Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

శ్రీభాష్యం విజయసారథి

వికీపీడియా నుండి
శ్రీభాష్యం విజయసారథి
జననంశ్రీభాష్యం విజయసారథి
మార్చి 10 1936
India చేగుర్తి, కరీంనగర్, తెలంగాణ
మరణం2022 డిసెంబరు 28(2022-12-28) (వయసు 86)[1]
కరీంనగర్
నివాస ప్రాంతంకరీంనగర్
వృత్తిలెక్చరర్(రిటైర్డ్)
మతంహిందూ
భార్య / భర్తహేమలత
పిల్లలువరప్రసాద్
తండ్రినరసింహాచార్య
తల్లిగోపమాంబ

శ్రీభాష్యం విజయసారథి ( జ. మార్చి 10, 1936 ) సంస్కృత భాషా పండితుడు. ప్రతిభ, పరిశోధన, విశ్లేషణ, వ్యాఖ్యాన రీతుల్లో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన కవి. ఎన్నో ఉన్నతమైన రచనలు చేసి వాఖ్యానమూర్తిగా పేరొందారు. ఆయన అమర భాషలో ఆధునికుడు. ఆయనకు తెలంగాణ సంస్కృత వాచస్పతి గా పేరుంది. వీరి సాహిత్య కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2020 సంవత్సరం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది.[2][3]

జననం

[మార్చు]

వీరు మార్చ్ 10, 1936 కరీంనగర్ జిల్లాలో చేగుర్తి గ్రామంలో జన్మించారు.[4]

జీవిత విశేషాలు

[మార్చు]

అమ్మ నుంచి సంస్కృతం,సంగీతం వంటబట్టించుకున్న ఆయనలో బాల్యం నుంచే ప్రశ్నించేతత్వం ఉండేది. పదకొండవ ఏటనే శారదా పదకింకిణి, 16వ‌, ఏట శబరి పరిదేవనం, 17 ఏట మనోరమ రచించారు. మందాకిని కవిగా మన్ననలు పొందిన ఆయన వందకు పైగా సోత్రాలు, సుప్రభాతాలు, దేశభక్తి రచనలు, అధిక్షేప కవితలు, ఆప్త లేఖ, ఖండకావ్య పరంపర, అనువాద రచనలు, వర్ణన కావ్యాలు రచించారు. భారత భారతి లో దేశ స్వాతంత్ర్య సమగ్రతను పరిరక్షించడం కోసం ప్రతీ పౌరుడు పాటుపడాలని సూచించారు. ఆయన అఖిల భారత స్థాయిలో ముంబై, కోల్కత్తా, నాగపూర్, ఢిల్లీ వంటి అనేక నగరాల్లో కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. గత ముప్పై ఏళ్లుగా మానేరునది తీరాన కరీంనగర్లో బొమ్మకల్ రోడ్లో యజ్ఞవరాహ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి వేదాల్లోని మౌలిక జ్ఞానాన్ని ప్రాచుర్యం లోకి తెస్తున్నారు.[5][6]

సంస్కృత రచనలు

[మార్చు]

[6]

  • మందాకిని
  • భారతభారతి
  • రాసకేళి
  • సంగీతమాధవం
  • ప్రవీణభారతం
  • విషాదలహరి
  • ఆవాహనం
  • జ్యోతిష్మతి
  • ప్రవీణభారతం
  • ప్రసాదలహరి
  • విషాద లహరి
  • పరివాదిని
  • ఏకాదశి
  • విశ్వకుటుంబిని
  • మనోరమ(నవల)
  • సుశీల (నవల)
  • దంబయోగం( ప్రహసనం)
  • అమరసందేశః ( నాటకం)
  • కామాయణం
  • ఖరం ప్రతి బహిరంగ లేఖ
  • ధర్మనిష్ఠం భవతు రాష్ట్రం
  • ఆప్తలేఖ
  • భ్రాతృలేఖ
  • ప్రహేళికలు
  • సంస్కృతాంధ్ర వసుచరిత్ర తులనాత్మక అధ్యయనం

[6]

బిరుదులు

[మార్చు]
  • మహాకవి
  • యుగకవి
  • రాష్ట్ర కవి
  • వశ్యవాక్
  • సరస్వతీ సుతోత్తంసుడు

[6]

పురస్కారాలు

[మార్చు]
పద్మశ్రీ అందుకుంటున్న శ్రీభాష్యం విజయసారథి
పద్మశ్రీ అందుకుంటున్న శ్రీభాష్యం విజయసారథి
  • తెలంగాణ రాష్ట్ర విశిష్ట పురస్కారం (2017)
  • మహామహోపాధ్యాయ (రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం- తిరుపతి 2018)
  • వాచస్పతి (కేకే బిర్లా ఫౌండేషన్, జైపూర్ 1996)[10]
  • ఇందిరా బెహెరే గోల్డ్ మెడల్ (తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠం)

[6]

మూలాలు

[మార్చు]
  1. విలేఖరి (28 December 2022). "ప్రముఖ కవి, పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి ఇకలేరు". v6వెలుగు. Retrieved 28 December 2022.
  2. "Vice President felicitates three Padma Awardees from Telangana including the ace badminton player Ms PV Sindhu". Global Green News. 22 February 2020. Archived from the original on 24 ఫిబ్రవరి 2020. Retrieved 24 ఫిబ్రవరి 2020.
  3. "Vice President felicitates three Padma Awardees from Telangana". aninews.in (in ఇంగ్లీష్). Archived from the original on 2020-02-24. Retrieved 2020-02-24.
  4. నమస్తే తెలంగాణ ఆగస్టు 15 2017
  5. "Eenadu ePaper". epaper.eenadu.net.
  6. ఇక్కడికి దుముకు: 6.0 6.1 6.2 6.3 6.4 Telangana, Namasthe. "తె‌లం‌గాణ సంస్కృత వాచ‌స్పతి". epaper.ntnews.com.
  7. సాక్షి, ఎడ్యూకేషన్ (25 January 2020). "పద్మ పురస్కారాలు-2020". Archived from the original on 10 ఫిబ్రవరి 2020. Retrieved 10 February 2020.
  8. నమస్తే తెలంగాణ, జాతీయం (25 January 2020). "141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం". Archived from the original on 10 February 2020. Retrieved 10 February 2020.
  9. హెచ్ఎంటీవి, ఆంధ్రప్రదేశ్ (26 January 2020). "పద్మ అవార్డు గ్రహీతల పూర్తి జాబితా". రాజ్. Archived from the original on 10 February 2020. Retrieved 10 February 2020.
  10. "K.K. Birla Foundation". web.archive.org. 21 December 2013. Archived from the original on 21 డిసెంబరు 2013. Retrieved 24 ఫిబ్రవరి 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)