శ్రీలక్ష్మి గోవర్ధనన్
శ్రీలక్ష్మి గోవర్ధనన్ | |
---|---|
ശ്രീലക്ഷ്മി ഗോവർധനൻ | |
జననం | |
జాతీయత | ఇండియన్ |
విద్య | ఎం.ఎస్సీ (సైకలాజికల్ కౌన్సెలింగ్), మోంట్‌ఫోర్ట్ కాలేజ్ బెంగళూరు, 2003–04 హిప్నోథెరపీలో అడ్వాన్స్ కోర్సు, AHAM త్రిసూర్, 2008 |
వృత్తి | కూచిపూడి, ఆర్టిస్ట్, కొరియోగ్రాఫర్, టీచర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2001 - ప్రస్తుతం |
శ్రీలక్ష్మి గోవర్ధనన్ (జననం 1980 జూన్ 1) భారతదేశానికి చెందిన కూచిపూడి కళాకారిణి.[1][2]
కెరీర్
[మార్చు]కేరళకు చెందిన ఆమె కూచిపూడి గ్రామానికి వెళ్లి ఆంధ్రుల శాస్త్రీయ కళారూపాన్ని నేర్చుకుని, చాలా కృషి, అంకితభావం, పట్టుదలతో అందులో ప్రావీణ్యం సంపాదించింది.[3]
ఆమె ఫుట్‌వర్క్, అభినయంకి ప్రసిద్ధి చెందింది.[4] ఆమె కూచిపూడిలో పసుమర్తి రత్తయ్య శర్మ, వైజయంతి కాశీ, మంజు బార్గ్గవీ వంటి ప్రముఖ గురువుల వద్ద శిక్షణ పొందింది. కూచిపూడి యక్షగానానికి చెందిన అత్యంత ప్రామాణికమైన కళాకారుడు పసుమర్తి రత్తయ్య శర్మ అరుదైన శిష్యులలో ఆమె ఒకరు.
శ్రీలక్ష్మి గోవర్ధనన్ కూచిపూడి అందాన్ని సజీవంగా తీసుకురావడానికని ఆమె సామర్థ్యానికి విస్తృతంగా ప్రశంసలు అందుకుంది.[5][6] ఆమె కేరళ సంగీత నాటక అకాడమీ నుండి 'కళాశ్రీ'- రాష్ట్ర అవార్డు, నారద గానసభ చెన్నై నుండి బిన్‌ఫీల్డ్ ఎండోమెంట్, భారతం యువ కళాకార్, కళా రత్న, సింగర్ మణి, నాట్య రత్న, నలనాద నృత్య నిపుణ వంటి అనేక బిరుదులు, గౌరవాలను అందుకుంది. ఆమె ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్లో కళాకారిణి, అలాగే దూరదర్శన్ ఆర్టిస్ట్ కూడా.
వివిధ భారతీయ నృత్య ఉత్సవాల్లో ప్రదర్శన ఇవ్వడమే కాకుండా, ఆమె నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, కొలంబియా, జోర్డాన్, గల్ఫ్ దేశాలలో వివిధ అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చింది. జర్మనీలోని హన్నోర్ మెస్సే, 2015లో జరిగిన మేక్ ఇన్ ఇండియా(Make in India) కార్యక్రమంలో కూచిపూడి బృందం నాయకురాలిగా, భారత ప్రధాని సమక్షంలో ఆమె ప్రదర్శన ఇచ్చింది. 34 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను సందర్శించిన 'దుబాయ్‌లో మర్హబా నమో' ప్రారంభ కార్యక్రమానికి భారతీయ నృత్య సంగమం కొరియోగ్రాఫ్ చేయడానికి కూడా ఆమెను ఆహ్వానించారు. ఆమె అనేక నృత్య సంబంధిత వర్క్‌షాప్‌లు, ఈవెంట్‌లను కూడా రూపొందించింది. కేరళ సంగీత నాటక అకాడమీ వరుసగా మూడు సంవత్సరాలు నిర్వహించే వార్షిక నృత్య వర్క్‌షాప్, నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ 'రసవికల్పం'కు సమన్వయకర్తగా ఉంది.
ఆమె అవంతిక స్పేస్ ఫర్ డ్యాన్స్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ కూడా. ఇది కూచిపూడి నేర్చుకోవడంతో పాటు పరిశోధనకు అంకితమైన వేదిక. ఆమె మలయాళ చలనచిత్రాలు కన్యకా టాకీస్, ప్రియమానసం ల కోసం నృత్య కొరియోగ్రఫీ చేసింది.
ఆమె శిక్షణ పొందిన ప్రొఫెషనల్ సైకాలజిస్ట్, ఆమె నృత్యం, సైకలాజికల్ కౌన్సెలింగ్‌లో తన నైపుణ్యాన్ని ఉపయోగించుకుని తన కళ ద్వారా యువతీయువకులకు బోధిస్తుంది.
కూచిపూడి వర్క్‌షాపులు
[మార్చు]- ఆమె ప్రముఖంగా నిర్వహించిన కూచిపూడి వర్క్‌షాప్‌లు:
- కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని మాహేలో కూచిపూడి వర్క్‌షాప్[7]
- 2015లో SPICMACAY కోసం కేరళలోని కొట్టక్కల్‌లో కూచిపూడి వర్క్‌షాప్[8]
- ఎర్నాకులంలో కూచిపూడి వర్క్‌షాప్ (2011)
- స్విట్జర్లాండ్‌లో కూచిపూడి వర్క్‌షాప్ (2007)[9]
- చిన్మయ మిషన్ కోసం కాలికట్లో కూచిపూడి వర్క్‌షాప్ (2010)[10]
మూలాలు
[మార్చు]- ↑ Kaladharan, V. (29 October 2015). "Evocative expressions". The Hindu.
- ↑ M., Athira (1 November 2018). "Sreelakshmy Govardhanan on understanding Kuchipudi". The Hindu.
- ↑ Dave, Ranjana (7 February 2018). "Solo act". The Hindu.
- ↑ George, Liza (10 November 2011). "I exist because of Kuchipudi". The Hindu.
- ↑ Naha, Abdul Latheef (28 June 2015). "Kuchipudi exponent enthrals students". The Hindu.
- ↑ Chakra, Shyamhari (1 August 2014). "Season of solos". The Hindu.
- ↑ "Kuchipudi Workshop by Sreelakshmi Govardhanan - Art India Updates". Artindiaupdates.com. 8 May 2016. Archived from the original on 13 జూలై 2018. Retrieved 1 August 2018.
- ↑ "Sreelakshmy Govardhanan's Kuchipudi Workshop at Thrissur". Spaceoutkerala.blogspot.com. Retrieved 1 August 2018.
- ↑ "Natya Prapancham - Korzo". Korzo.nl. Archived from the original on 13 జూలై 2018. Retrieved 1 August 2018.
- ↑ "Sreelakshmy Govardhanan - YouTube". YouTube.