పటివరకు 150కి పైగా కథలు, రెండు వందలకు పైగా కవితలు, అనేక నానీలు, భక్తి పాటలు, హైకూలు, జానపద పాటలు రాశారు. లలితకళల్లో కూచిపూడి, భరతనాట్యం, వీణ వాద్యంలో ప్రావీణ్యం సాధించారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

శ్రీదేవీ శ్రీకాంత్ స్వస్థలం తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు. ఆఫ్రికాలోని బోట్స్‌వానా దేశంలో క్లినికల్‌ సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఐదు సబ్జెక్టులలో స్నాతకోత్తర పట్టా, రెండు పరిశోధన పట్టాలు (క్లినికల్‌ సైకాలజీ, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌) సాధించినారు.

రచనారంగం

[మార్చు]

రెండు వందలకు పైగా గజల్స్‌ తో ఒక పుస్తకం, ఆంగ్ల కవితలతో ఒక పుస్తకం, మానసిక తత్త్వానికి సంబంధించి నాలుగు ఆంగ్ల పుస్తకాలు రాశారు. రేడియోలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కథలపై వివరణాత్మక సమీక్షలు చేస్తుంటారు. సాహిత్యంతో పాటు చిత్ర లేఖనంలోనూ అనేక బహుమతులు, సన్మానాలు అందుకొన్నారు. 2023 తానా మహాసభల్లో కథాకేళి పోటీల న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.[2] ముల్కనూరు సాహితీ పీఠం కథల పోటీల్లో 2021లో "బతుకమ్మ" కథకు ₹5,000 బహుమతి, 2022లో "ప్రసవం ఓ ప్రణవం" కథకు విశిష్ట కథకురాలిగా గుర్తింపును పొందారు.

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2022-09-11). "బతుకమ్మ". www.ntnews.com. Archived from the original on 2022-09-12. Retrieved 2023-08-05.
  2. telugu, telugu samayam (2023-06-30). "తానా 'కథాకేళి' పోటీలు విజయవంతం.. విజేతలు వీరే". telugu.samayam.com. Retrieved 2023-08-05.