శ్రీ భాష్యం విజయసారథి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ భాష్యం విజయసారథి
జననంశ్రీ భాష్యం విజయసారథి
మార్చి 12 1937
India చేగూర్తి, కరీంనగర్, తెలంగాణ
నివాస ప్రాంతంచేగూర్తి, కరీంనగర్
వృత్తిసంస్కృత భాషా పండితుడు, కవి, రచయిత.

శ్రీ భాష్యం విజయసారథి ( జ. మార్చి 12, 1937 ) సంస్కృత భాషా పండితుడు. ప్రతిభ, పరిశోధన, విశ్లేషణ, వ్యాఖ్యాన రీతుల్లో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన కవి. ఎన్నో ఉన్నతమైన రచనలు చేసి వాఖ్యానమూర్తిగా పేరొందారు. ఆయన అమర భాషలో ఆధునికుడు. ఆయనకు తెలంగాణ సంస్కృత వాచస్పతి గా పేరుంది.

జననం[మార్చు]

ఇతను మార్చి 12, 1937 కరీంనగర్ జిల్లాలో చేగూర్తి గ్రామంలో జన్మించారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

అమ్మ నుంచి సంస్కృత బాషా, సంగీతం నేర్చుకున్న ఆయన ప్రతి విషయాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. పదకొండవ ఏటనే శారదా పంథాకిని, 16 ఏట వ శవారి పరివేదన, 17 ఏట మనోహరం రచించారు. మందాకినీ కవిగా మన్నలు పొందిన ఆయన వందకు పైగా సోత్రాలు, సుప్రభాతాలు, దేశభక్తి రచనలు, అధిక్షేప కవితలు, ఆప్త లేఖలు, ఖండకావ్య పరంపర, అనువాద రచనలు, వర్ణన కావ్యాలు రచించారు. భారత భారతి కావ్య సంపుటిలో అరవై శ్లోకాలు రచించి అందులో దేశ స్వాతంత్ర్య సమగ్రతను పరిరక్షించడం కోసం ముందుడాలని సూచించింది ఈ కావ్యం. ఆయన అఖిల భారత స్థాయిలో ముంబై, కోల్కత్తా, నాగపూర్, ఢిల్లీ అనేక నగరాల్లో కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. గత ముపై ఏళ్లుగా మానేరు నది నది తీరాన కరీంనగర్లో బొమ్మకల్ రోడ్లలో యజ్ఞవరాహ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి వేదాల్లోని మౌలిక జ్ఞానాన్ని ప్రాచుర్యం లోకి తెస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట పురస్కారాన్ని అందుకుంటున్న శ్రీ భాష్యం విజయసారథి.

బిరుదులు[మార్చు]

  • వచస్పతి.
  • మహాకవి
  • యుగకవి.
  • రాష్ట్ర కవి.
  • వశ్యవాక్.

పురస్కారాలు[మార్చు]

  • స్వర్ణ కంకణం.
  • క్రియేటివ్ సంస్క్రిట్ పోయెట్.
  • ఉత్తమ సంస్కృత స్కాలర్.
  • తెలంగాణ రాష్ట్ర విశిష్ట పురస్కారం.

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ ఆగస్టు 15 2017